ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎలగందుల నర్సింలు గ్రామ పంచాయతీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్ గరీమా అగ్రవాల్‌కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు కామారెడ్డి నవీన్‌రెడ్డి ఆదివారం తెలిపారు. ఐదు నెలల క్రితం రెండో బైపాస్‌రోడ్డులోని కామారెడ్డి నవీన్‌రెడ్డి ఇంటి నుంచి రెండో బైపాస్‌రోడ్డు వరకు సీసీ రోడ్డు నిర్మించారు. కాగా సర్పంచ్ ఎలగందుల నర్సింలు ఆ రోడ్డును గత నెల 2న జేసీబీ సాయంతో ధ్వంసం చేశాడని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ వెంటనే విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.


