
టీడీపీ నేతల కక్ష సాధింపు
పొదిలి రూరల్: అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు బరితెగిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో సైతం ఏదో రకంగా సమస్యలు సృష్టించి వైఎస్సార్ సీపీ శ్రేణులపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. అన్యాయాన్ని ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేయించి వేధించేందుకు పావులు కదుపుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. పొదిలి మండలంలోని కుంచేపల్లి గ్రామంలో పేరం వీరా బ్రహ్మారెడ్డి 50 ఏళ్ల క్రితం పూర్వకుల నుంచి సంక్రమించిన గ్రామ కంఠం భూమిలో ఇల్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు. ఆయన కుమారుడు నాగిరెడ్డి గ్రామంలోని మరోచోట ఇల్లు నిర్మించగా ప్రస్తుతం అందులో ఉంటున్నారు. పాత ఇంటి స్థలం ఖాళీగా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ నాయకులు నాగిరెడ్డికి చెందిన ఖాళీ స్థలంపై కన్నేశారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం గురువారం జనం లేని సమయంలో అధికారులతో వచ్చి స్థలం చుట్టూ ఏర్పాటు చేసిన కంచె, రాళ్లు పీకేశారు. ఆ సమయంలో ఎవరైనా వచ్చి గొడవ చేస్తే కేసులు బనాయించాలని పథకం రచించారు. ఎవరూ లేనపుడు వచ్చి హడావుడి చేసి కంచె, రాళ్లు తొలగించారని, ఆ స్థలం తమ పూర్వీకుల నుంచి సంక్రమించినదని నాగిరెడ్డి తెలిపారు.
వైఎస్సార్ సీపీ నాయకుడి స్థలంలో కంచె తొలగింపు
పొదిలి మండలం కుంచేపల్లిలో ఘటన

టీడీపీ నేతల కక్ష సాధింపు