
మహనీయుల త్యాగఫలమే..
ఒంగోలు సిటీ: దేశానికి స్వాతంత్య్రం రావడానికి ఎందరో మహనీయుల త్యాగాలే కారణమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డితో పాటు జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహానికి, జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మిగిలిన దేశాలతో పోల్చుకుంటే మన దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందన్నారు. పరిశ్రమలు, శాస్త్రసాంకేతిక రంగాలలో అభివృద్ధి సాధిస్తోందన్నారు. ఆపరేషన్ సింధూర్‌లో దేశం కోసం ఎంతో మంది సైనికులు ప్రాణత్యాగం చేశారన్నారు. కార్యక్రమంలో పార్టీ ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి, బొట్ల రామారావు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, కార్పొరేటర్లు ఇమ్రాన్‌ఖాన్, ప్రవీణ్‌కుమార్, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, ఇంటలెక్చువల్ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రొండా అంజిరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొగ్గుల శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు శ్యాంసాగర్, మహిళా నాయకులు మేరీకుమారి, పేరం ప్రసన్న, వాణి, రజిని, శోభలత, వైఎస్సార్ సీపీ నాయకులు మీరావలి, పులుసు సురేష్, దేవ, శ్రీకాంత్, యోహాను, సన్నీ, డి.అంజిరెడ్డి, దాసరి కరుణాకర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.