
కన్నయ్యా
ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో కొండపి ఏఎంసీ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవం
కృష్ణయ్యా..
ఒంగోలు సంతపేటలోని సాయిబాబా మందిరం వద్ద ఉట్టికొడుతున్న చిన్నారి
కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా శనివారం జిల్లాలోని వైష్ణవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పలు ఆలయాలు, విద్యా సంస్థల్లో చిన్నారుల చేత శ్రీకృష్ణ, గోపికల వేషధారణలు వేయించారు. యువతీ, యువకులు, చిన్నారులు ఉత్సాహంగా ఉట్టికొట్టారు.
ప్రభుత్వ జూనియర్ కాలేజీ క్రీడా మైదానంలో చేసిన కొండపి ఏఎంసీ చైర్మన్ ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు
సాక్షి టాస్క్‌ఫోర్స్: ప్రభుత్వ విద్యా సంస్థల ప్రాంగణంలో విద్యా సంస్థల కార్యక్రమాలు తప్ప ఇతర ప్రైవేటు కార్యక్రమాలు ముఖ్యంగా రాజకీయ పార్టీల కార్యకలాపాలు నిర్వహించవద్దని కూటమి ప్రభుత్వం తరఫున విద్యాశాఖాధికారులు జీఓ జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కానీ సింగరాయకొండ మండల కేంద్రంలోని ఏఆర్‌సీ అండ్ జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజి ఆవరణలో కొండపి వ్యవసాయ మార్కెటింగ్ యార్డు చైర్మన్ పదవీ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా కూటమి పార్టీల నాయకుల ఫ్లెక్సీ లు క్రీడా ప్రాంగణంతో పాటు కాలేజి చుట్టుపక్కల ఏర్పాటు చేశారు. దీనికితోడు ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామితో పాటు మరో ముగ్గురు మంత్రులు, వివిధ రాష్ట్ర స్థాయి బోర్డు చైర్మన్‌లు పాల్గొన్నారు. వీరికి బందోబస్తు కింద దాదాపు 60కి పైగా పోలీసులను ఏర్పాటు చేశారు. ఈ కాలేజి ఆవరణ చుట్టు పక్కల పలు ప్రైవేటు విద్యా సంస్థలు, గృహాలు ఉన్నాయి. ఈ విధంగా జీఓలు వీరే ఇస్తారు.. మళ్లీ జీఓలను వీరే తుంగలో తొక్కటంపై ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వివరణ కోరేందుకు ఎంపీడీఓ, ఎంఈఓ, జిల్లా విద్యాశాఖాధికారిని ఫోన్ ద్వారా అడిగే ప్రయత్నం చేసినా వారు అందుబాటులోకి రాలేదు. దీనిపై వైఎస్సార్ సీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పఠాన్ రియాజ్ విస్మయం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ డొల్లతనానికి నిదర్శనమని ఆక్షేపించారు.
– సాక్షి, ఒంగోలు

కన్నయ్యా