
ఆర్టీసీ బస్సులో మంటలు
టంగుటూరు: షార్ట్ సర్క్యూట్‌తో ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ సంఘటన మండలంలోని వల్లూరు జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. 40 మంది ప్రయాణికులతో ఒంగోలు నుంచి కావలి వెళుతున్న ఆర్టీసీ బస్సు వల్లూరు సమీపంలోకి వచ్చే సరికి బస్సు ముందు భాగంలో మంటలు చెలరేగాయి. బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును ఆపి ప్రయాణికులను కిందకు దించి మంటలను అదుపు చేశారు. అనంతరం ప్రయాణికులను మరో బస్సులో తరలించారు. డ్రైవర్ మంటలను ముందే పసిగట్టడంతో పెనుప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.