టీడీపీ ప్రలోభాలకు లొంగిపోవొద్దు: వైవీ సుబ్బారెడ్డి | Yv Subba Reddy Comments On Tdp | Sakshi
Sakshi News home page

టీడీపీ ప్రలోభాలకు లొంగిపోవొద్దు: వైవీ సుబ్బారెడ్డి

Jul 7 2024 2:59 PM | Updated on Jul 7 2024 3:55 PM

Yv Subba Reddy Comments On Tdp

వైఎస్సార్‌ 75వ జయంతిని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించామని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌ 75వ జయంతిని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించామని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఓటమి తరువాత ఎవ్వరూ డీలా పడాల్సిన అవసరం లేదు.. గెలుపు ఓటములు సహజం... కారణం ఏదైనా కానీ ప్రజా తీర్పుగానే భావించాలి. పార్టీ నాయకులంతా ప్రజలకు అండగా ఉండాలి’’ అని వైవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు.

ఆస్ట్రేలియాలో ఉండే ప్రవాసాంధ్రులతో కూడా మాట్లాడి వైఎస్సార్‌ జయంతి వేడుకల కోసం సందేశం ఇచ్చాను. వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన జడ్పీటీసీ, ఎంపీటీసీ పార్టీకి అండగా ఉంటారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తారు. టీడీపీ ప్రలోభాలకు ఎవరూ లొంగిపోవద్దని సూచించాను. మా పార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీలపై మాకు పూర్తి నమ్మకం ఉంది’’ అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement