‘ఐ-టీడీపీతో లోకేష్‌ చేయిస్తున్న పనే ఇదంతా’ | YSRCP Serious Comments On CBN Govt And Pawan Kalyan | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు హిట్లర్‌, గడాఫీల గతే: రోజా

Nov 18 2024 12:34 PM | Updated on Nov 18 2024 3:14 PM

YSRCP Serious Comments On CBN Govt And Pawan Kalyan

సాక్షి, తిరుపతి: ఏపీలో తప్పు చేయని వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి ఆర్కే రోజా. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐ-టీడీపీ నీచపు పోస్టులు చేసిందని గుర్తు చేశారు. ఇదే సమయంలో ఏపీని హిట్లర్‌, గడాఫీ కలిసి పాలిస్తున్నట్లు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో సోషల్‌ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్ట్‌లపై వైఎస్సార్‌సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం, భూమన కరుణాకర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అమాయక సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమంగా కేసులు బనాయిస్తోంది. కూటమి కార్యకర్తలు, మద్దతుదారులు.. మా పార్టీ నాయకుడు వైఎస్‌ జగన్‌పై,  నాయకులపై అసహ్యకరమైన సోషల్ మీడియా పోస్టులు చేశారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులను ఐ-టీడీపీ ద్వారా వాళ్లే సృష్టించి, అది మాపై నెట్టేస్తున్నారు. అంతటితో ఆగకుండా అమాయకులపై కేసులు పెట్టి చిత్రహింసలు పెడుతున్నారు. ఐ-టీడీపీ ద్వారానే చాలా పోస్టులు వచ్చాయి. వాటిపైనే ఫిర్యాదు చేశాం. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వారికి రిసీవ్డ్ కాపీ ఇవ్వాలి. కానీ, ఇవ్వకుండా మాతో దారుణంగా వ్యవహరించారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాను.

మాజీ మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో తప్పు చేయని వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై పోలీసులు దాడులు చేస్తున్నారు. ఏపీని హిట్లర్‌, గడాఫీ కలిసి పాలించినట్లు ఉంది. చంద్రబాబు, పవన్‌ పాలనలో అదృశ్యమైన మహిళల ఆచూకీ కోసం కూటమి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది?. వైఎస్సార్‌సీపీ హయాంలో వేల సంఖ్యలో మహిళలు, యువకులు మిస్‌ అయ్యారని అబద్ధపు ప్రచారం చేశారు. అసెంబ్లీ సాక్షిగా అసలు నిజాలు బయటకు వచ్చాయి. కేవలం 36 మందే అని తేలింది. ఇది హోంమంత్రే బయటకు చెప్పారు.

చంద్రబాబు తప్పు చేసి ఎదుటివారిపై రుద్దుతున్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. పెద్ద పెద్ద నియంతలే కాలగర్భంలో కలిసిపోయారు.. మీరెంత?. తప్పు చేయని వారిని వెంటనే విడుదల చేయాలి. రాష్ట్రంలో ఎవరికీ న్యాయం చేయలేక డైవర్షన్‌ పాలిటిక్స్‌తో నెట్టుకొస్తున్నారు. మహిళలపై నీచాతినీచంగా పోస్టులు పెడుతున్నారు. మేము ఫిర్యాదు చేస్తే రిసీవ్డ్‌ కాపీ ఇవ్వడానికి వందసార్లు ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారు. పోలీసులు.. మీ నెత్తిపై ఉన్న మూడు సింహాలకు సెల్యూట్ చెసే విధంగా ప్రవర్తించండి’ అంటూ కామెంట్స్‌ చేశారు.

వైఎస్సార్‌సీపీ తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ..‘మేం పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వస్తే పోలీసులు గంటల కొద్ది నిలబెట్టి ఫిర్యాదు తీసుకోవడానికి వెనకాడారు. మాకు ఉన్న ప్రోటోకాల్‌ను విస్మరిస్తే కచ్చితంగా ప్రివిలేజ్‌ మోషన్‌ వేస్తామని హెచ్చరిస్తున్నాను. ప్రజా గొంతుకలను నొక్కే ప్రయత్నాన్ని విరమించుకోవాలి. లేదంటే రాబోయే రోజుల్లో తగిన మూల్యం తప్పదు.

మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ.. మేము ఐ-టీడీపీపై ఫిర్యాదు చేయడానికి వస్తే పోలీసులు కేసు తీసుకోవడం లేదు. ఇంతటి దారుణమైన పోస్టులు పెడుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోరా?. అసభ్యకరంగా, జుగుప్సాకరంగా ఐ-టీడీపీ పోస్టులు పెడుతున్నా చర్యలు లేవు. ఏపీలో రాజ్యాంగ హక్కులు కాలరాశారు. పోలీసులు కేసుల పేరుతో వేధిస్తున్నారు. మేం ఎలాంటి బెదిరింపులకు లొంగ. చంద్రబాబు మీ కూటమి పార్టీల పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజు త్వరలో ఉంది అని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement