AP: అయ్యా చంద్రబాబు.. నిజాలు పరిశీలిద్దామా..? | Ysrcp Questioned Chandrababu Over Amaravathi | Sakshi
Sakshi News home page

అమరావతిపై బాబుకు వైఎస్‌ఆర్‌సీపీ ప్రశ్నలు

Dec 17 2023 4:48 PM | Updated on Dec 17 2023 6:31 PM

Ysrcp Questioned Chandrababu Over Amaravathi - Sakshi

సాక్షి,అమరావతి: తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి తలాతోక లేకుండా మాట్లాడటం చంద్రబాబుకు అలవాటే. తనలాంటి సమర్ధవంతమైన నాయకుడే లేనట్లు బిల్డప్‌ ఇవ్వటం చంద్రబాబు తరచు చేస్తూ ఉంటారు.  ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదో అద్భుతాలు చేసినట్లు వేద వాక్కులు పలికే బాబుగారు.. ఇప్పుడు తాజాగా సీఎం జగన్‌ వల్లే  ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మారిందని కొత్త పలుకులు పలుకుతున్నారు. అమరావతి పేరుతో వేలకోట్ల ఆస్తులు దోచుకుని దాచుకున్న చంద్రబాబు.. అక్కడ గ్రాఫిక్స్‌ను చూపిస్తూ ప్రజలను మాయం చేయడం తప్ప చేసేందేమీ లేదు. ఇదే విషయాన్ని వైఎస్సార్‌సీపీ సూటిగా ప్రశ్నిస్తోంది. 

అయ్యా చంద్రబాబు.. అమరావతి విషయంలో ఒకసారి నిజాలు ఏంటో పరిశీలిద్దామా?? అని వైఎస్సార్సీపీ డిమాండ్‌ చేస్తోంది. అమరావతిని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వీర్యం చేశారని, ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై బాబుకు పలు ప్రశ్నలు సంధించింది వైఎస్‌ఆర్‌సీపీ 

‘రాజధాని పేరిట రైతుల నుంచి 33 వేల ఎకరాలను లాక్కుంది నువ్వు కాదా.? ల్యాండ్ పూలింగ్‌ అంటూ కొత్త పదాలు చెప్పి సింగపూర్ వాళ్ళతో చేతులు కలిపి కుంభకోణానికి తెరలేపింది నువ్వు కదా? సింగపూర్ ప్రభుత్వమని చెప్పి ప్రైవేట్ వ్యక్తులతో లాలూచీ పడింది నువ్వు కాదా..? నీ ఐదేళ్ల పాలనలో గ్రాఫిక్స్ మాయాజాలం తప్పించి ఇంకేం చేశావు చంద్రబాబు’ అని వైఎస్‌ఆర్‌సీపీ ప్రశ్నించింది.

‘నిన్ను నమ్మిన రైతులకు వెన్నుపోటు పొడిచి నట్టేట ముంచావు కదా చంద్రబాబు? మూడు రాజధానులు ఏర్పాటు చేద్దామని అంటే కోర్టులో వందల పిటిషన్ వేయించింది నువ్వు కాదా చంద్రబాబు?? నీ పరపతి అడ్డుపెట్టుకొని రాజధానికి అడుగు ముందుకు పడకుండా చేసింది నువ్వు కాదా చంద్రబాబు? చేసిందంతా చేసి ఇప్పుడు రాజధాని లేదని అంటావా’అని చంద్రబాబు తీరుపై వైఎస్‌ఆర్‌సీపీ మండిపడింది.

ఇదీచదవండి..కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement