గవర్నర్‌ ఆశ్చర్యపోయారు: అంబటి | Ysrcp Leader Ambati Rambabu Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ ఆశ్చర్యపోయారు: అంబటి

Sep 24 2026 7:39 PM | Updated on Sep 24 2026 7:58 PM

Ysrcp Leader Ambati Rambabu Comments On Chandrababu

సాక్షి,గుంటూరు: ‘‘డీఎస్సీ స్కామ్‌లో తప్పిదాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇలా కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆ స్కాం రాష్ట్రంలో సంచలనంగా మారింది’’ అని వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌.. డీఎస్సీలో జరిగిన స్కాం గురించి చెబుతుంటే గవర్నర్ ఆశ్చర్యపోయారన్నారు. చదువుకున్న వారికి ఉద్యోగాలు రావాలి.. వారి కోసం పోరాటం కొనసాగిస్తామని అంబటి అన్నారు.

‘‘డీఎస్సీలో అన్యాయం జరిగిందని విజయవాడ శాప్ కార్యాలయం వద్ద నిరసన తెలిపాం. బ్యాంకుల్లో అకౌంట్ ఓపెన్ చేసినట్లు మా నాయకులు, కార్యకర్తలపై రౌడీషీట్లు ఓపెన్ చేస్తే చూస్తూ ఊరుకోం. 21వ తేదీన ఆందోళన చేస్తామని కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చాం. అక్కడకు వాళ్లు చెబుతున్న గురువులు ఎందుకు వచ్చారు?. లోకేష్ దళం మాపైన దాడి చేస్తే పోలీసులు మాపైన కేసులు పెట్టారు. కొంతమంది పోలీసులు లోకేష్ చెప్పినట్లు చేస్తున్నారు. వాళ్లు పోలీసులు రూపంలో ఉన్న రౌడీలు’’ అంటూ అంబటి దుయ్యబట్టారు.

డీజీపీ, సీపీకి చెప్తున్నా.. మీకు ఎవరెవరు కావాలో పేర్ల లిస్టు ఇస్తే వాళ్లందరం ప్రత్యేక బస్సుల్లో విజయవాడ కమిషనర్ కార్యాలయానికి వస్తాం. మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయండి. రాత్రిపూట దొంగచాటుగా కోర్టులో హాజరు పరచడానికి సిగ్గుండాలి. ఎస్సీలుపైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి పోలీసులకు సిగ్గుండాలి. నన్ను ఇవాళ విచారణకు రమ్మని ఈడీ చెప్పలేదు’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఆరోగ్యశ్రీలో వికసించిన 'అవినీతి'


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement