కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారు: లక్ష్మీ పార్వతి | ysrcp laxmi parvathi slams on chandrababu and purandeswari | Sakshi
Sakshi News home page

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారు: లక్ష్మీ పార్వతి

May 8 2024 4:52 PM | Updated on May 8 2024 5:38 PM

ysrcp laxmi parvathi slams on chandrababu and purandeswari

విశాఖపట్నం: చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిపోతున్నారని వైఎస్సార్‌సీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి అన్నారు. చంద్రబాబు అండ్ కొ సంఘ విద్రోహులని మండిపడ్డారామె.బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఎన్టీఆర్ వెన్నుపోటులో పురందేశ్వరి ప్రధాన పాత్ర పోషించింది. నేతి బీరకాయలో నెయ్యి లాంటిది పురందేశ్వరి మంచితనం. పురందేశ్వరి కూడా చంద్రబాబు లాంటి మనిషే. ఎఫ్‌ఐఆర్‌లో వైఎస్సార్‌ పేరును చేర్చిన కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరడం ఏమిటి..?. వీరందరినీ చంద్రబాబు ఆడిస్తున్నారు. 

రాజకీయ నీచుడు చంద్రబాబు. చంద్రబాబు కంటే సీఎం జగన్ అధిక పెట్టుబడులు తీసుకొచ్చారు. ఏపీ అభివృద్ధిలో విశాఖ కీలకం. ఏం మాట్లాడాలో అర్ధంకాక బాబు ఇచ్చిన స్క్రిప్ట్ మోదీ చదివారు. సీఎం జగన్‌ను గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాలి అంటే సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి రావాలి. 

నేను రాష్ట్రం మొత్తం తిరిగాను. గీతం మూర్తి ఎన్టీఆర్ వెన్నుపోటులో కీలక పాత్ర పోషించిన దుర్మార్గుడు. గీతం భరత్‌ను ఓడించాలి. గీతం అంటేనే భూ కబ్జాలు. ఏయూను నాశనం చెయ్యాలనే ఉద్దేశంతోనే గీతంను అభివృద్ధి చేశారు’ అని లక్ష్మీపార్వతి మండిపడ్డారు.
 

Advertisement
 
Advertisement
Advertisement