భోపాల్: మధ్యప్రదేశ్ రాజ్‌గఢ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కాల్వలో పడి మినీ వ్యాన్ వరద ప్రవాహానికి కొట్టుకపోయింది. ఈ ప్రమాదంలో తొమ్మిదిమంది మృతిచెందారు. ప్రమాద సమయంలో వ్యాన్‌లో 11 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.