రైతులను నిండా ముంచి.. రైతు దినోత్సవమా!  | YS Sharmila Comments On KCR Govt | Sakshi
Sakshi News home page

రైతులను నిండా ముంచి.. రైతు దినోత్సవమా! 

Jun 5 2023 5:52 AM | Updated on Jun 5 2023 5:52 AM

YS Sharmila Comments On KCR Govt - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైతులను నిండా ముంచిన కేసీఆర్‌ ఓట్ల కోసం ‘రైతు దినోత్సవం’జరుపుతున్నారంటూ వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రైతు దినోత్సవం’కంటే ‘రైతు దగా దినోత్సవం’అంటేనే బాగుంటుందని ట్విట్టర్‌ వేదికగా ఆమె విమర్శించారు. తొమ్మిదేండ్లలో 9వేల మంది రైతులను పొట్టన పెట్టుకున్నారని, అసలు ఏం సాధించారని ఈ రైతు దినోత్సవాలని షర్మిల నిలదీశారు.

ఎకరాకు ముష్టి రూ.5వేల రైతుబంధు ఇచ్చి.. వందల ఎకరాలున్న భూస్వాములకు రూ.కోట్లు చెల్లిస్తున్నారని ఆరోపించారు. వడ్లను కొనకుండా ముప్పుతిప్పలు పెట్టి, కల్లాల్లోనే రైతుల గుండెలు ఆగేలా చేశారని విమర్శించారు. వ్యవసాయం అంటే మహానేత వైఎస్సార్‌ కాలంలో పండుగని, కానీ కేసీఆర్‌ కాలంలో దండగలా మారిందని వ్యాఖ్యానించారు. పంట నష్టపోయిన 15 లక్షల ఎకరాలకు వారం రోజుల్లో పరిహారం ఇవ్వాలని, మిగిలిపోయిన 30 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement