సాక్షి, హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోగ్యంపై బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆరా తీశారు. వెంట ఉండి అత్యుత్తమ చికిత్స అందేలా చూడాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆదేశించారు. పార్టీ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో.. అత్యుత్తమ చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని, పార్టీ ముఖ్య నేతలను కేసీఆర్ అప్రమత్తం చేశారు.
పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. మీడియాతో రోహిణి ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలడగా ఉందన్నారు. గుండెపోటుతో ఆస్పత్రికి తీసుకువచ్చారని.. హార్ట్ ఫంక్షనింగ్ ప్రస్తుతం కంట్రోల్ ఉందన్నారు. లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు.
సుదర్శన్‌రెడ్డి చనిపోయినట్లు మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దన్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయన్ని గ్రీన్ ఛానెల్ ద్వారా హైదరాబాద్ యశోధ ఆసుపత్రికి తరలించారు. సుదర్శన్ రెడ్డి అంబులెన్స్ వెంటే హైదరాబాద్‌కు కేటీఆర్, హరీశ్ రావు బయలుదేరారు.



