వైఎస్‌ జగన్‌ సంచలన ప్రకటన | YS Jagan Sensational Announcement On YSRCP App Over Kutami Politics | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ సంచలన ప్రకటన

Jul 29 2025 2:05 PM | Updated on Jul 29 2025 3:37 PM

YS Jagan Sensational Announcement On YSRCP App Over Kutami Politics

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ సమావేశం వేదికగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. కూటమి ప్రభుత్వ వేధింపుల నమోదు కోసం త్వరలో ఓ అప్లికేషన్‌(యాప్‌) తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. 

సోమవారం వైఎస్సార్‌సీపీ పీఏసీలో ఆయన మాట్లాడుతూ.. ‘‘పార్టీ తరఫున త్వరలో యాప్‌ విడుదల చేయబోతున్నాం. ప్రభుత్వ వేధింపులు జరిగినా, అన్యాయం జరిగినా.. వెంటనే యాప్‌లో నమోదు చేయొచ్చు. ఫలానా వ్యక్తి లేదంటే ఫలానా అధికారి అన్యాయంగా ఇబ్బంది పెడితే ఆ వివరాలు ఎంట్రీ చేయాలి. దానికి తగిన ఆధారాలను కూడా జత చేయొచ్చు(అప్‌లోడ్‌). అటుపై.. ఆ ఫిర్యాదు ఆటోమేటిక్‌గా వైఎస్సార్‌సీపీ డిజిటల్‌ సర్వర్లోకి వచ్చేస్తుంది. 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ ఫిర్యాదులపై కచ్చితంగా పరిశీలన ఉంటుంది. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం అని హామీ ఇచ్చారాయన. చంద్రబాబు ఏదైతే విత్తారో.. అదే చెట్టవుతుంది. అన్యాయానికి గురైన వారు ఎవరైనా సరే ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని.. తప్పు చేసిన వారందరికీ సినిమా చూపించడం ఖాయం అని జగన్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 

పీఏసీ భేటీలో వైఎస్ జగన్ కీలక ప్రకటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement