800 చెరువుల కబ్జాలు బీఆర్ఎస్‌ నేతలవే: టీపీసీసీ చీఫ్ | TPCC Chief Mahesh Kumar Goud Serious On BRS Leaders | Sakshi
Sakshi News home page

800 చెరువుల కబ్జాలు బీఆర్ఎస్‌ నేతలవే: టీపీసీసీ చీఫ్

Oct 2 2024 2:30 PM | Updated on Oct 2 2024 2:43 PM

TPCC Chief Mahesh Kumar Goud Serious On BRS Leaders

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మూసీ, హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదన్నారు టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 800 చెరువులను కబ్జా చేశారని సంచలన ఆరోపణలు చేశారు. అందుకే వారికి హైడ్రా అంటే భయం అంటూ కామెంట్స్‌ చేశారు.

టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘కేసీఆర్ ఇప్పుడు ఎక్కడ దాక్కున్నాడో కేటీఆర్ చెప్పాలి. ఆయన ఏం చదువుకున్నాడో అని అనుమానం వస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు 800 చెరువులను కబ్జా చేశారు. వారికే ఇప్పడు భయం. హైడ్రాకు, మూసీకి, రాహుల్ గాంధీకి సంబంధం లేదు. హైదరాబాద్‌ పరిధిలోని చెరువులకు పూర్వవైభవం తెస్తాం.

మూసీపై డీపీఆర్‌ సిద్ధం కానప్పుడు అవినీతి ఎలా జరుగుతుంది. 2016లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మూసీని ప్రక్షాళన చేస్తా అన్నారు. కానీ చేయలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు సిద్ధంగా ఉంది. మూసీ ప్రవాహానికి అడ్డుగా ఉన్న వాటిని మాత్రమే తొలగిస్తున్నారు. బయట రాష్ట్రంలో వీడియోలు ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధిలో ఉన్న వాటిని మాత్రమే హైడ్రా కూల్చి వేస్తోంది. హైడ్రా పని వేరు. మూసీ ప్రాజెక్ట్‌ వేరు’ అంటూ కామెంట్స్‌ చేశారు.

ఇది కూడా చదవండి: ‘అక్కా..దొంగ ఏడుపులు ఎందుకు?’.. మంత్రులపై కేటీఆర్‌ సెటైర్లు

 

Advertisement
 
Advertisement
Advertisement