సాక్షి, శ్రీ సత్యసాయి: హిందూపురంలో అధికార తెలుగు దేశం పార్టీ గూండాలు రెచ్చిపోయారు. శనివారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కార్యాలయం అద్దాలు, ఫర్నీఛర్, అక్కడే ఉన్న ఓ వాహనం ధ్వంసం అయ్యాయి. టీడీపీ రౌడీలను అడ్డుకునేందుకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ప్రయత్నించగా.. వాళ్లపైనా దాడి జరిగింది. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. ఈ దాడిని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఖండించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేస్తోంది.




ఎవరూ ఏం చేయలేరనే రెచ్చిపోతున్నారు
హిందూపురం కార్యాలయం ఘటనపై మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత సాకే శైలజానాధ్ ఖండించారు. ‘‘బాలకృష్ణ హిందూపురానికి ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్తున్నారని ఆరోపిస్తే దాడి చేస్తారా?. మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరని టీటీడీ గూండాలు రెచ్చి పోతున్నారు. ప్రశ్నించే వారిపై దాడి చేస్తే ఎవరూ భయపడరు. అధికారం శాశ్వతం కాదని చంద్రబాబు గుర్తించాలి. ఈ దాడులు చూస్తుంటే నాగరిక సమాజంలో ఉన్నామా? అనిపిస్తోంది’’ అని అన్నారాయన.



