● బతుకు ప్రయాణం..
బొమ్మనహాళ్: వారంతా రోజువారీ కూలీలు. రెక్కాడితే గాని డొక్కాడదు. ఎక్కడ పని దొరికితే అక్కడికే వెళ్తుంటారు. ఈ క్రమంలో పని ప్రాంతానికి చేరుకోవడానికి ప్రైవేట్ ఆటోలను ఆశ్రయిస్తుంటారు. అయితే పరిమితికి మించి ఆటోలో ప్రయాణించడం.. ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు ప్రాణాలు కోల్పోవడం పరిపాటిగా మారింది. ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా జరిగినా కూలీలతో పాటు ఆటో డ్రైవర్లలోనూ మార్పు రావడం లేదు. మంగళవారం కళ్యాణదుర్గం–బళ్లారి మార్గంలో జాతీయ రహదారిపై ఒక్కో ఆటోలో 25 మంది చొప్పున రెండు ఆటోల్లో 50 మంది కూలీలు ఇలా ప్రమాదకరంగా ప్రయాణిస్తుండడం గమనించిన వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాదాలు చోటు చేసుకుని ప్రాణాలు కోల్పోయినప్పుడు హడావుడి చేసే అధికారులు.. ముందస్తుగా ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టడం లేదనేందుకు ఇంతకు మించిన నిదర్శనం మరొకటి ఉండదని వ్యాఖ్యానించారు.


