ఉపాధ్యాయులను బలి చేయకండి
పుట్టపర్తి టౌన్: పాఠశాలలో విద్యాయేతర కార్యక్రమాలకు ఉపాధ్యాయులను బలి చేస్తూ మానసికంగా హింసిస్తున్నారని వైఎస్సార్ టీఏ జిల్లా అధ్యక్షుడు పి.వి రమణారెడ్డి మండిపడ్డారు. ఉపాధ్యాయ సమస్యలపై మంగళవారం డీఈఓ కృష్ణప్పను కలసి కలసి వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. వ్యవస్థలో లోపాలు పెట్టుకుని ఉపాధ్యాయులకు సంబంధం లేని అంశాలకు బలి చేస్తున్నారన్నారు. మధ్యాహ్నం భోజన సమయంలో గుడ్డు చిన్నదిగా ఉన్న దానికి సరఫరాదారుడిని కాకుండా ఉపాధ్యాయులను బాధ్యులుగా చేసి మాట్లాడడం సరికాదన్నారు. పదో తరగతి 100 రోజుల కార్యక్రమంలో పిల్లలకు, ఉపాధ్యాయులకు సెలవు రోజులు మినహాయించాలన్నారు. నిత్యం ఏదో ఒక కార్యక్రమంటూ ఉపాధ్యాయులను బోధనకు దూరం చేసే విధానాలకు స్వస్తి పలకాలన్నారు. అనవసరమైన యాప్‌ల భారాన్ని తగ్గించాలన్నారు. విద్యార్థుల సంఖ్యలను తక్కువగా చూపిస్తూ పాఠశాలల మూసి వేత తగదన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయలు ప్రకాష్‌రెడ్డి, రాజగోపాల్, రామ్మోన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌టీఏ జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి


