ఏఎస్‌ఏ ఉమెన్స్ క్రికెట్ చాంపియన్‌గా సదరన్
అనంతపురం కార్పొరేషన్: ఏఎస్‌ఏ ఉమెన్స్ కప్ చాంపియన్ షిప్‌ను సదరన్ స్ట్రైకర్స్ జట్టు కై వసం చేసుకుంది. ఆర్డీటీ క్రికెట్ మైదానంలో మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఏఎస్‌ఏ, సదరన్ స్ట్రైకర్స్ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఏఎస్‌ఏ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. జట్టులో నేష 53, ఎస్ అర్షియా 40 పరుగులు సాధించారు. స్ట్రైకర్స్ బౌలర్లలో గీతిక కొడాలి 18 పరుగులు ఇచ్చి 2 వికెట్లు దక్కించుకుంది. అనంతరం బరిలో దిగిన సదరన్ స్ట్రైకర్స్ జట్టు 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. గీతిక కొడాలి 39 బంతుల్లో 41, షాషా వల్లభనేని 28 పరుగులు చేశారు.
ముగింపు కార్యక్రమానికి దీపిక..
ఏఎస్‌ఏ ఉమెన్స్ కప్ పోటీ ముగింపు కార్యక్రమానికి భారత అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక, భారత జట్టు క్రీడాకారిణి అనూష హాజరై విజేత, రన్నర్స్ జట్లను అభినందిస్తూ ట్రోఫీలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ.. అనంతపురం జిల్లాలో అంధుల క్రికెట్ జట్లు ఉండడం సంతోషకరమన్నారు. ఇక్కడి జట్లతో కలసి పని చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
దీపిక, అనూషకు చెరో రూ.లక్ష అందజేత..
దీపిక, అనూషకు జిల్లా క్రికెట్ సంఘం చెరో రూ.లక్ష అందజేసింది. ఈ సందర్భంగా దీపికను జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి యుగంధర్ రెడ్డి, ఏడీసీఏ టీవీ చంద్రమోహన్‌రెడ్డి, మురళి, అన్సర్ ఖాన్, మహిళా క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి మచ్చా రామలింగారెడ్డి, ఆర్డీటీ డైరెక్టర్ నాగప్ప, సాయికృష్ణ సన్మానించారు.
ఫైనల్లో ఓడిన ఏఎస్‌ఏ
ఏఎస్‌ఏ ఉమెన్స్ క్రికెట్ చాంపియన్‌గా సదరన్


