కేసీఆర్‌ బస్సు యాత్ర.. కాన్వాయ్‌లో ప్రమాదం | Small Accident In Kcr Bus Yatra Convoy In Miryalaguda | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ బస్సు యాత్ర.. కాన్వాయ్‌లో ప్రమాదం

Apr 25 2024 3:15 PM | Updated on Apr 25 2024 3:15 PM

Small Accident In Kcr Bus Yatra Convoy In Miryalaguda

సాక్షి,నల్లగొండజిల్లా: బస్సు యాత్రలో భాగంగా మిర్యాలగూడ వెళ్లిన బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ కాన్వాయ్‌లో బుధవారం(ఏప్రిల్‌24) సాయంత్రం ప్రమాదం జరిగింది. మిర్యాలగూడ రోడ్‌ షో కు వెళ్తుండగా కేసీఆర్ కాన్వాయ్‌లో వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. వేములపల్లి సమీపంలో కాన్వాయ్‌లో ముందు వెళుతున్న వాహనం సడెన్‌ బ్రేక్‌ కొట్టడంతో ప్రమాదం జరిగింది.

ముందు వెళుతున్న కారును వెనుక వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో కాన్వాయ్‌లో తొమ్మిది వాహనాలు స్వల్పంగా ధ్వంసం అయ్యాయి. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.

కాగా, లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం కేసీఆర్‌ బుధవారం నుంచి బస్సుయాత్ర చేపట్టారు. బుధవారం మిర్యాలగూడ నుంచి ప్రారంభమైన ఈ బస్సు యాత్ర మే 10వ తేదీన సిద్దిపేటలో ముగియనుంది. బస్సు యాత్రలో భాగంగా పలు చోట్ల కేసీఆర్‌ రోడ్‌షోలలో ప్రసంగిస్తారు.  

ఇదీ చదవండి.. కవిత బెయిల్‌పై మే మొదటి వారంలో తీర్పు 

Advertisement
 
Advertisement
Advertisement