హైదరాబాద్: కాంగ్రెస్ పాలనలో సింగరేణి ప్రతిష్ట దిగజారుతోందని బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతల అవినీతితో సింగరేణికి లాభాలు తగ్గిపోయాయని మండిపడ్డారు. సింగరేణి లాభాల్లో కార్మికులకు న్యాయమైన వాటా ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో సింగరేణిలో బొగ్గు ప్రొడక్షన్ పెరిగితే, కాంగ్రెస్ నేతల జోక్యంతో సింగరేణిలో ప్రొడక్షన్ తగ్గిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నేతలు సింగరేణిని కుంభకోణాల గనిని చేశారంటూ విమర్శించారు. బొగ్గు లేక రాష్ట్రంలో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. కరెంట్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. దీనింతటికీ కారణం కాంగ్రెస్ పాలన. సింగరేణిని కుంభకోణాలు గనిని చేశారు’ అంటూ ఆరోపించారు.
ఈరోజు(గురువారం, అక్టోబర్8వ తేదీ) తెలంగాణ భవన్‌లో సింగరేణి నేతలతో హరీష్‌రావు సమావేశం నిర్వహించారు. సింగరేణి బొగ్గు నిల్వలు, థర్మల్ పవర్ ప్లాంట్ల విద్యుత్ ఉత్పత్తి తదితర అంశాలపై నేతలతో సమావేశం నిర్వహించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన హరీష్‌రావు.. సింగరేణి కార్మికుల సమస్యలపై కార్యాచరణను ప్రకటించారు. దీనిలో భాగంగా 14వ తేదీన సింగరేణి కార్మికుల గర్జన పేరుతో భారీ బహిరంగ నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సింగరేణి కార్మిక గర్జన సభకు టిఆర్ఎస్ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు.
గతంలో సింగరేణి బొగ్గు గనులను బీఆర్‌ఎస్ బృందం సందర్భించింది. థర్మల్ పవర్ ప్లాంట్లను బీఆర్‌ఎస్ బృందాలు ఇప్పటికే సందర్శించి అక్కడ సమస్యలు తెలుసుకున్నాయి. తాజాగా సింగరేణి నేతలతో సమావేశమైన హరీష్.. సింగరేణి సమస్యలపై పోరుబాట పట్టనున్నట్లు తెలిపారు. 14వ తేదీన సింగరేణి కార్మిక గర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఎలాన్ మస్క్‌కు కేటీఆర్ సూటి ప్రశ్న


