టీడీపీకి బిగ్‌ షాక్‌.. సీనియర్‌ నాయకుడు రాజీనామా | Saugavasi Subramanayam Resign To TDP | Sakshi
Sakshi News home page

టీడీపీకి బిగ్‌ షాక్‌.. సీనియర్‌ నాయకుడు రాజీనామా

Jun 7 2025 9:40 AM | Updated on Jun 7 2025 10:57 AM

Saugavasi Subramanayam Resign To TDP

సాక్షి, అన్నమయ్య: ఏపీలో అధికార కూటమి పార్టీ టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. అన్నమయ్య జిల్లాలో సీనియర్‌ నాయకులు సుగవాసి సుబ్రహ్మణ్యం టీడీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబుకు రాజీనామా లేఖను అందజేశారు. దీంతో, పచ్చ పార్టీకి బిగ్‌ షాక్‌ తగలినట్టు అయ్యింది.

అన్నమయ్య జిల్లాలో టీడీపీ సీనియర్‌ నాయకులు సుగవాసి సుబ్రహ్మణ్యం పార్టీకి రాజీనామా చేస్తున్నట్ట ప్రకటించారు. ఈ మేరకు లేఖలో వెల్లడించారు. సుగవాసి సుబ్రహ్మణ్యం 2024లో రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. టీడీపీ సీనియర్ లీడర్ మాజీ ఎమ్మెల్యే, ఎంపీగా ఉన్న సుగవాసి పాలకొండ్రాయుడు తనయుడు సుబ్రహ్మణ్యం.

తన రాజీనామా సందర్భంగా సుగవాసి సుబ్రహ్మణ్యం పార్టీ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. పార్టీలో సముచిత స్థానం ఇవ్వడం లేదని, మహానాడులో పాలకొండ్రాయుడికి నివాళులు సక్రమంగా అర్పించలేదని అన్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి తమను తొక్కేస్తున్నాడని గతంలో బహిరంగంగా సుబ్రహ్మణ్యం విమర్శలు చేశారు. ఇక, సుబ్రహ్మణ్యం రాజీనామాతో రాయచోటి, రాజంపేటలో టీడీపీకి నష్టం జరిగే అవకాశం ఉన్నట్టు పలువురు రాజకీయ నేతలు చెబుతున్నారు. 

ఈ సందర్భంగా సుగవాసి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ..‘ప్రజల అభిప్రాయాలను గౌరవించే పార్టీకి రాజీనామా చేశాను. రాజీనామా నిర్ణయం ఈరోజు తీసుకున్నది కాదు. ఐదారు నెలల నుంచే దీనిపై ప్రజాభిప్రాయాలు సేకరించాను. భవిష్యత్తులో ప్రజాస్వామ్య పద్ధతిలోనే ప్రజలకు మేలు చేసేందుకు రాజకీయాల్లో కోనసాగుతాను. ప్రజలకు తోడ్పాటు అందిస్తాను. నా రాజీనామా విషయం మా తండ్రితో ముందే చర్చించాను. ఆయన అనుమతి ఉన్నట్లే భావిస్తున్నాను’ అని వ్యాఖ్యలు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement