breaking news
Sugavasi Subramanyam
-
నేను టీడీపీని వీడటానికి కారణం.. చంద్రబాబు బండారం బయటపెట్టిన సుగవాసి
-
టీడీపీకి భారీ షాక్.. జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి ఎస్.బాల సుబ్రమణ్యం
సాక్షి, తాడేపల్లి: అన్నమయ్య జిల్లా రాజంపేటలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో టీడీపీ సీనియర్ నేత సుగవాసి బాల సుబ్రహ్మణ్యం వైఎస్సార్సీపీలో చేరారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సుగవాసి పాలకొండ్రాయుడు కుమారుడు సుబ్రహ్మణ్యం.. నాలుగు దశాబ్దాలుగా టీడీపీలో కొనసాగిన సుగవాసి కుటుంబం టీడీపీలో జరుగుతున్న అవమానాలు తట్టుకోలేక ఆ పార్టీని వీడి వైఎస్ జగన్ వెంట నడవాలని నిర్ణయించుకున్నారు.సుగవాసి పాలకొండ్రాయుడి రాజకీయ వారసుడిగా సుబ్రహ్మణ్యం 1995 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. ఆయన రాయచోటి జడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించారు. 2000లో ఉమ్మడి కడప జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా పని చేశారు. 2001లో మరోసారి రాయచోటి జడ్పీటీసీగా గెలిచారు. 2012లో జరిగిన రాయచోటి ఉప ఎన్నికలో టీడీపీ తరఫున బరిలోకి దిగిన ఆయన ఓడిపోయారు. 2024లో రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే అయిన సుగవాసి పాలకొండ్రాయుడు పెద్దకుమారుడే సుబ్రహ్మణం.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ మంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్.వి.సతీష్‌కుమార్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, రమేష్ కుమార్ రెడ్డి, ఎన్.శ్రీనాథ్ రెడ్డి పాల్గొన్నారు. -
అన్నమయ్య జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్
-
టీడీపీలో వారిని వదలను.. ప్రసాద్ బాబు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అన్నమయ్య: టీడీపీ అధికార కూటమిలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. సొంత పార్టీ నేతలపై టీడీపీ సీనియర్ నాయకులు సుగవాసి ప్రసాద్ బాబు సంచలన ఆరోపణలు చేశారు. సంవత్సర కాలంగా పార్టీలో అవమానాలను భరిస్తున్నాం.. తమను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరినీ వదలను అని హెచ్చరించారు.చిన్నమండ్యంలో మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు సంస్మరణ సభలో టీడీపీ కార్య నిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబు తన ఆగ్రహం వెల్లగక్కారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి సొంత గడ్డపై మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రసాద్ బాబు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుండి చనిపోయే వరకు పార్టీ కోసమే కష్టపడిన నాయకుడు పాలకొండ్రాయుడు. అలాంటి వ్యక్తి కుటుంబ సభ్యులం మేము. తెలుగుదేశం పార్టీలోనే మేము అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం.మా అన్న సుగవాసి సుబ్రహ్మణ్యంను పార్టీలోని కొందరు వ్యక్తులు ఇబ్బంది పెట్టారు. అందుకే ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఏడాది పాటు పార్టీలో అవమానాలను భరించారు. ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన ప్రజల్లో ఆదరణ లేనట్టా. పలు చోట్ల టీడీపీ ఇన్ఛార్జ్లు ఓడిపోలేదా?. అయినప్పటికీ వారు ఇన్చార్జ్ పదవుల్లోనే కొనసాగుతున్నారు. ఒక్క రాజంపేటలో మాత్రమే ఇన్ఛార్జ్ పదవి ఎందుకు ఇవ్వలేదు. ఓడిపోతే ఇలా అవమానిస్తారా?. మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరినీ వదలను’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ బాల సుబ్రహ్మణ్యం రాజీనామా..ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. మహానాడు జరిగిన పది రోజులకే సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం టీడీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబుకు పంపించారు. ప్రజల సలహాలను, సూచనలను, అభిప్రాయాలను, మనోభావాలను గౌరవిస్తూ నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నాను. పార్టీలో నేను అవమానాలు ఎదుర్కొంటున్నాను అంటూ లేఖలో పేర్కొన్నారు. ఇక, ఆయన 2024 ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయిన సంగతి విధితమే.మాజీ ఎంపీ పాలకొండ్రాయుడు కుమారుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం. పాలకొండ్రాయుడు 1984 ఎన్నికల్లో టీడీపీ నుంచి రాజంపేట ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. 1999, 2004 ఎన్నికల్లో వరుసగా రాయచోటి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన రాజకీయ వారసుడిగా సుబ్రహ్మణ్యం 2024 ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత సుబ్రహ్మణ్యం కొద్దిరోజులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. ఆ తర్వాత పార్టీకి దూరంగా ఉంటున్నారు. రాజంపేట నియోజకవర్గం టీడీపీలో కొంతకాలంగా గ్రూప్‌వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడి పార్టీ నేతలు మూడు గ్రూపులోగా విడిపోయారనే టాక్ ఉంది. -
టీడీపీకి అందుకే రాజీనామా చేస్తున్నా
-
టీడీపీకి బిగ్ షాక్.. సీనియర్ నాయకుడు రాజీనామా
సాక్షి, అన్నమయ్య: ఏపీలో అధికార కూటమి పార్టీ టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. అన్నమయ్య జిల్లాలో సీనియర్ నాయకులు సుగవాసి సుబ్రహ్మణ్యం టీడీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబుకు రాజీనామా లేఖను అందజేశారు. దీంతో, పచ్చ పార్టీకి బిగ్ షాక్ తగలినట్టు అయ్యింది.అన్నమయ్య జిల్లాలో టీడీపీ సీనియర్ నాయకులు సుగవాసి సుబ్రహ్మణ్యం పార్టీకి రాజీనామా చేస్తున్నట్ట ప్రకటించారు. ఈ మేరకు లేఖలో వెల్లడించారు. సుగవాసి సుబ్రహ్మణ్యం 2024లో రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. టీడీపీ సీనియర్ లీడర్ మాజీ ఎమ్మెల్యే, ఎంపీగా ఉన్న సుగవాసి పాలకొండ్రాయుడు తనయుడు సుబ్రహ్మణ్యం.తన రాజీనామా సందర్భంగా సుగవాసి సుబ్రహ్మణ్యం పార్టీ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. పార్టీలో సముచిత స్థానం ఇవ్వడం లేదని, మహానాడులో పాలకొండ్రాయుడికి నివాళులు సక్రమంగా అర్పించలేదని అన్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి తమను తొక్కేస్తున్నాడని గతంలో బహిరంగంగా సుబ్రహ్మణ్యం విమర్శలు చేశారు. ఇక, సుబ్రహ్మణ్యం రాజీనామాతో రాయచోటి, రాజంపేటలో టీడీపీకి నష్టం జరిగే అవకాశం ఉన్నట్టు పలువురు రాజకీయ నేతలు చెబుతున్నారు. ఈ సందర్భంగా సుగవాసి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ..‘ప్రజల అభిప్రాయాలను గౌరవించే పార్టీకి రాజీనామా చేశాను. రాజీనామా నిర్ణయం ఈరోజు తీసుకున్నది కాదు. ఐదారు నెలల నుంచే దీనిపై ప్రజాభిప్రాయాలు సేకరించాను. భవిష్యత్తులో ప్రజాస్వామ్య పద్ధతిలోనే ప్రజలకు మేలు చేసేందుకు రాజకీయాల్లో కోనసాగుతాను. ప్రజలకు తోడ్పాటు అందిస్తాను. నా రాజీనామా విషయం మా తండ్రితో ముందే చర్చించాను. ఆయన అనుమతి ఉన్నట్లే భావిస్తున్నాను’ అని వ్యాఖ్యలు చేశారు. -
సుగవాసి సుబ్రమణ్యం పార్టీ వీడనున్నారా?
రాజంపేట: తెలుగుదేశం పార్టీ నుంచి సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గ స్థానం నుంచి పోటీ చేసిన సుగవాసి సుబ్రమణ్యం సైలెంట్ అయ్యారంటే.. అవుననే చెప్పాల్సివస్తోంది. గత కొద్దినెలలుగా అధికారపార్టీకి దూరంగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో సుగవాసికి అధిష్టానం టికెట్ ఇచ్చి పోటీ చేయించినా అధిష్టానం ఆయనను ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడంలేదన్న వాదన టీడీపీలో హాట్‌టాపిక్‌గా కొనసాగుతోంది. నియోజకవర్గంలోని ఒంటమిట్ట రాములోరి కళ్యాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వస్తే ఆ ప్రాంతాల్లో ఎక్కడ కూడా సుగవాసి కనిపించలేదు. ఆయన పార్టీ వీడనున్నారా? అన్న సందేహాలు రేకేత్తిస్తున్నాయి. రాజంపేటలో కాపు (బలిజ)సామాజికవర్గానికి సరైన ప్రాధాన్యత లేదన్న భావనలు పుట్టుకొస్తున్నాయి. రాజంపేట వైపు మళ్లీ బత్యాల చూపు? మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు రైల్వేకోడూరుకే పరిమితమయ్యారు. సుగవాసి సుబ్రమణ్యం గత కొద్దిరోజులుగా పారీ్టకి దూరంగా..నియోజకవర్గం పార్టీ కార్యక్రమానికి రాకపోవడంతో బలిజ సామాజికవర్గం మదనపడుతోంది. బత్యాల చెంగల్రాయుడు, సుగవాసి సుబ్రమణ్యంలు రాజంపేట టీడీపీలో పట్టుకోల్పోయిన తరుణంలో ఆయన వెంట నడిచిన ఆయన సామాజికవర్గ నేతలు, అభిమానులు మాత్రం నిస్తేజంగా ఉండిపోయారు. మళ్లీ బత్యాల చూపు రాజంపేట వైపును మళ్లిస్తుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇన్చార్జి ఎవరో తేల్చని అధిష్టానం రాజంపేట టీడీపీలో కుల వర్గపోరు, అంతర్గత కుమ్ములాటలు జరుగుతూనే ఉన్నాయి. అధిష్టానం ఇన్చార్జి ఎవరో తేల్చుకోలేకుంది. ఇన్చార్జి రేసులో ఉన్న వారితో అ«ధికారులు తలపట్టుకుంటున్నారు. ఏ నేత వద్దకు పోతే, మరోనేతకు వ్యతిరేకమవుతామని, ఎవరి దగ్గరికి పోకుంటే పోలా అనే భావనలో పార్టీ క్యాడర్ కొనసాగుతోంది. సీఎం బర్త్‌డే వేడుకలను కలిసికట్టుగా కాకుండా చమర్తి జగన్మోహన్రాజు, బత్యాల చెంగల్రాయుడు, మేడా విజయశేఖర్‌రెడ్డి వేర్వేరుగా చేసుకున్నారు. మహానాడు తర్వాత ఇన్చార్జి ప్రకటిస్తారా? ముందుగానే ప్రకటిస్తారా అనేది టీటీడీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అధిష్టానం ఎటువైపుపోటీ చేసి ఓడిపోయిన సుగవాసి సుబ్రమణ్యంను కాదని, పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్‌రాజుకు అధిష్టానం ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో బలిజ వర్గాలు జీరి్ణంచుకోలేకున్నాయి. రాజంపేట దేశంపారీ్టలో వర్గపోరు అంతర్గతంగా కొనసాగుతోంది. ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాల విషయంలో చేతివాటం ప్రదర్శించారని ఆరోపణలు ఉన్నాయి. రాజంపేట ప్రాంతీయ వైద్యశాలలో ఔట్సోర్సింగ్ నియామకాల్లో కూడా ఓ నేత చేయి తడిపారనే ఆరోపణలు ఆ పార్టీ వర్గాలే బహిరంగగానే చెప్పుకుంటున్నాయి. -
టీడీపీ నేతలకు షోకాజ్ నోటీసులు
రాయచోటి: వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఇద్దరు టీడీపీ నేతలకు అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రాయచోటి నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు, కడప నియోజకవర్గ టీడీపీ నేత దుర్గాప్రసాద్‌లకు టీడీపీ అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలిశెట్టి హరిప్రసాద్ తెలిపారు. అయితే టీడీపీలో కార్యకర్తలకు ఎలాంటి న్యాయం జరగలేదని, కేవలం డబ్బులు ఉన్నవారికే ప్రాధాన్యం ఇస్తున్నారని, కార్యకర్తలను కేవలం పార్టీ కార్యక్రమాలకు మాత్రమే వాడుకుంటున్నారని సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నియమావళికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని, క్రమశిక్షణ ఉల్లంఘించారని టీడీపీ అధిష్టానం ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కడపలో కాపు సంఘం సమావేశంలో దుర్గాప్రసాద్ అనుచరులు పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారనే కారణంతో ఆయనకు కూడానోటీసులు జారీ చేసింది.