మావిగన్‌ అనగానే చంద్రబాబు ఉలిక్కిపాటు: సజ్జల | Sajjala Ramakrishna Reddy Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

మావిగన్‌ అనగానే చంద్రబాబు ఉలిక్కిపాటు: సజ్జల

Jul 3 2026 3:17 PM | Updated on Jul 3 2026 4:00 PM

Sajjala Ramakrishna Reddy Fires On Chandrababu

సాక్షి, తాడేపల్లి: అవినీతి, స్కామ్‌లకు చంద్రబాబు బ్లూప్రింట్‌ తయారుచేసుకున్నారని వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కో-ర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అమరావతి రాష్ట్రానికి గుదిబండ.. స్కామ్‌లు చేయడానికే అమరావతి పెట్టారు. అమరావతిలో పెట్టే నిధుల్లో 10 శాతం మావిగన్‌లో పెట్టినా ఎంతో అభివృద్ధి చేయొచ్చన్నారు.

మావిగన్‌పై వైఎస్‌ జగన్‌ మరోసారి స్పష్టత ఇచ్చారు. ప్రపంచస్థాయి రాజధాని అన్న చంద్రబాబు ఇప్పుడు మున్సిపాలిటీ అంటున్నారు. రాజధానికి ప్రభుత్వ భూమి ఉంటే మంచిదని వైఎస్‌ జగన్‌ అన్నారు. అమరావతి నేల రాజధానికి పనికిరాదని గతంలో చాలా మంది చెప్పారు. అమరావతి నేల కుంగిపోతుంది.. ఇది ప్రమాదకరం. అమరావతి పూర్తి చేయాలనే ఉద్దేశం చంద్రబాబుకు లేదు. వైఎస్‌ జగన్‌ అడిగిన ప్రశ్నలకు టీడీపీ నేతలు ఎక్కడైనా సమాధానం ఇస్తున్నారా?’’ అంటూ సజ్జల ప్రశ్నించారు.

‘‘మావిగన్‌లో తక్షణ అభివృద్ధికి అవకాశం ఉంది. అమరావతి అప్పుల భారాన్ని రాష్ట్రం మోయలేదు. రైతులు ఇచ్చిన భూముల్లో లే అవుట్‌లు కూడా అభివృద్ధి చేయడం లేదు. లే అవుట్‌లు అభివృద్ధి చేయలేకపోతే రైతుల పరిస్థితి ఏంటీ?. అమరావతి కోసం అప్పు తెచ్చిన రూ.47 వేల కోట్లతో మెడికల్‌ కాలేజీలు, మచిలీపట్నం పోర్టు, హంద్రీనీవా కాలువ పూర్తి చేయొచ్చు. పాఠశాలలు దేవాలయాలు మాదిరిగా ఉండాలి. ఇప్పుడు ఎలా ఉన్నాయి?. ఛత్తీస్‌గఢ్‌ నయా రాయ్‌పూర్‌లో ఎవరుంటున్నారు?. చదరపు అడుగుకు రూ. 20 వేల ఖర్చు ఏంటీ? ఎక్కడైనా ఉందా?. ప్రశ్నిస్తే గొంతు నొక్కుతున్నారు.. భయపెడుతున్నారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమరావతికి, మావిగన్‌కు మధ్య తేడా ఇదే..
‘‘మావిగన్‌ అనగానే చంద్రబాబు ఉలిక్కిపడుతున్నారు. అమరావతికి, మావిగన్‌కు మధ్య తేడా ఏంటో వైఎస్‌ జగన్‌ పలుమార్లు చెప్పారు. దాని గురించే మరోసారి వైఎస్‌ జగన్‌ స్పష్టత ఇచ్చారు. చంద్రబాబు చెప్తున్న అమరావతి అసాధ్యమైనదని, దాంట్లో 10 శాతంతో మావిగన్‌ అవుతుందని చెప్పారు. మావిగన్‌ ఆలోచనతో చంద్రబాబుకు పడరానిచోట దెబ్బ పడుతోంది. మావిగన్‌ అనగానే.. గుంటూరు, విజయవాడ కూడా మావిగన్‌లో భాగమేనని చంద్రబాబు అంటున్నారు. అమరావతికోసం చంద్రబాబు పెట్టాలనుకుంటున్న రూ.2 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టే ప్రాంతంలో విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఉన్నాయా?. కానీ మావిగన్‌లో విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఉన్నాయి. ఇప్పటికే వెస్ట్రన్‌ బైపాస్‌ వచ్చింది. సహజంగానే అమరావతి అభివృద్ధి చెందుతుంది’’ అని సజ్జల వివరించారు.

మరి మాటలు మార్చింది ఎవరు?
‘‘ప్రభుత్వ భూమి అయితే రాజధానికి బెటర్‌ అని వైఎస్‌ జగన్‌ చాలా స్పష్టంగా చెప్పారు. అందరికీ అందుబాటులో రాజధాని ఉంటుందని ఆరోజు అన్నారు. అమరావతిలో అవినీతి, దోపిడీ, ఆర్థిక భారం.. ఈ అంశాలన్నీ చెప్పారు. రాష్ట్రంలో ప్రజల డబ్బును వృథా చేయొద్దన్నందుకు వైఎస్‌ జగన్‌పై పడుతున్నారు. మాట మార్చింది వైఎస్‌ జగన్‌ కాదు.. కూటమి నాయకులే. మూడు రాజధానుల ప్రతిపాదనలో అమరావతికీ చోటు ఉంది. అమరావతి ప్రాధాన్యతను తగ్గించలేదు. లెజిస్లేచర్‌ క్యాపిటల్‌గా ఆ ప్రతిపాదనలో చోటు ఉంది. పైగా రైతులకు మేలు చేసింది వైఎస్‌ జగనే. 

..వైజాగ్‌ను గ్రోత్‌ ఇంజిన్‌గా మార్చాలనుకున్నారు. మరి కంపెనీలు వైజాగ్‌నే ఎందుకు ఎంపిక చేసుకుంటున్నాయి?. రాజధాని విషయంలో స్థిరత్వం లేనిది చంద్రబాబుకే. కేవలం అవినీతి కోసమే అమరావతిని చంద్రబాబు ముందుకు తీసుకెళ్తున్నారు. అమరావతి అవినీతికి బ్లూ ప్రింట్‌. ఇది రాష్ట్రానికి తీరని నష్టం. అమరావతి పేరిట చంద్రబాబు చేస్తున్న ఖర్చులు బాధ్యతారాహిత్యం. రాష్ట్రం పట్ల స్పృహలేని వారు మాత్రమే ఇలా చేస్తారు. చంద్రబాబు రాత్రికి రాత్రే మాటలు మారుస్తున్నారు. చంద్రబాబు గతంలో టెంపరరీ రాజధాని అన్నారు, ఇప్పుడు మున్సిపాల్టీ అంటున్నారు. అమరావతి మున్సిపాల్టీగా మిగిలిపోతుందంటూ చంద్రబాబు. స్వయంగా కామెంట్‌ చేశారు. 

..అమరావతి ఇన్‌క్లూజివ్‌ క్యాపిటల్‌ కాదని గతంలో అన్న పవన్‌కళ్యాణ్‌. భూములు ఇవ్వకపోతే లాక్కోవద్దని గతంలో అన్న పవన్‌కళ్యాణ్‌. కర్నూలు రాజధాని అంటూ గతంలో ప్రకటన చేసిన పవన్‌కళ్యాణ్‌. రాజధాని అరిగిపోయిన రికార్డంటూ కామెంట్‌ చేసిన సోము వీర్రాజు. వైజాగ్‌ను అభివృద్ధి చేయాలన్న సోము వీర్రాజు. అన్ని సదుపాయాలూ వైజాగ్‌లో ఉన్నాయంటూ గతంలో కామెంట్‌ చేసిన సోము వీర్రాజు. రూ.1500 కోట్లు ఇస్తే కారిపోయిన బిల్డింగులు కట్టారన్న సోము వీర్రాజు. అమరావతి ఉత్తుత్తి అమరావతిగా మిగిలిపోనుందా అంటూ మాట్లాడిన జీవీఎల్‌. వికేంద్రీకరణ దిశగా ఆలోచించాలన్న జీవీఎల్‌. గ్రాఫిక్స్‌, బొమ్మలకే అమరావతిని పరిమితం చేశారన్న పురందేశ్వరి. కూటమి నాయకులు అన్న మాటలను సజ్జల రామకృష్ణారెడ్డి ప్లే చేసి చూపించారు.

అమరావతి ఖర్చులు, అప్పులు, ప్రజలపై భారం
‘‘అమరావతిలో వర్టికల్‌ డెవలప్‌మెంట్‌ చేస్తున్నారు. భూమి ఉన్నప్పుడు వర్టికల్‌ డెవలప్‌మెంట్‌ ఎందుకు చేస్తున్నారు?. రూపాయి అయ్యే చోట వంద రూపాయలు ఎందుకు ఖర్చు చేస్తున్నారు?. ఆ డిజైన్లకు ఎంత డబ్బు పెట్టినా అవుతుందా?. ఏ పనీ చేయకపోయినా రూ.47 వేల కోట్ల అప్పులు తెచ్చారు. రూ.60 వేల కోట్ల పనులు అప్పగించేశారు. ఈ రూ.47 వేల కోట్లతో పోర్టులు, రాయలసీమ లిఫ్ట్‌, మెడికల్‌ కాలేజీలు, వెలిగొండ నిర్వాసితుల సమస్య, పోలవరం నిర్వాసితుల సమస్య, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌.. ఇవన్నీ కూడా పూర్తి చేయవచ్చు.

..చంద్రబాబుకు ఏది ప్రాధాన్యతో తెలియని పరిస్థితి ఉంది. లక్ష కోట్లకు ఏటా రూ.8 వేల కోట్ల వడ్డీ కట్టాలి. రెండేళ్లలో చంద్రబాబు రూ.3.5 లక్షల కోట్ల అప్పులు చేశారు. రూ.10 వేల కోట్లతో రాజధాని పూర్తి చేస్తే ఎవరు అడుగుతారు?. కానీ ప్రజల సొమ్మును ఇష్టానుసారం పోస్తున్నారు. హెరిటేజ్‌ అమ్మి కడుతుంటే ఎవ్వరూ అడగరు. వేల, లక్షల కోట్లు పెట్టి ప్రపంచంలో ఎక్కడైనా ప్రభుత్వ భవనాలు కట్టారా?. బర్మా మిలటరీ నియంతలు కట్టిన నేపిడా కూడా ఘోస్ట్‌సిటీగా మారిపోయింది.

..అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ఎలా అవుతుందో చంద్రబాబు చెప్పగలరా?. అమరావతిలో ప్రభుత్వ భవనాల నుంచి ఆదాయం వస్తుందా?. ప్రజలకు పెద్ద భ్రమలను కల్పించే మెకానిజం చంద్రబాబుకు ఉంది. విజయవాడలో ఎయిర్‌పోర్ట్‌ పనులను ఎందుకు ముందుకు జరగనీయడంలేదు?. మచిలీపట్నం పోర్టును ఎందుకు పూర్తి చేయడంలేదు?. ఇవన్నీ వదిలేసి, డబ్బంతా అమరావతికి డైవర్ట్‌ చేస్తున్నారు. భారం అంతా ప్రజలమీద వేస్తున్నారు, ఆదాయాలన్నీ ప్రైవేటు వారికి ఇస్తున్నారు.

..రైతుల ప్రయోజనాలను కూడా చంద్రబాబు కాపాడ్డంలేదు. ఇప్పటివరకూ రోడ్లు కూడా వేయడంలేదు. పేదలకు ఇళ్లస్థలాలు ఇస్తే వెళ్లగొట్టారు. అమరావతిలో అవినీతిని, దోపిడీని కచ్చితంగా ప్రశ్నిస్తాం. రైతుల సమస్యలపై కచ్చితంగా పోరాటం చేస్తాం. కలిసి వచ్చేవాళ్లందరినీ కలుపుకుంటాం. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ నినాదంతో ముందుకు వెళ్తున్నాం. అమరావతిలో విపరీతంగా దోచుకుంటున్నారు. మట్టి మాఫియా చేస్తున్నారు, కొండలను కరిగించేస్తున్నారు. ఇలాంటి దోపిడీ చేస్తున్నవారే మొన్న వైఎస్సార్‌సీపీ బృందాన్ని అడ్డుకున్నారు. అమరావతి గురించి ప్రస్తావించడమే తప్పు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఇది ప్రశ్నిస్తే, దాడులు చేస్తున్నారు, ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఈ ప్రశ్నలు వేస్తుంటే ఎదురుదాడి చేస్తున్నారు. వారిని ప్రశ్నిస్తుంటే కేసులు పెడుతున్నారు.

..రాష్ట్రంలో ప్రజల వాయిస్‌ను మేం వినిపిస్తున్నాం. ఆ హక్కును చంద్రబాబుగారు ఎలా కాదంటారు?. చంద్రబాబును ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నించాలి. ముఖ్యమంత్రి రాష్ట్రానికి ధర్మకర్తగా ఉండాలి. ప్రజా సంబంధిత అంశాలనే మేం ప్రస్తావిస్తున్నాం. మావిగన్‌ మా పార్టీకి నష్టం చేస్తుందనే అనేవాళ్లు కూడా ఉన్నారు. మేం రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడడం లేదు. రాష్ట్రానికి నష్టం తెచ్చే అంశాలను తప్పకుండా ప్రస్తావిస్తాం. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌, లోకేష్‌లు ఏ కామెంట్‌ చేసినా వాటికే తగులుతాయి. వీళ్లు పెద్ద ఫేక్‌ సైన్యాన్ని నడుపుతున్నారు. అసభ్యంగా మాట్లాడ్డంలో వారి తర్వాతే. “కొడకల్లారా..” అంటూ గతంలో తిట్టారు. వారి మాటలను వారే వీడియోల ద్వారా చూడొచ్చు. చంద్రబాబు కూటమి నాయకుల దుర్మార్గాలు మితిమీరుతున్నాయి.

..కడప స్టీల్‌ప్లాంట్‌కు 2023లో వైయస్‌.జగన్‌ శంకుస్థాపన చేశారు. మేం వేసిన రోడ్లమీదనే వాళ్లు ఇవాళ ప్రయాణించారు. స్టీల్‌ప్లాంట్‌కు అవసరమైన ఇన్‌ఫ్రా పనులు వేగంగా నడిచాయి. అమరావతి పనులకంటే వేగంగా అక్కడ జరిగాయి. వాటిని ఒప్పుకునే నైతికత చంద్రబాబుకు లేదు. క్రెడిట్‌ చోరీలో చంద్రబాబును మించిన వారు లేరు. పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లు కూడా తానే మొదలుపెట్టానంటాడు. జత్వానే కేసును అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ కేసును అడ్డుపెట్టుకుని ఇద్దరు ఐపీఎస్‌ అధికారులపై కక్షసాధిస్తున్నారు. వైఎస్‌ జగన్‌ పాలన కొనసాగి ఉంటే దాదాపు స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం ఇవ్వాళ్టికి కొలిక్కి వచ్చేది. గతంలో బ్రహ్మణి స్టీల్‌ప్లాంట్‌ను అడ్డుకున్నాడు. రాయలసీమలో స్టీల్‌ప్లాంట్‌ రావడం చంద్రబాబుకు ఇష్టంలేదు. రాయలసీమకే కాదు, చంద్రగిరి, కుప్పంకూ మంచి జరగడం ఆయనకు ఇష్టంలేదు. రాయలసీమ లిఫ్ట్‌ను ఆపేసి, ఇవాళ రాయలసీమ ప్రాంతం గురించి మాట్లాడుతున్నాడు. దోపిడీ కోసమే అమరావతి ప్రాంతాన్ని ఎంచుకున్నాడు.’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement