న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. దేశాన్ని మోదీ సర్వనాశనం చేశారని చెప్పారు. ఆయన పాలనలో అన్ని వర్గాలకు కష్టాలే మిగులుతున్నాయని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని మోదీ సర్కార్ ఖూనీ చేస్తోందని చెప్పారు.
అలాగే, కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి మీనాక్షీ నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైన విషయంపై రాహుల్ స్పందిస్తూ.. ‘‘ఓటు చోరీ, సర్కార్ చోరీ తర్వాత బీజేపీ-ఈసీ జుగల్‌బందీ, సీటు చోరీతో పోటీ మొదలుకాకముందే ముగించేసింది. ఇటీవలి రాజ్యసభ ఎన్నికల్లో ఏం జరిగిందో చూడండి.
కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ ప్రతి పత్రాన్ని సమర్పించారు. పెండింగ్ కేసులు లేవు. బీజేపీ చేసిన చిన్న అభ్యంతరం ఆధారంగా ఈసీ ఆమె నామినేషన్‌ను రద్దు చేసింది. బీజేపీ మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థి పరిమల్ నత్వానీ దరఖాస్తు పత్రంలో తన పేరునే తప్పుగా రాశారు. తప్పనిసరిగా వెల్లడించాల్సిన ఎన్నో వివరాలు ఇవ్వలేదు. వాటన్నింటినీ సరిచేసుకునేందుకు ఈసీ ఆయనకు గడువు పొడిగించింది.
ఒకరిని కనీసం విచారణ కూడా లేకుండానే అనర్హురాలిగా ప్రకటించారు. మరొకరికి మాత్రం నిబంధనలు పాటించకపోయినా ప్రోత్సాహం లభించింది. కాంగ్రెస్ నేతలు కలుస్తామని చెప్పినప్పుడు ఈసీ మొదట మమ్మల్ని తప్పించుకునే ప్రయత్నం చేసింది. చివరకు సమావేశం జరిగినప్పుడు, వారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇలాంటివి ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే బీజేపీకి ఎన్నికల్లో గెలవడం కంటే, ఎన్నికల ప్రక్రియను తమకు అనుకూలంగా మార్చుకోవడం చాలా సులభం’’ అని అన్నారు.
After Vote Chori and Sarkar Chori - the BJP-EC jugalbandi has finished the contest before it has even begun with Seat Chori.
Look at what happened in the recent Rajya Sabha elections.
Congress candidate Meenakshi Natarajan ji submitted every document. No pending cases. The EC…— Rahul Gandhi (@RahulGandhi) June 11, 2026


