రూ.1,500 కోట్లకు అమ్ముడుపోయిన పవన్‌: కేఏ పాల్‌ | Praja Shanti Party President Ka Paul Comments On Pawan Kalyan | Sakshi
Sakshi News home page

రూ.1,500 కోట్లకు అమ్ముడుపోయిన పవన్‌: కేఏ పాల్‌

Oct 8 2023 10:05 AM | Updated on Oct 8 2023 10:05 AM

Praja Shanti Party President Ka Paul Comments On Pawan Kalyan - Sakshi

పవన్‌ ఒక రోజు ఎన్డీఏలో ఉన్నానంటాడని, మరొక రోజు లేనని చెబుతాడని, రేపు ఏమంటారో చూడాలన్నారు.

సీతమ్మధార(విశాఖ ఉత్తర): జనసేన అధ్య­క్షుడు పవన్‌కళ్యాణ్‌ రూ.1,500 కోట్లకు చంద్రబాబుకు అమ్ము­డుపోయాడని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ చెప్పారు. అమరా­వతిలో బినామీల పేర్లతో టీడీపీ నాయకులు భూములు కొనుగోలు చేశారని ఆయన తెలిపారు.

విశాఖ ఆశీలమెట్టలోని కేఏ పాల్‌ ఫంక్షన్‌ హాలులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్‌ ఒక రోజు ఎన్డీఏలో ఉన్నానంటాడని, మరొక రోజు లేనని చెబుతాడని, రేపు ఏమంటారో చూడాలన్నారు. చంద్రబాబు స్టీల్‌ ప్లాంట్‌ కోసం ఏనాడు పోరాటం చేయలేదని, ఆయన అదానీకి అమ్ముడుపోయాడని ఆరో­పించారు. చంద్రబాబు అమరావతి కడతానని కట్టలేదని, పోలవరం పూర్తి చేయలేదని, ప్రత్యేక హోదా సాధించలేదని పేర్కొన్నారు.

ఏ తప్పు చేయకపోతే లోకేశ్‌ ఎందుకు ఢిల్లీలో దాక్కున్నారని ప్రశ్నించారు. లోకేశ్‌ ఢిల్లీలో బీజేపీ పెద్దల కాళ్లవేళ్లా పడినా అపాయింట్‌మెంట్‌ దొరకలేదని అన్నారు.
చదవండి: బ్రెయిన్‌ డెడ్‌ పార్టీకి సానుభూతి వైద్యం 

Advertisement
 
Advertisement
Advertisement