అవినీతికి పర్యాయపదం కాంగ్రెస్: ఎంపీ విజయసాయిరెడ్డి | MP Vijayasai Reddy Slams Congress Party Budget Discussion | Sakshi
Sakshi News home page

అవినీతికి పర్యాయపదం కాంగ్రెస్: ఎంపీ విజయసాయిరెడ్డి

Feb 7 2024 7:53 PM | Updated on Feb 7 2024 8:06 PM

MP Vijayasai Reddy Slams Congress Party Budget Discussion - Sakshi

కాంగ్రెస్ పార్టీని చరిత్రలో ప్రజలు ఎన్నటికీ క్షమించరు. కాంగ్రెస్ పరిపాలనలో దేశం ఆర్థికంగా అధోగతి పాలయింది. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారనడానికి  గణాంకాలే సాక్ష్యం...

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ తన సొంత ప్రయోజనాలకి దేశ ప్రజలను తాకట్టు పెట్టిందని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఆయన బుధవారం రాజ్యసభలో జరిగిన బడ్జెట్‌పై చర్చలో మాట్లాడారు.

‘దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినడానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కారణం. కాంగ్రెస్ పార్టీని చరిత్రలో ప్రజలు ఎన్నటికీ క్షమించరు. కాంగ్రెస్ పరిపాలనలో దేశం ఆర్థికంగా అధోగతి పాలయింది. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారనడానికి  గణాంకాలే సాక్ష్యం. దేశ జీడీపీ ఏడు శాతాన్ని దాటింది.

..కాంగ్రెస్ దిగిపోయిన తర్వాత ఇండియా ఆర్థిక వ్యవస్థ వేగంగా పెరుగుతున్నది. ధనిక పేదల మధ్య అంతరం తగ్గుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ధరలు విపరీతంగా పెరిగాయి. అవినీతికి పర్యాయపదం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ సహాయంలోని దేశంలో 2జీ, కామన్వెల్త్, బొగ్గు కుంభకోణం లాంటి అతిపెద్ద కుంభకోణాలు జరిగాయి. 2014లో ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో 142వ స్థానం ఉన్న దేశం ఇప్పుడు నుంచి 62వ స్థానికి వచ్చింది’ అని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement