బాధ్యతలు స్వీకరించిన పలువురు కేంద్ర మంత్రులు | Modi 3.0 Cabinet: Several union ministers takes charge in Delhi | Sakshi
Sakshi News home page

బాధ్యతలు స్వీకరించిన పలువురు కేంద్ర మంత్రులు

Jun 11 2024 10:33 AM | Updated on Jun 11 2024 1:08 PM

Modi 3.0 Cabinet: Several union ministers takes charge in Delhi

ఢిల్లీ: కేంద్రంలో ఎన్డీయే  ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధాని మోదీ సహా పలువురు ఎంపీలు కేంద్ర మంత్రులుగా  ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణం చేసిన మంత్రులకు  నిన్న (సోమవారం) మంత్రిత్వ శాఖలు కేటాయించబడ్డాయి.

 

దీంతో మంగళవారం పలువురు కేంద్ర మంత్రులు తమ మంత్రిత్వ శాఖ బాధ్యతులు స్వీకరించారు. విదేశాంగ శాఖ మంత్రిగా ఎస్‌. జయశంకర్ బాధ్యతలు స్వీకరించారు. విద్యుత్ శాఖ మంత్రిగా మనోహర్‌ లాల్‌ ఖట్టర్ బాధ్యతలు స్వీకరించించారు.

 

అదేవిధంగా పెట్రోలియం శాఖ మంత్రిగా హర్దీప్ సింగ్ పూరి, పెట్రోల్ శాఖ సహాయ మంత్రిగా సురేష్ గోపి, అటవీ పర్యావరణ శాఖ సహాయ మంత్రి భూపేంద్ర యాదవ్ మంత్రులు బాధ్యతలు స్వీకరించారు.

సమాచార, ప్రసార మంత్రిగా అశ్విని వైష్ణవ్‌ బాధ్యతలు స్వీకరించారు.
 

 

 

కేంద్ర హోం మంత్రిగా అమిత్ షా బాధ్యతలు స్వీకరించారు. అమిత్ షాకు స్వాగతం పలికిన సహాయ మంత్రులు బండి సంజయ్, నిత్యానంద రాయి. కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన శివరాజ్ సింగ్ చౌహన్, కిరణ్ రిజీజు, జ్యోతిరాధిత్యసిందియా, జేపీ నడ్డా.
 

Advertisement
 
Advertisement
Advertisement