ఆ ధైర్యం చంద్రబాబుకు ఉందా?: మంత్రి జోగి రమేష్‌ | Minister Jogi Ramesh Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

ఆ ధైర్యం చంద్రబాబుకు ఉందా?: మంత్రి జోగి రమేష్‌

Jun 25 2022 8:41 PM | Updated on Jun 25 2022 9:01 PM

Minister Jogi Ramesh Comments On Chandrababu - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనుసరిస్తున్న సామాజిక న్యాయం దేశానికే ఆదర్శమని మంత్రి జోగి రమేష్‌ అన్నారు. వైఎస్సార్‌సీపీలో ఉన్నందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు.

సాక్షి, కృష్ణా జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనుసరిస్తున్న సామాజిక న్యాయం దేశానికే ఆదర్శమని మంత్రి జోగి రమేష్‌ అన్నారు. వైఎస్సార్‌సీపీలో ఉన్నందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు. పెనమలూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం అమలు చేసి చూపించారన్నారు.
చదవండి: నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాదు: కేశినేని నాని

పూలే ఆశయాలను సీఎం జగన్‌ నిజం చేసి చూపారన్నారు. వైఎస్సార్‌సీపీని ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబుకి లేదన్నారు. చంద్రబాబు, పవన్‌ కలిసి పోరాడిన జగన్‌ను ఏం చేయలేరన్నారు. ‘‘దేశానికి రాష్ట్రపతిని ఎంపిక చేయడంలో సామాజిక న్యాయం పాటించారంటే అది జగన్ స్పూర్తే. వచ్చే ఎన్నికల్లో 151 కంటే పై చిలుకు స్థానాల్లో గెలవ బోతున్నామని’’ మంత్రి జోగి రమేష్‌ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement