
పల్నాడు: రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ సిద్ధమైందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వైఎస్సార్‌సీపీ పార్టీ ఎన్నికల్లో గెలిచి అధికారంలో వస్తుందని.. అప్పటివరకు టీడీపీ, జనసేన సీట్ల పంచాయితీ తేలదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు-పవన్ బీజేపీ మంత్రి అంబటి కీలక వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు, పవన్ మధ్య నోట్లు తేల్చుకుంటే తప్ప సీట్లు తేలే పరిస్థితి లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు అద్దె ఇంట్లో పవన్ కల్యాణ్-చంద్రబాబు భేటీ అయ్యారని.. వారు అలా భేటీ అవుతునే ఉంటారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో తెలియదని.. చంద్రబాబు కూడా కుప్పంలో పోటీ చేస్తారో? మరోచోట నుంచి పోటీ చేస్తారో? తెలియదని అన్నారు. అసలు వారు ముందు ఎక్కడ పోటీ చేయాలో తేల్చుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో తాము ఇప్పటికే ఎన్నికలకు సిద్ధమయ్యామని.. యుద్ధం కూడా అయిపోయిందన్నారు. వైఎస్సార్‌సీపీ గెలిచి అధికారంలోకి వస్తుందని.. అప్పటిదాకా వాళ్లు(టీడీపీ-జనసేన) సీట్లు తేల్చుకోలేరని ఎద్దేవా చేశారు.
పవన్ కల్యాణ్‌ను నమ్మిన వారు కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టేనని మంత్రి అంబటి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్ కల్యాణకు ఇచ్చేది ముష్టి సీట్లు మూడో, ముప్పైయో, ఇరవైఐదో ఏమో ముష్టివేస్తూ.. క్యాష్ ఏమో బలంగా ఇస్తారని వివర్శలు చేశారు.