పేపర్ చూడొద్దు.. ‘రీజువెనేష‌న్’ స్పెల్లింగ్ చెప్తే 50 ల‌క్ష‌లిస్తా..రేవంత్‌కు కేటీఆర్‌ ఆఫర్‌ | Ktr Offer Rs50 Lakhs To Revanth Reddy | Sakshi
Sakshi News home page

పేపర్ చూడొద్దు.. ‘రీజువెనేష‌న్’ స్పెల్లింగ్ చెప్తే 50 ల‌క్ష‌లిస్తా..రేవంత్‌కు కేటీఆర్‌ ఆఫర్‌

Oct 18 2024 7:23 PM | Updated on Oct 18 2024 7:40 PM

Ktr Offer Rs50 Lakhs To Revanth Reddy

సాక్షి,హైదరాబాద్‌ : సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆఫర్ ఇచ్చారు. పేపర్ చూడకుండా.. రిజునువేషన్ స్పెల్లింగ్ చెప్తే రేవంత్‌రెడ్డికి రూ. 50లక్షల బ్యాగ్ గిఫ్ట్ ఇస్తాను’ అని అన్నారు.  తెలంగాణ భ‌వ‌న్‌లో మూసీపై కేటీఆర్ ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేషన్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో కేటీఆర్ ఏమన్నారంటే..‘ కేసుల భయంతోనే మోదీకి రేవంత్ సాగిలపడ్డారు. దామగుండం నేవీ రాడార్ స్టేషన్‌తో   12లక్షల చెట్లు కొట్టేస్తారు. మా హాయాంలో చేసిన పది వేల ఆర్థిక సాయంపై విచారణ జరుపుకోవచ్చు. మూసీతో పాటు.. ఆరు గ్యారంటీల అమలుపై కూడా అసెంబ్లీలో చర్చకు సిద్ధం. అసెంబ్లీ .. అసెంబ్లీలా నడవటం లేదు.. ప్రతిపక్షానికి మైక్ ఇవ్వటం లేదు.’

‘పేదల కడుపుకొట్టాన్ని మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాం. మూసీ శుద్ది చేయటాన్ని వ్యతిరేకం కాదు.. దోచుకోవటాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నాం. కోకాపేట, ఓఆర్ఆర్ కుంభకోణాలు ఉంటే విచారణ చేసుకో రేవంత్. మూసీ ప్రాజెక్ట్ తో ఎంత భూమి సాగులోకి వస్తుంది?.రేవంత్ రూ.50 లక్షలతో దొరికి తొమ్మిదేళ్ళు అయినా శిక్ష పడలేదు.పేపర్ చూడకుండా.. రిజునువేషన్ స్పెల్లింగ్ చెప్తే రేవంత్‌కు రూ. 50లక్షల బ్యాగ్ గిఫ్ట్ ఇస్తాను.మాటలు మార్చి దొరికిపోవటం సీఎం రేవంత్ రెడ్డి స్పెషాలిటీ. రెడ్ కార్నర్ నోటీసులున్న పాకిస్తాన్ సంస్థకు మూసీ ప్రాజెక్ట్ ఎలా ఇస్తారు?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. 

Advertisement
 
Advertisement
Advertisement