సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్‌ ఫైర్‌ | KTR Fire On CM Revanth Reddy Over Farmers Issue | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్‌ ఫైర్‌

Published Wed, Mar 20 2024 1:43 PM | Last Updated on Wed, Mar 20 2024 1:46 PM

KTR Fire On CM Revanth Reddy Over Farmers Issue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైతులంటే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎందుకింత చిన్నచూపు అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదని.. వడగళ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడటం లేదని ఎక్స్‌ వేదికగా విమర్శలు గుప్పించారాయన. 

‘‘ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప.. గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా? వాళ్ల ఆర్తనాదాలు వినిపించవా? ఎన్నికల గోల తప్ప.. ఎన్నో కష్టాలు పడుతున్న శ్రామికులపై కనికరం లేదా? సీట్లు, ఓట్ల పంచాయితీ తప్ప.. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా? ప్రజాపాలన అంటే 24/7 ఫక్తు రాజకీయమేనా? పార్టీ ఫిరాయింపులపై ఉన్న దృష్టి.. పంటనష్టంపై లేదెందుకు? దెబ్బతిన్న పంటలను పరిశీలించే తీరిక లేదా?.. 

.. హైకమాండ్ చుట్టూ చక్కర్లు కొడుతున్న మీకు.. రైతుల సమస్యలు వినే ఓపిక లేదా? ఇంతకాలం పచ్చని పైర్లు ఎండుతున్నా.. సాగునీరు ఇవ్వడం చేతకాలేదు. ఇప్పుడు నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలన్న మనసు రావడం లేదా? అన్నదాతలకు జరుగుతున్న అన్యాయంపై బీఆర్‌ఎస్‌ పోరాడుతూనే ఉంటుంది’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement