లైంగిక ఆరోపణలు.. జానీ మాస్టర్‌పై నామమాత్రపు చర్యలు | Janasena party Action On Jani Master Over Allegations | Sakshi
Sakshi News home page

లైంగిక ఆరోపణలు.. జానీ మాస్టర్‌పై నామమాత్రపు చర్యలు

Sep 16 2024 4:32 PM | Updated on Sep 16 2024 5:16 PM

Janasena party Action On Jani Master Over Allegations

టాలీవుడ్‌ ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌పై ఓ యువతి లైంగిక ఆరోపణలు చేయడం అటు సినీ ఇండస్ట్రీలో.. ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. తనపై అ‍త్యాచారానికి పాల్పడ్డారంటూ.. జానీ మాస్టర్ వద్ద కొన్నాళ్లుగా పనిచేస్తున్న ఓ మహిళా డ్యానర్స్‌  పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి  కేసును నార్సింగి పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. ప్రస్తుతం యువతి ఆరోపణలపై నార్సింగి పోలీసులు  విచారణ చేపట్టారు.

కాగా పవన్ కల్యాణ్ అభిమాని అయిన జానీ మాస్టర్.. గత ఎన్నికల ముందు జనసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అదే సమయంలో పార్టీ జానీ మాస్టర్‌ను స్టార్ క్యాంపెయినర్‌గా కూడా నియమించింది. ఈ క్రమంలో ఆయనపై అత్యాచార ఆరోపణలు రావడంతో..  జనసేన పార్టీ కేవలం నామమాత్రపు చర్యలు మాత్రమే తీసుకుంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని మాత్రమే జనసేన ఆదేశించింది.  

ఆయ‌నపై రాయ‌దుర్గం పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైన క్ర‌మంలో పార్టీ నాయ‌క‌త్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా తెలిపింది. త‌క్ష‌ణ‌మే ఈ నిర్ణ‌యం అమ‌లులోకి వ‌చ్చిన‌ట్లుగా పేర్కొంది. ఈ మేర‌కు జ‌న‌సేన పార్టీ ఓ ప్ర‌క‌ట‌న ద్వారా ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. అయితే  జానీ మాస్టర్‌పై కేసు నమోదైనా కేవలం పార్టీ కార్యక్రమాలకు మాత్రమే దూరంగా ఉండాలని చెప్పడం గమనార్హం.

అయితే జానీ మాస్టర్‌పై నమోదైన ఎఫ్ఐఆర్‌లో మహిళా కొరియోగ్రాఫర్‌ కీలక విషయాలు వెల్లడించింది. 2017లో డీషోలో జానీ మాస్టర్ తో పరిచయం అయిందని, ఆ తర్వాత జానీ మాస్టర్ టీం నుంచి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా ఉండాలంటూ ఫోన్ రావడంతో 2019లో జానీ మాస్టర్ టీంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేరినట్లు తెలిపింది.
చదవండి: జానీ మాస్టర్ కేసు.. బయటకొస్తున్న నిజాలు!?

ఓ షో కోసం జానీ మాస్టర్ తో పాటు మరో ఇద్దరితో కలిసి ముంబైకి వెళ్లిన సమయంలోఅక్కడ హోటల్లో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడు అని ఆరోపించింది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించారని ఆరోపించింది. షూటింగ్‌కు సంబంధించిన వాహనంలోనూ పలుమార్లు వేధింపులకు పాల్పడ్డారని పోలీసులకు తెలిపింది.

పలుమార్లు షూటింగ్ సమయంలో జానీ మాస్టర్ చెప్పినట్లు వినకపోతే అసభ్యంగా ప్రవర్తించేవాడ‌ని చెప్పింది. మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం కూడా చేశారని పేర్కొంది. గత నెల 28న అనుమానాస్పద పార్శిల్‌ తన ఇంటి ముందు ఉందని.. దానిపై ‘ఇదే నీ చివరి షూటింగ్‌’ అని రాసి ఉన్నట్లు బాధితురాలు తెలిపారు. తనకు అవకాశాలు లేకుండా చేస్తున్నారని.. జానీ మాస్టర్‌ నుంచి ప్రాణహాని ఉన్నట్లు పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు.

ముంబై తీసుకెళ్లి హోటల్‌లో దారుణం..

Advertisement
 
Advertisement
Advertisement