
సాక్షి,హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబుపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పలు మార్లు చంద్రబాబు తీరును బహిరంగంగానే విమర్శించారు. తాజాగా, మరోమారు అదే తరహాలో చంద్రబాబుపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ‘తెలంగాణలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారు. ఇరిగేషన్, రోడ్డు కాంట్రాక్ట్‌లు చూసేది బాబు కోవర్టులే. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలు రాయడం కాదు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ పైసలు ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి’ అంటూ వ్యాఖ్యానించారు.