ఇప్పటికైనా నిద్రలేవడం సంతోషం.. కేటీఆర్‌ సెటైర్లు | Ex Minister Ktr Satires On Revanth Reddy Govt | Sakshi
Sakshi News home page

ఇప్పటికైనా నిద్రలేవడం సంతోషం.. కేటీఆర్‌ సెటైర్లు

Oct 9 2026 8:11 PM | Updated on Oct 9 2026 8:20 PM

Ex Minister Ktr Satires On Revanth Reddy Govt

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సర్కార్‌పై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సెటైర్లు విసిరారు. బతుకమ్మ కానుకగా 2 కొత్త పథకాలు ప్రారంభిస్తారని తెలిసింది. ప్రభుత్వం వచ్చిన వందరోజుల్లో హామీలు అమలు చేస్తామన్నారు. వెయ్యి రోజుల తర్వాత అయినా నిద్రలేవడం సంతోషం. మిగిలిన 418 హామీలు ఏమయ్యాయి? రాహుల్‌ జీ’’ అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

వనపర్తి జిల్లాలో కేసులు నమోదైన రైతులతో కేటీఆర్‌ ఫోన్‌లో మాట్లాడారు. రైతులంతా ధైర్యంగా ఉండాలన్న కేటీఆర్‌.. ప్రభుత్వం కేసులు పెట్టీ భయపెట్టాలని చూస్తుందన్నారు. బీఆర్ఎస్‌ మీకు అండగా ఉంది. అవసరమైన న్యాయ సహాయం చేస్తాం. . సుప్రీం కోర్టు వరకు వెళ్లి అయినా సరే మీ పక్షాన పోరాడుతాం. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక కేసులు ఎత్తివేస్తాం.. స్థానిక నాయకత్వం మీకు అన్ని విధాలుగా సహాయం అందిస్తోంది. రైతులకు నీళ్లు ఇవ్వలేని చేతగాని ప్రభుత్వం ఇది’’ అంటూ కేటీఆర్‌ ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి: 95 లక్షల ఓట్ల తొలగింపు.. ఇదిగో క్లారిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement