95 లక్షల ఓట్ల తొలగింపు.. ఇదిగో క్లారిటీ | Telangana Chief Electoral Officer Responded To Reports Deletion Of Votes | Sakshi
Sakshi News home page

95 లక్షల ఓట్ల తొలగింపు.. ఇదిగో క్లారిటీ

Oct 9 2026 3:34 PM | Updated on Oct 9 2026 3:42 PM

Telangana Chief Electoral Officer Responded To Reports Deletion Of Votes

సాక్షి, హైదరాబాద్‌: ఓట్లు తొలగింపు వార్తలపై తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి స్పందించారు. 95 లక్షల ఓట్లు తొలగించారన్నది అవాస్తవం ఆయన స్పష్టం చేశారు. 73,39,235 మంది ఓటర్లు ఏఎస్‌డీడీ కేటగిరీలోకి మార్పు జరిగిందన్న సీఈవో.. 92,23,486 నోటీసులు పంపిణీ చేశామన్నారు. మరో 64,701 నోటీసుల పంపిణీ పెండింగ్‌లో ఉందన్నారు. ఇప్పటివరకు 82,11,205 మంది ఓటర్ల విచారణ పూర్తయినట్లు సీఈవో వెల్లడించారు.

తుది జాబితా ప్రచురణకు అర్హులుగా 74,62,851 మంది, అర్హత లేనివారిగా గుర్తించిన ఓటర్లు 12,969 మందిగా గుర్తించామన్నారు. 18,12,367 మంది ఓటర్లపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్న సీఈవో.. నవంబర్ 5 లోగా పెండింగ్ నోటీసులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. నోటీసులు, క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారానికి నవంబర్ 5 వరకు గడువు ఉందని.. 95 లక్షల ఓట్లు తొలగించారన్న ప్రచారం సరైంది కాదని తెలంగాణ సీఈవో తేల్చి చెప్పారు.

ఇదీ చదవండి: TG: ఎస్‌ఐఆర్‌పై సీఈవో కీలక ఆదేశాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement