ఎలక్షన్‌ కమిషన్‌కు ‘చాట్‌జీపీటీ’ కంపెనీ సాయం! | ECI seeks OpenAI advice on combating AI in elections | Sakshi
Sakshi News home page

ఎలక్షన్‌ కమిషన్‌కు ‘చాట్‌జీపీటీ’ కంపెనీ సాయం!

Mar 9 2024 6:53 PM | Updated on Mar 9 2024 7:15 PM

ECI seeks OpenAI advice on combating AI in elections - Sakshi

దేశంలో త్వరలో జరగనున్న లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. కృత్రిమ మేధస్సు (AI) పోలింగ్ ప్రక్రియకు అడ్డంకి కాకుండా ఎదుర్కొనేందుకు ‘చాట్‌జీపీటీ’ సృష్టికర్త  ‘ఓపెన్‌ ఏఐ’  సాయం తీసుకుంటోంది.

ఈ మేరకు ఈసీఐ అధికారులు ఓపెన్‌ ఏఐ ప్రతినిధులతో ఇటీవల సమావేశం నిర్వహించారు. గత నెలలో జరిగిన ఈ సమావేశానికి భారత ఎన్నికల సంఘం కోసం ఓపెన్‌ ఏఐ ఒక ప్రజెంటేషన్‌ను సిద్ధం చేసింది. పోలింగ్ ప్రక్రియలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ దుర్వినియోగం కాకుండా ఎలా అరికట్టాలో కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు ఎలక్షన్‌ కమిషన్‌కు సూచనలిచ్చారు.

ఈ సమావేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లోని పురోగతులను అధిక స్థాయిలో లోక్‌సభ ఎన్నికల సమయంలో దుర్వినియోగం కాకుండా చూసేందుకు బడా టెక్ కంపెనీలు, కేంద్ర సంస్థలు తీసుకోవాల్సిన చర్యల గురించి కేంద్ర ఎన్నికల సంఘానికి ఓపెన్‌ఏఐ ప్రతినిధులు తెలియజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement