‘అమిత్‌షా క్షమాపణలు చెప్పాల్సిందే’ | Congress Demands Amit Shah's Apology For Remarks On Ambedkar In Parliament Speech, More Details Inside | Sakshi
Sakshi News home page

‘అమిత్‌షా క్షమాపణలు చెప్పాల్సిందే’

Dec 18 2024 7:56 AM | Updated on Dec 18 2024 9:21 AM

Congress Slams Amit Shah's Remarks on Ambedkar

ఢిల్లీ : భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను అవమానించినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది.

భారత రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభల్లో భారత రాజ్యాంగం పై చర్చ  రెండు రోజుల పాటు చర్చ జరిగింది. 

మంగళవారం జరిగిన చర్చ సమయంలో అమిత్‌షా  కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. రాజకీయ లబ్ధి కోసం బీఆర్‌ అంబేద్కర్‌ పేరును వినియోగించుకోవడం 'ఫ్యాషన్'గా మారిందని అన్నారు. అంబేద్కర్‌,అంబేద్కర్‌ అని జపం చేస్తున్నారు. బదులుగా దేవుడి పేరు తలుచుకుంటేనైనా పుణ్యం వస్తుంది. స్వర్గానికి వెళ్లొచ్చని విరుచుకు పడ్డారు.  

 అయితే, అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై ​కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీతో పాటు కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్‌ వేదికగా రాహుల్‌ గాంధీ స్పందించారు. మనుస్మృతిని విశ్వసించే వారు ఖచ్చితంగా అంబేద్కర్‌తో విభేదిస్తారు' అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

బాబాసాహెబ్ అంబేద్కర్‌ను హోంమంత్రి అవమానించడంతో బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ త్రివర్ణ పతాకానికి వ్యతిరేకమని, వారి పూర్వీకులు అశోక్ చక్రాన్ని వ్యతిరేకించారని, సంఘ్ పరివార్ ప్రజలు మనుస్మృతిని అమలు చేయాలనుకుంటున్నారని ఖర్గే అన్నారు.  బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుడి కంటే తక్కువేం కాదు.. ఆయన దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, పేదల దూతగా ఉంటారని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement