‘మేం చేసింది చెప్పాలంటే రాస్తే రామాయణం.. చెబితే భారతం’ | CM Revanth Reddys Address at Jadcherla Public Governance | Sakshi
Sakshi News home page

‘మేం చేసింది చెప్పాలంటే రాస్తే రామాయణం.. చెబితే భారతం’

Jun 5 2026 11:01 PM | Updated on Jun 5 2026 11:01 PM

CM Revanth Reddys Address at Jadcherla Public Governance

జడ్చర్ల:  పాలమూరు బిడ్డగా రెండు రోజులుగా జిల్లా రైతుల కోసం సాగునీరు ప్రాజెక్టులను పరిశీలించానని, వలసల కష్టాలు, ఆత్మహత్యల నష్టాలు తెలుసన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. జడ్చర్ల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక బహిరంగ సభలో సీఎం రేవంత్‌ ప్రసంగించారు. 

పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు లేకపోయినా ఇక్కడికి రాజకీయంగా వలసవచ్చిన కేసీఆర్ ను ఇక్కడి ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. ఒక తల్లిగా  ఇక ఏ తల్లికి గుండెకోత ఉండొద్దని సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. కెసీఆర్‌ను లంగాణకు రెండుసార్లు ముఖ్యమంత్రిని చేస్తే…పదేళ్లలో పాలమూరు జిల్లాలోని ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు. మన భూములకు సాగునీళ్లు రాలేదు.. మన కష్టాలు తీరలేదన్నారు. 

రేవంత్ రెడ్డి ఏం చేసిండని కొందరు అవాకులు చవాకులు పేలుతున్నారు. 15 లక్షల రేషన్ కార్డులు అందించాం. 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశాం. 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాం. పది వేల కోట్లు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణానికిఖర్చు చేశాం. ఇలా మేం చేసింది చెప్పాలంటే రాస్తే రామాయణం.. చెబితే భారతం’అని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement