బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం ప్రసక్తే లేదు | Bandi Sanjay Sensational Comments On KTR Arrest | Sakshi
Sakshi News home page

బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం ప్రసక్తే లేదు

Aug 11 2024 4:28 AM | Updated on Aug 11 2024 4:28 AM

Bandi Sanjay Sensational Comments On KTR Arrest

కేటీఆర్‌ను రేవంత్‌ జైల్లో వేస్తారనే నమ్మకముంది

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘బీఆర్‌ఎస్‌తో బీజేపీ చర్చలు ఫేక్‌ న్యూస్‌. బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం అనే ప్రసక్తే లేదు’’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ స్పష్టం చేశారు. శనివా రం బీజేపీ కార్యాలయంలో మీడియా ప్రతిని ధులతో సంజయ్‌ ఇష్టాగోష్ఠిగా మాట్లాడు తూ..’’బీఆర్‌ఎస్‌ అవుట్‌ డేటెడ్‌ పార్టీ. 

ఎమ్మెల్సీ కవిత బెయిల్‌కు, బీజేపీకి సంబంధం ఏమిటి? ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకు బెయిల్‌ వస్తే... బీజేపీకి ఏమైనా సంబంధముందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో కవితకు బెయిల్‌ వస్తే బీజేపీయే ఇప్పించిందనే ప్రచారం చేసినా ఆశ్చర్యపోవడానికి లేదు’’ అని అన్నారు. మాజీ మంత్రి కేటీఆర్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి జైల్లో వేస్తారనే నమ్మకం తనకుందని సంచలన వ్యాఖ్య చేశారు. ’’కేసీఆర్‌ పాలనలో పోలీసులను ప్రయో గించి బయట మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. నాతో సహా బీజేపీ కార్యకర్తలను కేటీఆర్‌ హింసించి, జైల్లో వేసిన తీరును ఎవరూ మర్చిపోలేదు’’ అని పేర్కొన్నారు 

కాంగ్రెస్‌లో లుకలుకలు మొదలైనయ్‌..
‘కాంగ్రెస్‌ పార్టీలో లుకలుకలు మొదలైనయ్‌. ఇత ర పార్టీలను చీల్చి లాభం పొందాలనే ఆలోచన బీజేపీకి లేదు. కాంగ్రెస్‌కు ప్రజలు ఐదేళ్ల అధికా రం ఇచ్చారు. ఆ అధికారాన్ని నిలుపుకుంటారా? వదులుకుంటారా? అనేది ప్రభుత్వ తీరుపై ఆధారపడి ఉంది’ అని బండి సంజయ్‌ అన్నారు. తమ్ముడి కోసమే రేవంత్‌రెడ్డి అమెరికా వెళ్లారనడం సరికాదు.. రాజకీయాల్లో విమర్శలు చేసేటప్పుడు హుందాగా వ్యవహరించాలి. అయితే సొంత వ్యవహారాల కోసమే విదేశాలకు అప్పుడు బీఆర్‌ఎస్‌ పెద్దలు వెళ్ళారు.. ఇప్పుడు రేవంత్‌ వెళ్ళారు. ఏమీ తేడా లేదు’ అని వ్యాఖ్యా నించారు.

‘అసదుద్దీన్‌ ఒవైసీ.. ఎన్ని వక్ఫ్‌ బోర్డు భూములను కాపాడారో సమాధానం చెప్పాలి. గతంలో వక్ఫ్‌ బోర్డు భూములను కాంగ్రెస్, ఎంఐఎం నేతలు చాలా చోట్ల కబ్జా చేశారు. వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లు ఆమోదం పొందితే వాస్తవా లు వెల్లడవు తాయి’ అని సంజయ్‌ చెప్పారు. ముచ్చర్ల చుట్టూ ఎన్ని భూములు కొట్టేశారో గానీ ప్రభుత్వం అక్కడ ఫోర్త్‌ సిటీ నిర్మిస్తామని చెబుతోందన్నారు. అమరావతి చుట్టుపక్కల చంద్రబాబు భూముల సంగతేమిటి అని ఓ విలేకరి ప్రశ్నించగా.. నేను అమరావతి వెళ్ళలేదు.. అక్కడ చంద్రబాబు భూముల గురించి తెలియదు అని సంజయ్‌ బదులిచ్చారు.

అందుకే హరీశ్‌ మంచి లీడర్‌ అన్నాను
’’పంచాయతీలకు కేంద్రమే నిధులిస్తోందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఇప్పటికైనా చెప్ప డం శుభ పరిణామం. ఆ విషయం చెప్తున్నారు కాబట్టే.. హరీశ్‌ మంచి లీడర్‌ అన్నాను’ అని సంజయ్‌ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement