టీడీపీ బండారు శ్రావణికి ఎదురుదెబ్బ | Bandaru Sravani Sree Father Arrested | Sakshi
Sakshi News home page

టీడీపీ బండారు శ్రావణికి ఎదురుదెబ్బ

Sep 16 2023 9:25 PM | Updated on Sep 16 2023 9:26 PM

Bandaru Sravani Sree Father Arrested - Sakshi

శింగనమల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి బండారు శ్రావణి శ్రీకి ఎదురు దెబ్బ తగిలింది.. 

సాక్షి, అనంతపురం: శింగనమల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి బండారు శ్రావణి శ్రీకి ఎదురుదెబ్బ తగిలింది. ఓ మహిళ ఆత్మహత్య కేసులో ఆమె తండ్రి బండారు రవికుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురంలో మూడు రోజుల క్రితం రాజమ్మ(45) ఆత్మహత్య చేసుకుంది. బండారు రవికుమార్ వేధింపులే కారణమంటూ రాజమ్మ సెల్ఫ్ విడియో తీసింది. భూ వివాదంలో  బండారు రవికుమార్ వేధిస్తున్నారంటూ అందులో ఆరోపించింది బాధితురాలు. 

ఈ వీడియో బయటకు రావడంతో.. కేసు నమోదు చేసి టీడీపీ నేత రవికుమార్‌ను అరెస్ట్‌ చేసి ‍స్టేషన్‌కు తరలించారు.


 

Advertisement
 
Advertisement
Advertisement