
సాక్షి, వైఎస్సార్‌సీపీ: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ.. పోలీసుల కుట్రలు కొనసాగుతున్నాయి. డీఐజీ కోయ ప్రవీణ్ ఫుల్ పోలీస్‌ఫోర్స్‌తో మంగళవారం మధ్యాహ్నాం వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్దకు వచ్చారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఆఫీస్‌లోనే నిర్బంధించారు.
పోలీసులు అక్కడికి వచ్చిన సమయంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను దూషించారు. అయితే తమను రెచ్చగొట్టవద్దంటూ కొందరు పోలీసుల కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేశారు. అది గమనించిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి కార్యకర్తలను వద్దని వారించారు.
‘‘పులివెందులపై చంద్రబాబు, లోకేష్‌లు పగబట్టారు. రిగ్గింగ్ జరిగినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయి. పోలీసులు చేయాల్సిన నష్టమంతా చేశారు. ఇంకా ఏం చేయాలనుకున్నా చేసుకోనివ్వండి. కార్యకర్తలు సంయమనం పాటించండి. అన్నింటిని న్యాయపరంగా ఎదుర్కొంటాం’’ అని కార్యకర్తలను ఉద్దేశించి అవినాష్ అన్నారు.

అయితే తాము భద్రత కల్పించేందుకు వచ్చామని పోలీసులు చెప్పగా.. ఆ అవసరం లేదని, మా ఓటు మమ్మల్ని వేసుకోనివ్వాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులు కోరాయి. ఈ క్రమంలో అవినాష్ రెడ్డిని ఆఫీస్‌లోపలే ఉంచి కోయ ప్రవీణ్ అక్కడే ఉండిపోయారు. అంతకు ముందు..
ఈ ఉదయం అవినాష్ రెడ్డిని నివాసం నుంచి పోలీసులు బలవంతంగా తమ వెంట తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అయితే పోలీసుల చెర నుంచి విడుదలైన వైఎస్ అవినాష్ రెడ్డి కడప కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. అక్కడ మాట్లాడుతూ.. ప్రస్తుతానికి వైఎస్సార్‌సీపీ చేయగలిగింది ఇదొక్కటే. కోర్టును ఆశ్రయించడం తప్ప మరో మార్గం లేదు. దౌర్జన్యం చేసుకునేందుకు, ప్రజల్ని ఓట్లు వేయనీకుండా చేసేందుకు, బూత్ క్యాప్చర్లు చేసుకుని యథేచ్ఛగా రిగ్గింగ్ చేసుకునేందుకు అధికారం ఎంతటి వెసులుబాటు ఇస్తుందో ఈ ఎన్నికలే ఉదాహరణ. విచారకరం ఏమంటే ఇన్ని దారుణాలు జరిగినా TDP will get away with it.

ఈ ఎన్నిక గెలిచినా టీడీపీ తాను ప్రజల్లో ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నది మాత్రం చేయలేదు. ఈ ఎన్నికలు ఎలా జరిగాయో ప్రజలు చూసారు. ప్రజలను కనీసం బూతుల వద్దకు రానీకుండా అడ్డుకుని టీడీపీ అన్ని హద్దులు చేరిపివేసింది. కోర్టు తీర్పు వైసీపీకి అనుకూలంగా వస్తే మాత్రం టీడీపీకి ఎంబారెస్మెంట్ తప్పదు అని అవినాష్ రెడ్డి అన్నారు.