వదినా మరుదుల కుట్ర ఫలితమే విధ్వంసం | Appireddy comments over Chandrababu and Purandeshwari | Sakshi
Sakshi News home page

వదినా మరుదుల కుట్ర ఫలితమే విధ్వంసం

May 18 2024 4:44 AM | Updated on May 18 2024 4:44 AM

Appireddy comments over Chandrababu and Purandeshwari

అరాచకాల వెనుక చంద్రబాబు, పురందేశ్వరి

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పిరెడ్డి  వెల్లడి

సాక్షి, అమరావతి: ‘ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ముందెన్న­డూ ఎరుగని రీతిలో ఈసారి సార్వత్రిక ఎన్ని­కల్లో దాడులు, అల్లర్లు జరి­గాయి, ఇంకా కొనసాగు­తూనే ఉన్నాయి, ఇందుకు కారణాల్ని పరిశీలిస్తే.. ఈ దాడుల వెనుక చంద్రబాబు, ఆయన వదిన పురందేశ్వరి ధ్వంసరచన కుట్రే కనిపిస్తోందని’.. వైఎస్సార్‌­సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసనమండలి విప్‌ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘టీడీపీ రౌడీమూకలంతా రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య సూత్రాల్ని పక్కనబెట్టి యథేచ్ఛగా బరితెగించి దాడులకు దిగాయి. 

ఈ మూకలు అంతగా రౌడీయిజం చెలాయిస్తూ, వైఎస్సార్‌సీపీ కేడర్‌ను లక్ష్యంగా చేసుకుని దౌర్జన్యాలు చేస్తున్నా, పోలీసు­యంత్రాంగం  నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడా­న్ని రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చూస్తున్నాం.. చంద్రబాబు, పురందేశ్వరి కలిసి ఎన్నికల కమిషన్, పోలీసు యంత్రాంగం ద్వారా  ఎన్ని­కల ప్రక్రియను అడ్డగోలుగా తమకు అనుకూలంగా చేసుకోవడానికి  ప్రయత్నించారన్నది ఈసీ చర్యలతో రుజువైందని’.. అప్పిరెడ్డి వివరించారు. ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల టార్గెట్‌గా జరిగిన పెత్తందార్ల దాడులివి. 

వదిన మరుదులు పురందేశ్వరి, చంద్రబాబుల ధ్వంసరచన కుట్రకు ఐఏఎస్, ఐపీఎస్‌లు బలయ్యారు. పోలీసులే పాత్రధారులుగా తాడిపత్రి, నరసరావుపేట దుర్ఘటనలు జరిగాయి. కేంద్ర పోలీసు పరిశీలకుడు దీపక్‌మిశ్రా కనుసన్న­ల్లోనే ఈ దాడులు జరిగాయి.  మేం అధికారంలోకి రాగానే తప్పు­డు అధికారులపై చర్యలుంటాయి..’ అని అప్పి­రెడ్డి హెచ్చరించారు. ‘సీఎం జగన్‌  నాయకత్వమే మళ్లీ రావాలని పేదలు  కోరుకున్నారని ఆ వర్గాన్నే టార్గెట్‌ చేసి దాడులు చేయడం భావ్యమేనా? 

ఇప్పటికైనా ఐఏ­ఎస్‌లు, ఐపీఎస్‌లు ప్రజాస్వామ్య విలువలకు కట్టు­బడి పనిచేయాలని కోరుతున్నాం.  మేము అధికారంలోకి రాగానే  విలువల్ని తుంగలో తొక్కి చంద్రబాబు ట్రాప్‌లో పడి, ఆయన కోసం పనిచే­సిన వారందరినీ లెక్కగట్టి శాఖాపరమైన విచారణకు పిలిపిస్తాం. ఆధారాలతో సహా రుజువు చేసి వారిపై చర్యలు తీవ్రంగా తీసుకుంటామని హెచ్చరి­స్తు­న్నాం..’ అని అప్పిరెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement