Dec 24th: AP పొలిటికల్‌ అప్‌డేట్స్‌ | AP Elections Today Political News Updates And Headlines On Dec 24th In Telugu - Sakshi
Sakshi News home page

Dec 24th: AP పొలిటికల్‌ అప్‌డేట్స్‌

Published Sun, Dec 24 2023 6:59 AM

AP Elections Political News Updates Headlines Dec 24th In Telugu - Sakshi

AP Elections Political Latest Updates Telugu

5:12PM. ఆదివారం, Dec 24, 2023

రాష్ట్రంలో బీసీలకు వైఎస్సార్‌సీపీ ఇచ్చిన ప్రాధాన్యత మరే పార్టీ ఇవ్వలేదు: మంత్రి పెద్దిరెడ్డి

 • 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు.. ఏ రోజైనా కనకదాస విగ్రహావిష్కరణ చేయాలని ఆలోచన చేశారా?
 • కుప్పం ప్రజలకు కృష్ణా జలాలు చంద్రబాబు అందించలేదు
 • కుప్పం నియోజకవర్గంలో ప్రజలను బాబు ఏనాడైనా పట్టించుకున్నారా?
 • కుప్పంలో ఎమ్మెల్సీ భరత్‌ పర్యటించినట్లు బాబు పర్యటన చేయలేదు

3:10 PM, ఆదివారం, Dec 24, 2023
సీఈసీకి వైఎస్సార్‌సీపీ నేతల ఫిర్యాదు

 • కేంద్ర ఎన్నికల సంఘాలనికి వైఎస్సార్‌సీపీ నేతల ఫిర్యాదు
 • టీడీపీ, జనసేన చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయి. 
 • ఒకే వ్యక్తికి ఏపీ, తెలంగాణలో ఓట్లు ఉన్నాయని ఫిర్యాదు 
 • మరోవైపు, సీఈసీని వేర్వేరుగా కలిసిన టీడీపీ, జనసేన నేతలు
 • ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఫిర్యాదు

2:40PM,  ఆదివారం, Dec 24, 2023

నెల్లూరు జిల్లాలో టీడీపీకి షాక్‌

 • వెంకటాచలంలో టీడీపీకి ఎదురుదెబ్బ
 • టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరిన 40 కుటుంబాలు 
 • మంత్రి కాకాణి కామెంట్స్‌..
 • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి కాకాణి 
 • మాట తప్పడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య 
 • మరో మూడు నెలల్లో ఎన్నికలకు వెళ్తున్నాం 
 • గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా బాబు మోసం చేశారు 
 • వచ్చే ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు బుద్ధి చెబుతారు.  

2:30PM, ఆదివారం, డిసెంబర్‌ 24, 2023

పొత్తులపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది: ఎంపీ జీవీఎల్

 • మాపై ఆరోపణలు చేయడం సరికాదు
 • బీజేపీ నిర్ణయం లేటైనా లేటెస్ట్ గా ఉంటుంది 
 • చంద్రబాబు పీకేని ఎందుకు కలిశారో చెప్పాలి 
 • స్టీల్ ప్లాంట్ కోసం పార్లమెంట్‌లో నేనే మాట్లాడుతున్నా 
 • స్టీల్ ప్లాంట్‌ను సమర్ధవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉంది
 • అందుకు అనుగుణంగానే ఒప్పందాలు జరుగుతున్నాయి 
 • ఇప్పుడు జరుగుతున్న ఒప్పందాలకు ప్లాంట్ అమ్మకానికి సంబంధం లేదు

1:30PM, ఆదివారం, Dec 24, 2023

చంద్రబాబపై కొడాలి నాని సెటైర్లు

 • చంద్రబాబు అవుట్‌డేటెడ్‌ పొలిటీషియన్‌ 
 • ప్రశాంత్‌ కిషోర్‌ వచ్చి చంద్రబాబును కలిస్తే భూమి బద్దలైపోతుందా?
 • ప్రశాంత్‌ కిషోర్‌ను దారుణంగా తిట్టిన విషయాలు ఎల్లో బ్యాచ్‌ మరిచిపోయిందా? 
 • చంద్రబాబు ఎంత మంది పీకేలను తెచ్చి పెట్టుకున్నా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ఏమీ చేయలేరు. 
 • ఐప్యాక్‌తో ప్రశాంత్‌ కిషోర్‌కు సంబంధం లేదు. 
 • ప్రశాంత్‌ కిషోర్‌ మేము ఇప్పటికే పూర్తిగా వాడేశాం. 
 • పీకే బుర్రలో గుజ్జంతా అయిపోయింది. 
 • మేము పీకేను వ్యూహకర్తగా పెట్టుకున్నప్పుడు బీహార్‌ నుంచి వచ్చినోడు ఏం పీకుతాడు అని చంద్రబాబు ఆరోపించారు. 
 • మరి ఇప్పుడు ఎల్లో బ్యాచ్‌ చేస్తున్నదేంటి?. 
 • ఆనాడు మనకంటే గొప్పోళ్లు ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా తమ్ముళ్లూ అన్నాడు కదా. 
 • రామోజీ, రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడు.. ప్రశాంత్‌ కిషోర్‌ గురించి ఏం అన్నారో అందరికీ తెలుసు. 
 • చంద్రబాబును ప్రశాంత్‌ కిషోర్‌ కలిస్తే ఎల్లో మీడియా హడావుడి చేస్తోంది. 
 • ఇండియా కూటమిలో చేరమని చెప్పేందుకే చంద్రబాబును పీకే కలిశారు. 
 • ఇప్పుడు ప్రశాంత్‌ కిషోర్‌ వచ్చి చేసేదేమీ లేదు. 
 • బాబాయ్‌ను చంపడానికి పీకేనే ప్లాన్‌ చేశారని, జనాన్ని రెచ్చగొట్టడానికే కోడికత్తితో పొడిపించుకున్నారని అప్పుడు అన్నారు. 
 • మరి ఇప్పుడు ప్రశాంత్‌ కిషోర్‌ ఆధ్వర్యంలో చంద్రబాబు పీక కోయించుకుంటాడా?. 
 • ఏం చేస్తారో వాళ్లకే తెలియాలి. 
 • పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలు అయిపోయాక వ్యూహకర్తగా తప్పుకుని ఆయన రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు. 
 • చంద్రబాబు ఒకవైపు పవన్‌ కల్యాణ్‌ను పెట్టి బీజేపీతో చర్చలు జరుపుతున్నాడు. 
 • మరోవైపు ఇంకో పీకేను పెట్టి కాంగ్రెస్‌తో చర్చలకు తెరలేపాడు. 
 • చంద్రబాబుది రెండు కళ్ల సిద్ధాంతం. 
 • కేంద్రంలో బీజేపీ వస్తుందా? లేక కాంగ్రెస్‌ వస్తుందో తెలియక ఆందోళనకు గురవుతున్నాడు. 
   

1.01 PM, ఆదివారం, Dec 24, 2023
విషయం వీక్ అయినప్పుడు..
ప్రచారం పీక్‌లో ఉండాలని నమ్మేవాడు బాబు !!

ఒక పీకే సరిపోడు, ఇద్దరు పీకేలు కావాలంటున్న బాబు 
ఒక వైపు పవన్  కళ్యాణ్,ఇంకో వైపు ప్రశాంత్ కిషోర్ 
ఇద్దరూ జాకీలు పెట్టి లేపితే కానీ కనీస పోటీ ఇవ్వలేమని బాబు ఫీలింగ్

ప్రశాంత్ కిషోర్‌ను బీహార్  డెకాయిట్ అని రకరకాలుగా అనరాని  మాటలు అన్న బాబు, లోకేష్‌లు
ఇదే ప్రశాంత్ కిషోర్  కోసం "పాహిమాం" అంటున్నారంటే జగన్ ఎంత బలంగా ఉన్నాడో తెలియడం లేదా? 

ప్రశాంత్  కిషోర్ టీంలో  ఒకరయిన రాబిన్ శర్మ  బాబు కోసం పని చేస్తుంటే ఇంకొకరు  రిషి రాజ్ సింగ్ జగన్ కోసం పని చేస్తున్నాడు
కాబట్టి ప్రశాంత్ కిషోర్ కొత్తగా చేసేది ఏమీ ఉండదు
కుదిరితే బీజేపీ లేదంటే కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎంలను కూడా కలుపుకొని  ఇద్దరు పీకేలతో కలసి జగన్ మీదకి యుద్దానికి వెళ్లాలని వెన్నుపోటు నాయుడు ప్లాన్

అంతే కాకుండా టీడీపీ గెలుస్తుంది అని రోజూ పేక్ సర్వేలు వాట్సాప్ ప్రచారాలు
3,500 మందితో  మౌత్ క్యాంపెయిన్‌ చేయిస్తున్నాడు బాబు 
కులం కోసం బట్టలు చింపుకొనే ఈనాడు, జ్యోతి, టీవీ5, మహాన్యూస్ ఎలానూ ఉన్నాయి

తాజా సర్వేల ప్రకారం
కోస్తా లో వైసీపీకి 50  శాతం, టీడీపీకి 35-36 శాతం, జనసేనకు 10 శాతం, ఇతర పార్టీలకు మిగిలిన 3 -4 శాతం  మద్దతు ఉంది 

పవన్‌కు 20  సీట్లకు ముంచి ఇవ్వలేం అని తేల్చి చెప్పాడు బాబు 
దీంతో పవన్ మింగలేక కక్కలేక ఉన్నాడని మొన్న విజయనగరం యువగళం సభలో పవన్ బాడీ లాంగేజ్‌ను చూస్తే  తెలుస్తుంది 

సీఎం పదవి షేరింగ్  లేకుండా, 60  సీట్లు లేకుండా పోటీ చేస్తే ఒప్పుకునేది లేదంటున్న కాపు సంఘాలు, భగ్గుమంటున్న కాపు యువత 

ఇంకో వైపు సైలెంట్‌గా పని చేసుకొని పోతున్న జగన్ 
ఇన్ ఫ్రంట్ క్రొకోడైల్ ఫెస్టివల్ బాబూ...!!!

12.05 PM, ఆదివారం, Dec 24, 2023
వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టించిన చరిత్ర టీడీపీది

 • దెందులూరు వైఎస్సార్‌సీపీ నాయకుల మీడియా సమావేశం
 • ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ప్రజా ఆశీర్వాద పాదయాత్ర విజయవంతం కావడం టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు
 • వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టించిన చరిత్ర టీడీపీది
 • వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఒకరిపై కూడా తప్పుడు కేసులు పెట్టలేదు.
 • మట్టిని, పోలవరం గట్లను దోచుకున్నది చింతమనేని ప్రభాకర్, ఆయన బినామీలు
 • సీఎం జగన్‌ హయాంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు
 • మట్టి అక్రమంగా దోచుకున్న చరిత్ర చింతమనేనిదే
 • టీడీపీ హయాంలో కొల్లేరులో ఏ విధంగా చింతమనేని అక్రమ చెరువులు తవ్వారో ప్రజలకు తెలుసు
 • ఎన్ని అక్రమ కేసులు చింతమనేని.. పేదలపై పెట్టాడో అందరికీ తెలుసు
 • అభివృద్ధి చేయకపోగా, చేస్తున్నవారిని  చూసి టీడీపీ నేతలు ఈర్ష పడుతున్నారు
 • టీడీపీ నేతలు మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి
 • ప్రజా ఆశీర్వాద యాత్ర తొమ్మిది రోజుల పాటు 158 కిలోమీటర్లు పాటు జరిగింది
 • 28 గ్రామాల మీదగా ఈ యాత్ర సాగినప్పుడు ప్రజల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది
 • వైఎస్సార్‌సీపీ పార్టీకి సంబంధం లేని అంశాల్లో బురద చల్లాలని టీడీపీ నేతలు చూస్తున్నారు
 • టీడీపీ పార్టీలో జరుగుతున్న సంఘటనలకు మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు
 • అభివృద్ధి సంక్షేమంపై బహిరంగ చర్చకు మేం సిద్ధం
 • ప్రజా ఆశీర్వాద యాత్రకు వస్తున్న ఆదరణ చూసి టీడీసీ నేతలు ఓర్చుకో లేక పోతున్నారు
 • దెందులూరు నియోజవర్గంలో టీడీపీ భూస్థాపితం అవ్వటం ఖాయం
 • టిడిపి హయాంలో  కంటే  ఇప్పుడు కొల్లేరు అభివృద్ధి చెందింది..

11.42 AM, ఆదివారం, Dec 24, 2023
ఆంధ్రప్రదేశ్‌లో రసవత్తర రాజకీయం

 • ఎన్నికల్లో సింగిల్‌గా వస్తోన్న YSRCP
 • పొత్తుల కోసం TDP, జనసేన ఆరాటం
 • తెలుగుదేశం, జనసేనల మధ్య చిచ్చు రేపిన లోకేష్‌ వ్యాఖ్యలు
 • సీఎం సీటింగ్‌ షేర్‌ లేదు, అవకాశం వస్తే బాబే సీఎం అంటోన్న లోకేష్‌
 • కాపుల్లో సెగ రేపిన లోకేష్‌ వ్యాఖ్యలు
 • ఇంకెన్నాళ్లు జెండా పట్టుకుని సలాం కొట్టాలంటూ ఆగ్రహం

10.25 AM, ఆదివారం, Dec 24, 2023
బ్రో’...ఇదేం పద్ధతి.. వాపోతున్న జనసేన కార్యకర్తలు

 • సీఎం పదవిపై రకరకాలుగా మాట్లాడుతూ గందరగోళానికే పవన్‌కళ్యాణ్‌ మొగ్గు
 • కానీ.. గెలిస్తే చంద్రబాబే సీఎం అని... పవన్‌ కూడా అంగీకరించారని చెప్పిన లోకేశ్‌
 • ఇందులో సందేహాలకు తావు లేదని, 150 సీట్లకు అభ్యర్థులూ రెడీ అని చెప్పిన చినబాబు
 • ఈ విషయంపై ప్రశ్నలకు తప్పించుకునే రీతిలో నాదెండ్ల సమాధానాలు
 • మూడో సారి కూడా మోసమేనా.. అంటూ మండి పడుతున్న జనసేన నేతలు
 • పవన్‌! సీఎం పదవిపై ఆశలు వదిలేశావా?.. అంటూ హరిరామజోగయ్య లేఖ  
 • జనసైనికుల కలలు ఏమవ్వాలంటూ నిలదీత
   

9.37 AM, ఆదివారం, Dec 24, 2023
‘దొంగ’ నాటకం!

 • ‘ఫ్యాన్‌’ క్లీన్‌ స్వీప్‌ చేసిన 4 ఉమ్మడి జిల్లాలపై టీడీపీ గురి
 • లక్షలాది ఓట్లు తొలగించాలంటూ బోగస్‌ ఫారం 7 దరఖాస్తులు
 • గంపగుత్తగా దాఖలు చేసిన టీడీపీ ఎన్నికల సెల్‌ కోఆర్డినేటర్‌ కోనేరు సురేష్‌
 • వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల ఓట్ల తొలగింపు లక్ష్యంగా పావులు
 • కర్నూలు, వైఎస్సార్, నెల్లూరు, విజయనగరం జిల్లాలు టార్గెట్‌
 • 80–90 శాతం దరఖాస్తులు బోగస్‌వేనంటూ ఈసీకి కలెక్టర్ల నివేదిక
 • ఎన్నికల యంత్రాంగం అప్రమత్తతతో ప్రజాస్వామ్యానికి ఊపిరి

8.54 AM, ఆదివారం, Dec 24, 2023
ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకొని చంద్రబాబు అరాచకం: బహుజన పరిరక్షణ సమితి 

 • 14 ఏళ్లు చంద్రబాబుకు అధికారమిస్తే పేదలను నిరుపేదలుగా మార్చారు
 • కొంతమంది వ్యక్తులు, పెట్టుబడిదారులకు ఊడిగం చేసి రాష్ట్రాన్ని నిలువునా దోచుకున్నాడు
 • చేసిన మోసాలు కప్పిపుచ్చుకునేందుకు ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకున్నాడు
 • రాష్ట్రంలో బాబు సొంత డబ్బా కొట్టుకోవడం దుర్మార్గం
 • కులవాదమే అజెండాగా రాష్ట్రంలో రాజకీయాలు చేసిన బాబును చూసి ఈసడించుకున్న ప్రజలు
 • గత ఎన్నికల్లో విసిరి పారేసినా తిరిగి అధికారం కోసం అందరి కాళ్లు పట్టుకుంటున్నాడు
 • ప్యాకేజీ పార్టీలను వెంటబెట్టుకొని తప్పుడు మార్గంలో గెలిచేందుకు యత్నిస్తున్నాడు

7.37 AM, ఆదివారం, Dec 24, 2023
సీఎం జగన్‌ వెంటే నడుస్తా.. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు

 • తాను వేరే పార్టీలో చేరు­తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు
 • అవి కేవలం కల్పి­తాలే
 • తనపై వస్తున్న అసత్య కథనా­లను తీవ్రంగా ఖండించిన దొరబాబు
 • తాను ఏ పార్టీ నేతలతోనూ మాట్లాడలేదు.. ఏ పార్టీ నేతలు తనను కలవలేదు
 • రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం జగన్‌తోనే ఉంటా
 • ఆయన అడుగుజాడల్లోనే నడుస్తా
 • మరోసారి తమ పార్టీ గెలుపు కోసం సీఎం జగన్‌ కచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు
 • ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటా.. మరో ఆలోచన లేదు  

7.20 AM, ఆదివారం, Dec 24, 2023
సమగ్ర ప్రణాళికతో ఎన్నికలు

 • ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రస్ఫుటించేలా అప్రమత్తత, నిష్పాక్షికతతో ఎన్నికలు జరగాలి 
 • ఒక్క తప్పూ లేకుండా ఓటర్ల జాబితా సిద్ధం చేయండి 
 • పోలింగ్‌ శాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక స్వీప్‌ కార్యక్రమాలు 
 • సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి 
 • కలెక్టర్లు, ఎస్పీలకు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టీకరణ 
 • 2024 సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై ముగిసిన సమీక్ష 

7.09 AM, ఆదివారం, Dec 24, 2023
టీడీపీలో వణుకు 

 • ఓటమి తప్పదని ఖరాకండీగా తేల్చేసిన సర్వేలు
 • ప్రశాంత్‌ కిశోర్‌ కోసం చంద్రబాబు ప్రయత్నం
 • విజయవాడకు తీసుకొచ్చిన లోకేష్‌
 • ఇప్పటికే వ్యూహకారుడిగా ఉన్న రాబిన్‌ శర్మ టీం మనస్తాపం
 • టీడీపీలో ఆసక్తికర పరిణామాలు
 • వ్యూహకర్తలపై పూర్తిగా ఆధారపడని సీఎం జగన్‌
 • తనకంటూ సొంత బలాన్ని ఏర్పాటుచేసుకున్న జగన్‌
 • వాలంటీర్లు, గృహసారథులు, కేడర్‌ రూపేణా సుశిక్షతులైన సైన్యం
   

7.05 AM, ఆదివారం, Dec 24, 2023
టీడీపీ అక్రమాలపై చర్యలు తీసుకోండి

 • ఓటర్ల జాబితాలో భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడుతోంది
 • మైపార్టీ డ్యాష్‌ బోర్డు.కామ్‌ ద్వారా ఓటర్ల వ్యక్తిగత వివరాలు సేకరిస్తోంది
 • తెలంగాణలో ఓట్లున్నవారిని రాష్ట్రంలో ఓటర్లుగా చేరుస్తోంది
 • ఇందుకోసం టీడీపీ ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తోంది
 • మేనిఫెస్టో పేరుతో టీడీపీ నేతలు ఇంటింటికీ ప్రమాణపత్రాలు ఇస్తున్నారు
 • తప్పుడు ఫిర్యాదులు చేస్తున్న కోనేరు సురేశ్‌పై చర్యలు తీసుకోండి
 • కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు మాజీ మంత్రి పేర్ని నాని వినతి

6.56 AM, ఆదివారం, Dec 24, 2023
పీకే, చంద్రబాబు సమావేశంపై పేర్ని నాని సెటైర్లు

 • చంద్రబాబుకి సిగ్గు శరం లేదు.. ప్రశాంత్ కిషోర్ గురించి ఏం మాట్లాడారో మర్చిపోయారా?
 • బీహార్ వాడికి ఇక్కడేం పని అన్నది మర్చిపోయారా..
 • మేము ఛీ కొడితే బయటకి పోయిన వాడిని బ్రతిమలాడి తెచ్చుకున్నారు.. 
 • పవన్‌పై నమ్మకం లేదు, పార్టీ కార్యకర్తలపై నమ్మకం లేదు..
 • రాబిన్ శర్మ, ప్రశాంత్ కిషోర్, సునీల్ కొనుగోలు ఇలా ఎవరిని తెచ్చుకున్నా అవ్వదు..
 • జనం గుండెల్లో జగన్ ఉన్నారు..జనం గుండెల్లో ఉన్నంత వరకు ఎవరూ వచ్చినా ఏమీ చెయ్యలేరు..
 • ప్రశాంత్ కిషోర్ మా దగ్గర జితానికే పని చేశాడు. ఇప్పుడు అదే చేస్తాడు

Advertisement
 
Advertisement