
AP Elections Political Latest Updates Telugu
8.43 pm, జనవరి 3, 2024
తిరువూరు ఘటనపై చిన్ని స్పందన
- తిరువూరు టీడీపీ ఆఫీస్‌లో కేశినేని నాని వర్గంతో కేశినేని చిన్ని వర్గం ఫైట్
- చిన్నిని అడ్డుకున్న నాని వర్గం
- తిరువూరులో తీవ్ర ఉద్రిక్తత
- బలవంతంగా లోపలికి వెళ్లే యత్నం చేసిన కేశినేని చిన్ని
- ఇరు వర్గాల ఘర్షణలో స్థానిక ఎస్సై తలకు గాయం
- ఘటనపై స్పందించిన కేశినేని చిన్ని
- తిరువూరు ప్రజలకు క్షమాపణలు చెప్పిన చిన్ని
- మళ్లీ ఇలాంటివి జరగవని హామీ
- తిరువూరు గొడవను పార్టీ అధిష్టానం చూసుకుంటుందన్న కేశినేని చిన్ని
8.22 pm, జనవరి 3, 2024
తిరువూరు టీడీపీ ఆఫీస్‌లో రచ్చ రచ్చ
- టీడీపీ సమన్వయ భేటీ వేదికగా.. కేశినేని బ్రదర్స్ వర్గీయుల మధ్య డిష్యూం.. డిష్యూం..
- కేశినేని చిన్ని ఫ్లెక్సీ చించేసిన కేశినేని నాని వర్గీయులు
- అందులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫొటో కూడా
- ఆగ్రహంతో సమావేశం నుంచి వెళ్లిపోయిన జనసైనికులు
- తిరువూరులో టీడీపీ ఎంపీ కేశినేని నానికి ఘోర అవమానం
- నాని బయటికి వెళ్లగానే పార్టీ కార్యాలయాన్ని పసుపు నీళ్లతో సంప్రోక్షణ చేసిన చిన్ని వర్గం
- తిరువూరు ఘటన పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన కేశినేని నాని
- పార్టీ నేతల తీరు...అధిష్టానం తీరు పై అసహనం వ్యక్తం చేసిన నాని
- తిరువూరు టీడీపీ ఇంఛార్జి పూజకు పనికిరాని పువ్వు : కేశినేని నాని
- తిరువూరు నియోజకవర్గానికి శావల దేవదత్ ఇంఛార్జిగా పనికిరాడు : కేశినేని నాని
- గతంలోనే చంద్రబాబుకు ఈ విషయాన్ని చెప్పా : కేశినేని నాని
- కేశినేని చిన్నికి పార్టీకి ఏం సంబంధం : కేశినేని నాని
- అతనేమైనా పార్టీలో ఎంపీనా ... ఎమ్మెల్యేనా : కేశినేని నాని
- తిరువూరు ఇంఛార్జి పార్టీలో క్యాడర్ మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారు : కేశినేని నాని
- అందుకే మా క్యాడర్ నుంచి రియాక్షన్ వచ్చింది : కేశినేని నాని
- కొంతమంది వ్యక్తులు తమకు బాధ్యతలు అప్పగించారని అబద్ధపు ప్రచారం చేసుకుంటున్నారు : కేశినేని నాని
- నేను రెండు సార్లు ఎంపీగా గెలిచా : కేశినేని నాని
- పార్టీ బాగుండాలి...చంద్రబాబు బాగుండాలని ఓపికపడుతున్నా : కేశినేని నాని
- గతంలోనూ నేను చాలా అవమానపడ్డా : కేశినేని నాని
- విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రెస్ మీట్ ఒక వ్యక్తి నన్ను చెప్పుతీసుకుని కొడతా అన్నాడు : కేశినేని నాని
- క్యారెక్టర్ లెస్ ఫెలో అన్న ఆ మాటల పై పార్టీ నుంచి కనీసం ఎవరూ స్పందించలేదు : కేశినేని నాని
- నన్ను అవమానించినా పార్టీ కోసం భరించా : కేశినేని నాని
- పొలిట్ బ్యూరోలో ఉన్న ఓ వ్యక్తి నన్ను గొట్టంగాడని అన్నా భరించాను : కేశినేని నాని
- నేను ఏరోజూ పార్టీలో వర్గాలను ప్రోత్సహించలేదు : కేశినేని నాని
- ఏడాదిన్నర నుంచి పార్టీలో కుంపటి నడుస్తోంది...ఎక్కడో చోట పుల్ స్టాప్ పెట్టాలి : కేశినేని నాని
- ఇలాంటి సంఘర్షణలు జరుగుతాయనే నేను కార్యకమాలకు దూరంగా ఉంటున్నా : కేశినేని నాని
- రతన్ టాటా స్థాయి వ్యక్తి నేను...బెజవాడ పేరు చెడగొట్టకూడదనే ఓపిక పట్టా : కేశినేని నాని
- రాబోయే పరిణామాలు దేవుడు ..ప్రజలే చూసుకుంటారు : కేశినేని నాని
6.22 pm, జనవరి 3, 2024
రేపు ముఖ్యమైన కార్యక్రమాలు ఏంటంటే.?
- రేపు పాణ్యం నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర
- రేపు హైదరాబాద్‌కు రానున్న సీఎం వైఎస్ జగన్, ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న కెసిఆర్‌కు పరామర్శ
- అనకాపల్లిలో టిడ్కో ఇళ్ల పంపిణీ, హాజరు కానున్న వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు ఆదిమూలపు సురేష్, గుడివాడ అమర్‌నాథ్
- విజయవాడలో సీఎం జగన్‌కు మద్దతుగా బీసీల సదస్సు, హాజరుకానున్న ఆర్ కృష్ణయ్య
- కాకినాడలో మూడు రోజుల నుంచి పవన్ కల్యాణ్ మంత్రాంగం, పార్టీ రాజకీయ కార్యకలాపాలపై ఎడతెగని కసరత్తు
6.03 pm, జనవరి 3, 2024
CID విచారణకు హాజరయిన కొలికపూడి
- సీఐడీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన కొలికపూడి
- ఇవ్వాళ విచారణకు హాజరయ్యా
- సీఐడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పా
- ఆర్జీవీ సినిమాలపై నాకు అభ్యంతరాలున్నాయి
- ఆ ఆవేదన వల్లే రాంగోపాల్ వర్మ గురించి అలా మాట్లాడా
- ఈ వివాదం తర్వాత రామ్ గోపాల్ వర్మకు ఫోన్ కాల్ చేశా
- నా ఫోన్ కాల్ ను రామ్ గోపాల్ వర్మ లిఫ్ట్ చేయలేదు
5.30 pm, జనవరి 3, 2024
అంటే.. నా పోరాటం ఎందుకంటే..? : చంద్రబాబు
- మంగళగిరిలో మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు
- మా హయాంలో వంద సంక్షేమ పథకాలున్నాయి
- ఇప్పుడు అన్ని పథకాలు లేవు
- సీఎం పదవీ కోసం నేను పోరాడట్లేదు
- నా పోరాటం తెలుగుదేశం, జనసేన పార్టీలు అధికారంలోకి రావడానికి కాదు
- ఐదు కోట్ల మంది ప్రజల కోసమే పోరాడుతున్నా
- ఎల్లుండి నుంచి "రా కదలిరా" పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నా : చంద్రబాబు
- ఎమ్మెల్యేలను అధికార పక్షం బదిలీ చేస్తోంది
5.10 pm, జనవరి 3, 2024
నాని వర్సెస్ చిన్ని
- తిరువూరులో అన్నదమ్ముల వర్గీయుల బాహాబాహీ
- టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో భగ్గుమన్న వివాదం
- ఈ నెల 7వ తేదీన చంద్రబాబు సభ
- ఏర్పాట్లను వేర్వేరుగా పర్యవేక్షిస్తున్న కేశినేని నాని-చిన్ని
- స్థానిక నేతలతో వేర్వేరుగా భేటీలు
- ఒకే సమయానికి వెళ్లినా.. వేర్వేరు సమయాల్లో ఏర్పాట్ల పర్యవేక్షణ
- చిన్నిని లోపలికి రానివ్వని నాని వర్గం
- చిన్ని ఫ్లెక్సీలను చింపేసిన నాని వర్గం
- తిరువూరు ఇన్‌ఛార్జి దత్తుపై నాని వర్గీయుల దాడి
4.21 pm, జనవరి 3, 2024
ఏపీలో తొలి దశలోనే ఎన్నికలు!
- ఈ నెల 7వ తేదీన తమిళనాడుకు కేంద్ర ఎన్నికల సంఘం
- తమిళనాడు లోక్‌సభ స్థానాలతో పాటు ఏపీ ఎన్నికలు కూడా తొలి దశలోనే పూర్తి చేసే యోచనలో ఈసీ
- 2019 ఎన్నికల సమయంలోనూ తొలి దశలోనే పూర్తి
- ఇప్పుడు అదే తరహాలో పూర్తి చేయాలని ఈసీ ప్లాన్
- ఏపీ అసెంబ్లీకి 175 స్థానాలు.. 25 లోక్‌సభ స్థానాలు
- మరో రెండు, మూడు సార్లు రాష్ట్రంలో పర్యటించనున్న ఈసీ బృందం
- ఆ తర్వాతే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం
3.31 pm, జనవరి 3, 2024
టీడీపీతో పొత్తు.. ఇక బీజేపీ హైకమాండ్ చేతుల్లోనే!
- విజయవాడలో ఏపీ బీజేపీ పదాధికారుల సమావేశం
- మొత్తం 11 అంశాలతో ఏపీ బీజేపీ రాజకీయ తీర్మానం
- జనసేనను రాజకీయ మిత్రపక్షంగా పేర్కొంటూ తీర్మానం
- టీడీపీతో పొత్తు అంశాన్ని ప్రస్తావించని ఏపీ బీజేపీ
- పొత్తు నిర్ణయాన్ని హైకమాండ్‌కే వదిలేయాలని ఏపీ బీజేపీ నిర్ణయం
3.27 pm, జనవరి 3, 2024
ఆ ప్రచారం ఖండించిన పార్థసారథి
- పార్టీ మారుతున్నానంటూ వస్తున్న ప్రచారం అవాస్తవం
- నేను పార్టీ మారడం లేదు
- వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి స్పష్టీకరణ
3.05 pm, జనవరి 3, 2024
అన్నమయ్యలో.. 'సామాజిక' జైత్రయాత్రకు ఘన స్వాగతం
- అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అధ్వర్యంలో ప్రారంభమైన సామాజిక సాధికారత బస్సు యాత్ర
- భారీగా తరలివచ్చిన ప్రజలు.. జనసంద్రంగా మారిన రైల్వేకోడూరు
- అడుగడుగున గజమాలలతొ ఘన స్వాగతం పలుకుతున్న జనాలు
- హాజరైన ఎంపీ నందిగాం సురేష్, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, రమేష్ యాదవ్, జడ్పీ ఛైర్మన్ అమరనాధరెడ్డి, ఎస్టీ కార్పొరేషన్ ఛైర్మన్ కుంభా రవి, ఎలక్ర్టానిక్ మీడియా సలహదారు, సినీ నటుడు అలీ
2.27 pm, జనవరి 3, 2024
అందుకే బాబు వెన్నులో వణుకుపుడుతోంది
- మా పార్టీ అభ్యర్థులను చూస్తే రామోజీ, రాధాకృష్ణలకు భయం పుడుతుంది
- అందుకే ఇష్టానుసారం వార్తలు అచ్చేస్తున్నారు
- ఓసీ నియోజకవర్గాలలో కూడా జగన్ ఇతరులకు అవకాశాలు కల్పిస్తున్నారు
- అది చూసి భయంతో వణికిపోతున్నారు
- చంద్రబాబు, ఆయన పార్టీ ఇక కనుమరుగు అవుతుందనే భయం పుట్టింది
- టీడీపీకి బీటీమ్ పురంధేశ్వరి పార్టీ
- చంద్రబాబు కోసం తెగ తాపత్రయం పడుతోంది
- ఆమె ఇంట్లో ఒక్కొకరు ఒక్కొక పార్టీలో ఉన్నారు
- దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా పురంధేశ్వరి మా పార్టీ గురించి మాట్లాడుతున్నారు
- కాంగ్రెస్, తెలుగుదేశంతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ మా గురించి మాట్లాడతారా?
- మా వలన లబ్ది కలిగితేనే ఓట్లేయమని జగన్ అంటున్నారు
- మీరేమో పొత్తులు, ఎత్తులు అంటూ తిరుగుతున్నారు
- పురంధేశ్వరి కుమారుడు టీడీపీ నుంచి పోటీ చేసే ప్రయత్నంలో ఉన్నారు
- మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకు ఎస్సీలు ఎప్పడైనా గుర్తొచ్చారా?
- ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా? అని హేళన చేసిన చంద్రబాబుకు మళ్ళీ తగిన గుణపాఠం చెప్తాం
- చంద్రబాబు ఓ పొలిటికల్ బ్రోకర్
- ఎంపీ సీట్లు అమ్ముకుని ఎస్సీలతో కన్నీళ్లు పెట్టించారు
- తన హయాంలో ఏ వర్గం బాగు పడిందో చంద్రబాబు చెప్పాలి
- రాద్దాంతం తప్ప సిద్దాంతం లేని వ్యక్తి చంద్రబాబు
- మా పార్టీలో ఎస్సీలను మార్చితే ఇంకో ఎస్సీకే అవకాశం వస్తుంది
- అందరికీ అవకాశం కల్పించాలన్నదే జగన్ లక్ష్యం
- అందరం కలిసి జగన్ ని గెలిపిస్తాం
- ఎంఎస్ బాబు మా ఎమ్మెల్యే, ఆయన మా వాడు
- మా సీఎం జగన్ అందరివాడు, అందరికీ న్యాయం చేస్తారు
- ఇప్పుడు టికెట్ రాకపోయినా సరైన రీతిలో జగన్ న్యాయం చేస్తారు.
- పేదలను చంద్రబాబు ఏనాడైనా పట్టించుకున్నాడా?
- బీసీలు జడ్జీలుగా పనికి రాడని లేఖలు రాసింది చంద్రబాబు కాదా?
- అంబేద్కర్ కోరుకున్న పాలన ఏపీలో నడుస్తోంది
- సీఎం జగన్ పాలనలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు న్యాయం జరుగుతోంది
- తాడేపల్లిలో మీడియాతో ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున వ్యాఖ్యలు
2.10 pm, జనవరి 3, 2024
ఆనంకు ప్రజలే బుద్ధి చెప్తారు
- వెంకటగిరిలో ఆనం రామనారాయణరెడ్డి చీకటి రాజకీయాలు
- 2019లో ప్రజలు నమ్మి ఓట్లు వేస్తే వెంకటగిరిని నాశనం చేశాడు
- ఆనం ప్రస్తుతం సైకిల్ పార్టీనా లేక గ్లాస్ పార్టీనా?
- 2024 ఎన్నికల్లో ఆనంకు టికెట్ ఎక్కడ అనేది ప్రశ్నార్థకమే!
- ఆనం ఎక్కడ పోటీ చేసినా ప్రజలే బుద్ది చెబుతారు.
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిపై వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ నేదురుమల్లి రామ్‌కుమార్ హాట్ కామెంట్స్!
2.00 pm, జనవరి 3, 2024
చెప్పాం.. చేస్తున్నాం.. చూపిస్తున్నాం : సీఎం జగన్
- కాకినాడ : పెన్షన్ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
- గతంలో ఎన్నికలకు 6 నెలల ముందు వరకు 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చారు : సీఎం జగన్
- ఎన్నికలకు చంద్రబాబు పాలనలో రెండు నెలల ముందు వరకు కేవలం రూ.వెయ్యి పెన్షన్ ఇచ్చారు
- ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పెంచుకుంటూ రూ.3 వేలు అందిస్తున్నాం
- బాబు నెలకు రూ.400 కోట్లు ఇచ్చారు....ఇప్పుడు నెలకు రూ.2 వేల కోట్లు ఇస్తున్నాం
- పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ అందిస్తున్నాం
- చంద్రబాబు హయాంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్న ఆలోచన కూడా చేయలేదు
- ఈ రోజు YSRCP ప్రభుత్వంలో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం
- ఇప్పటికే 22 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది
2014-19 దొంగల పాలన.. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు : సీఎం జగన్
- చంద్రబాబు, పవన్ కలిసి 2014లో ఎన్నో హామీలు ఇచ్చారు
- పేదవారికి 3 సెంట్ల భూమి ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క సెంటు కూడా ఇవ్వలేదు
- ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు కనీసం లేఖ కూడా రాయలేదు
- అవినీతికి పాల్పడిన చంద్రబాబును జైలుకెళ్లి దత్తపుత్రుడు పరామర్శించారు
- చంద్రబాబు అవినీతి పై దత్తపుత్రుడు ఎందుకు మాట్లాడరు?
- చంద్రబాబు అవినీతిలో పవన్ కూడా పార్ట్‌నరే
- చంద్రబాబు అవినీతి పై పచ్చమీడియా ఏమీ రాయవు, చూపించవు
ఆ పాలనకు, ఇప్పటి పాలనకు తేడా ఏంటంటే.? : సీఎం జగన్
- చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రైతుభరోసా స్కీమ్ లేదు
- 53 లక్షల 52 వేల మంది రైతులకు రైతు భరోసా అందిస్తున్నాం
- రైతన్నలకు ప్రతి ఏటా 13,500 అందిస్తున్నాం
- రైతు భరోసా కింద ఐదేళ్లలో 33,300 కోట్లు జమ చేశాం
- వైఎస్ఆర్ ఆసరా ద్వారా రూ.19,179 కోట్లు అక్కచెల్లెమ్మలకు అందించాం
- 78,94,000 వేల మంది అక్క చెల్లెమ్మలకు ఆసరా అందిస్తున్నాం
- ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకు ప్రతి గ్రామంలో మార్పు తెచ్చాం
- ప్రతి గ్రామంలో సచివాలయం తెచ్చాం
- ప్రతి గ్రామంలోనూ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం
- ఆర్బీకే, విలేజ్ క్లినిక్, జగనన్న ఆరోగ్య సురక్ష తీసుకొచ్చాం
- నాడు-నేడుతో పాఠశాలలను ఆధునీకరించాం
- పేదలకు అండగా ఉండేందుకు అక్కచెల్లెమ్మల ఖాతాలకు నేరుగా రూ.2.46 లక్షల కోట్లు జమ చేశాం
- 45 నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉన్న అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటూ నాలుగేళ్లలో రూ.14,129 కోట్లు పంపించడం జరిగింది
- వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా రూ.2,028 కోట్లు అందించాం
ఎందుకు బాబువైపు చూడొద్దంటే.? : సీఎం జగన్
- చంద్రబాబు హయాంలో దోచుకోవడం, పంచుకోవడమే జరిగింది
- చంద్రబాబు హయాంలో అమ్మ ఒడి అనే పథకమే లేదు
- అమ్మ ఒడి పథకం ద్వారా రూ.26 వేల కోట్లు అందించాం
- చంద్రబాబు పాలనలో వైఎస్ఆర్ చేయూత పథకమే లేదు
చంద్రబాబు విష రాజకీయం చేస్తారు.. నమ్మొద్దు : సీఎం జగన్
- రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు
- రాబోయే రోజుల్లో కుట్రలకు తెరతీస్తారు
- కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారు
- మీ బిడ్డకు వాళ్ల మాదిరి అబద్ధాలు చెప్పడం, రాజకీయాలు చేయడం తెలియదు
- మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడు, ఇక్కడ ప్రజలనే
- ఎన్నికల వేళ కిలో బంగారం, బెంజ్ కారు ఇస్తామనే నేతలు వస్తారు
- మీరందరూ అప్రమత్తంగా ఉండాలి : సీఎం వైఎస్ జగన్
1.52 pm, జనవరి 3, 2024
భువనేశ్వరీకి నిజం గుర్తుకొచ్చింది..! : YSRCP
- పర్యటిస్తానని చెప్పి ఎగ్గొటానన్న నిజం భువనేవ్వరీకి గుర్తొచ్చింది
- ఎన్నికల వేళ ప్రజలు నిలదీస్తారని ఇప్పుడు అర్జంటుగా బయల్దేరారు
- ఉత్తరాంధ్రలో హడావిడిగా మూడు రోజుల పర్యటనను భువనేశ్వరీ పెట్టుకున్నారు
- మరీ ఇన్నాళ్లు ఎందుకు సాగదీశారో.. ఆ నిజం ఇప్పుడు చెబుతారా?
(ఫైల్ ఫోటో)
1.49 pm, జనవరి 3, 2024
కేంద్రం ఏం చేసిందో చెబుతాం : బీజేపీ
- బిజెపి రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్ చార్జి ల సమావేశం
- జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి,
- సోమువీర్రాజు, సత్యకుమార్, పివిఎన్ మాధవ్, విష్ణుకుమార్ రాజు తదితరులు
- రాబోయే ఎన్నికలకు ఈ సమావేశం చివరిది : పురందేశ్వరీ
- ఎన్నికల కు సమాయత్తం అయ్యేలా ఇవాళ, రేపు సమావేశాలు ఉంటాయి
- ఏపీకి చేసిన మేలు ప్రజలకు వివరించే బాధ్యత పదాధికారులదే
- వికసిత్ భారత్ ద్వారా కేంద్ర పధకాలను వివరిస్తున్నాం
1.45 pm, జనవరి 3, 2024
ఇది జగనన్న పాలన, ఇది సామాన్యుడి ప్రభుత్వం
- చిత్తూరు జిల్లా : నగరి క్లాక్ టవర్ వద్ద వైఎస్సార్ పెన్షన్ కానుక వారోత్సవాలలో పాల్గొన్న మంత్రి ఆర్.కే.రోజా
- చంద్రబాబు పాలనలో కొత్త పెన్షన్ అనేది కలే, జగనన్న పాలనలో అర్హుడైతే చాలు పెన్షన్ అందిస్తున్నారు
- మబ్బు అడ్డు వచ్చి సూర్యుడైన ఆలస్యంగా రావొచ్చునేమో కానీ, జగన్ అన్న అందించే పెన్షన్ ఆలస్యం లేదు
- దేశం లో మూడు వేల పెన్షన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
- గత టిడిపి పాలనలో మీకు నామాలు పెట్టీ, స్కాంలు చేసి జైలుకి వెళ్ళాడు చంద్రబాబు
- దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా అప్పు చేయాల్సిందే
- చంద్రబాబు పాలనలో అప్పులకు లెక్క లేదు పక్కా లేదు
- సీఎం జగన్ అన్న అందించిన సంక్షేమ పథకానికి, ప్రతి రూపాయికి లెక్క ఉంది, మీ గ్రామ సచివాలయం వద్ద లిస్ట్ ప్రదర్శిస్తున్నారు
- కుప్పం నియోజకవర్గం లో కూరగాయలు అమెరికా పంపించడానికి ఎయిర్ పోర్ట్ కట్టిస్తామని కబుర్లు చెప్తున్నాడు చంద్రబాబు
- జగనన్న వచ్చాక కుప్పం రెవెన్యూ డివిజన్ చేశారు, కుప్పం మున్సిపాలిటీ చేశారు
- ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు కుప్పం ప్రజలకు కల్లబొల్లి కబుర్లు చెప్తున్నారు
1.45 pm, జనవరి 3, 2024
రాజధాని కేసు సుప్రీంకోర్టులో ఏప్రిల్‌కు వాయిదా
- ఢిల్లీ: సుప్రీంకోర్టులో ఏపీ రాజధాని కేసు విచారణ
- విచారణ ఏప్రిల్ కు వాయిదా వేసిన సుప్రీం
- ఈ లోగా అన్ని పక్షాలు తమ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం
- ఆదేశాలు ఇచ్చిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్త ధర్మాసనం
- రాజధాని కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
1.25 pm, జనవరి 3, 2024
మాట తప్పలేదు, మడమ తిప్పలేదు.. ఇప్పుడు పెన్షన్ రూ.3000
- కాకినాడ : వైఎస్సార్ పెన్షన్ కానుక సభలో ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే
- మాట మీద నిలబడే నాయకుడి కింద పనిచేయడం మా అదృష్టం
- రాజకీయ నాయకుడంటే ఇలా ఉండాలని నిరూపించిన నాయకుడు మన జగనన్న
- 2019లో కాకినాడ పట్టణంలో ఇచ్చిన పెన్షన్‌లు 14,700,
- ఇప్పుడు జగనన్న మంచితనంతో ఈ రోజు సుమారు 29,100 మందికి పెన్షన్‌లు ఇస్తున్నారు
- గతంలో పెన్షన్ కావాలంటే ఎవరైనా చనిపోతే అధికారుల చుట్టూ తిరిగి లంచాలు ఇవ్వాలి, కానీ ఇప్పుడు అర్హులైతే చాలు పెన్షన్ ఇస్తున్నారు
- మాట ఇచ్చిన ప్రకారం రూ. 3,000 ఇస్తున్నారు
- కాకినాడలో 94 వేల కుటుంబాలు ఉంటే 84 వేల కుటుంబాలు నవరత్నాల పథకాల ద్వారా లబ్ధిపొందారు
- చంద్రబాబు, పవన్‌బాబు, లోకేష్‌బాబు ఎంతమంది బాబులు వచ్చినా నమ్మం, ప్రలోభాలకు గురి అవ్వమని చెప్పండి
వరలక్ష్మి, లబ్ధిదారు, కాకినాడ
- నాకు గత ప్రభుత్వంలో ఎవరూ పెన్షన్ ఇవ్వలేదు,
- ఏ అధికారి ఇవ్వలేదు బాబు, కానీ జగన్ బాబు మీరు వచ్చిన రెండో నెలలోనే పెన్షన్ తీసుకున్నాను,
- నాకు 2,250 నుంచి ఇప్పుడు 3,000 తీసుకుంటున్నాను,
- నా పెద్ద కొడుకు నా జగన్ బాబు ఒకటో తారీఖు తెల్లారేసరికి వలంటీర్ వచ్చి పెన్షన్ ఇస్తున్నాడు,
- గతంలో పెన్షన్‌లు ఎప్పుడిస్తారో తెలిసేది కాదు,
- ముసలి, ముతక వీటి కోసం తిరిగేవారు,
- మీరు పాదయాత్రలో మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు,
- నా పిల్లలకు కూడా అన్నీ అందుతున్నాయి,
- జగన్ బాబు నాకు ఇంటి స్ధలం ఇచ్చారు,
- నేను ఇల్లు కట్టుకుంటున్నా, ఇప్పుడు నాకు సొంత ఇల్లు ఉంది,
- నాకే భయం లేదు, కరోనా వచ్చినా అన్నీ ఇచ్చి ఆదుకున్నారు,
- ఆరోగ్యశ్రీ లో పాతిక లక్షల వైద్యం చేస్తున్నారు,
- ఇంకేం కావాలి మాకు, మీరు మాట తప్పను మడమ తిప్పను అన్నారు, అలాగే చేస్తున్నారు,
- మీరు మా పెద్ద కొడుకులా మాకు రూ. 3 వేలు ఇస్తున్నారు,
- నాలాంటి అనేకమంది ముసలివాళ్ళని ఆదుకుంటున్నారు,
క్రిష్ణవేణి, లబ్ధిదారు, కాకినాడ
- నాకు ఇద్దరు పిల్లలు, మా ఆయన కరోనా సెకండ్ వేవ్‌లో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు,
- ఆ తర్వాత నాకు వితంతు ఫించన్ వచ్చింది, నేను ఎలా బతకాలి అనుకునే సమయంలో నన్ను ఆదుకుంది,
- కరోనా సమయంలో మరణించిన వారికి ఇచ్చే రూ. 50 వేలు కూడా అందాయి,
- ఆ డబ్బుతో చిన్న షాప్ పెట్టుకుని జీవిస్తున్నాను, నేను వివిధ పథకాల ద్వారా లబ్ధిపొందాను,
- సుమారు రూ. 1.70 లక్షలు నేను లబ్ధిపొందాను, మా అత్తగారు కూడా ఫించన్ తీసుకుంటున్నారు,
- మీ నవరత్నాల పథకాలు మా జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి,
12.55 pm, జనవరి 3, 2024
ఏలూరు: మహిళలకు సీఎం జగన్ పెద్దపీట: తెల్లం రాజ్యలక్ష్మి
- పోలవరం నియోజకవర్గ సమన్వయకర్తగా అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నాను
- జగనన్న వైనాట్ 175 నినాదంతో.. పోలవరాన్ని జగనన్నకు కానుకగా ఇస్తాం.
- రాష్ట్రంలో అవినీతి రహిత పాలన జరుగుతుంది.
- జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలి
12.45 pm, జనవరి 3, 2024
వైఎస్సార్ కుటుంబం అంటే ఒక బ్రాండ్: ఎమ్మెల్యే తెల్లం బాలరాజు
- మాట తప్పని, మడమ తిప్పని కుటుంబం వైఎస్సార్ కుటుంబం..
- సీఎం జగన్ నమ్మకంతో అవకాశం కల్పించారు.. ఆ నమ్మకం వమ్ముచేయకుండా పోలవరాన్ని జగనన్నకు గిఫ్టుగా ఇస్తాం
- నా చివరి ఊపిరి ఉన్నంతవరకు పోలవరం నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటాం
- మా కార్యకర్తలు, అభిమానులకు అండగా ఉంటాం
- నమ్మిన వారిని నట్టేట ముంచే వ్యక్తి చంద్రబాబు
- చంద్రబాబు నాయకత్వాన్ని ఎవరు నమ్మరు
- ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఓట్ల కోసం వాడుకున్న వ్యక్తి చంద్రబాబు
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సీఎం జగన్ పెద్దపీట వేశారు
- సామాజిక న్యాయం, సామాజిక విప్లవం సీఎం జగన్ తీసుకువచ్చారు
- చంద్రబాబు హయాంలో ఎస్టీ లకు ఒక్క మంత్రి పదవి కూడా కేటాయించలేదు
- టీడీపీ-జనసేన ఎన్ని ఎత్తులు పొత్తులతో వచ్చిన ఎగిరేది వైఎస్సార్‌సీపీ జెండానే
- టీడీపీ, జనసేన అనైతిక పొత్తులను ప్రజలు గమనిస్తున్నారు
- సీఎం జగన్ పేదలకు మంచి పథకాలు అందిస్తున్నారని చంద్రబాబు, పవన్ ఓర్వలేకపోతున్నారు.
- ప్రజల పొత్తు సీఎం జగన్‌తోనే.. టీడీపీ జనసేన పొత్తులు ఏమి పని చేయవు
- తెలుగుదేశం, జనసేన పార్టీలను ప్రజలు బంగాళాఖాతంలో కలుపుతారు
12.22 pm, జనవరి 3, 2024
లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్
- నేడు, రేపు ఏపీ బీజేపీ కీలక సమావేశాలు
- బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి నేతృత్వంలో పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశం
- సమావేెశంలో పొత్తులు, ఎన్నికల వ్యూహలపై చర్చించే అవకాశం
- పొత్తులపై నేతల నుంచి అభిప్రాయాలు స్వీకరించనున్న పార్టీ పెద్దలు
- సమావేశానికి హాజరు కానున్న జాతీయ సహ సంఘటన కార్యదర్శి శివ ప్రకాష్ జీ
- రేపు ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశం
- ఇవాళ సాయంత్రం విజయవాడకు రానున్న తరుణ్ చుగ్
- రేపు జరిగే బీజేపీ ఏపీ కోర్ కమిటీ భేటీకి హాజరు కానున్న తరుణ్ చుగ్
- ఇవాళ పదాధికారుల సమావేశం వివరాలు.. పొత్తులపై నేతల అభిప్రాయాలను తరుణ్ చుగ్‌కు వివరించనున్న ఏపీ బీజేపీ నేతలు
12.05 pm, జనవరి 3, 2024
గుంటూరు: సీఐడీ విచారణకు హాజరైన టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాసరావు
- దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ తలనరికి ఇస్తే రూ.కోటి ఇస్తానన్న కొలికపూడి
- వర్మను ఇంటికెళ్లి తగలబెడతానంటూ హెచ్చరికలు
- తనను చంపేందుకు బహిరంగంగా సుపారీ ఆఫర్ చేయడంపై వర్మ ఫిర్యాదు
- కొలికపూడి, సాంబశివరావు, బీఆర్ నాయుడుపై కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ
11.15 am, జనవరి 3, 2024
సమన్వయకర్తల నియామకంలో సామాజిక న్యాయం: ఎంపీ తలారి రంగయ్య
- సమన్వయకర్తల నియామకంలో సీఎం జగన్ సామాజిక న్యాయం పాటిస్తున్నారు
- అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం చారిత్రాత్మకం
- నన్ను కళ్యాణదుర్గం అసెంబ్లీ సమన్వయకర్తగా నియమించిన సీఎంకు కృతజ్ఞతలు
- చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సభల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు
10.54 am, జనవరి 3, 2024
ఎవరు ఏ పార్టీలో చేరినా వైఎస్సార్‌సీపీకి నష్టం లేదు: వైవీ సుబ్బారెడ్డి
- సీఎం జగన్ అందిస్తోన్న సంక్షేమ పాలన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని మరలా గెలిపిస్తుంది
- అందరికి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వలేము.. సముచిత స్ఠానం కల్పిస్తామని చెప్పాం
- వాళ్ల వ్యక్తి గత స్వార్దంతో పార్టీని వీడుతున్నారు.. నష్టం ఏమి లేదు
- ఎమ్మెల్యేల మార్పు విషయంలో సీఎం జగన్‌దే ఫైనల్ నిర్ణయం.. ఆయన ఏది ఆదేశిస్తే అదే పాటిస్తాం
- మాలో గ్రూప్‌లు అనేది అభూత కల్పన.. మేము అందరం జగనన్న సైనికులం.. జగన్ మాటే మాకు శిరోధార్యం
- ఎమ్మెల్యేల స్ఠానాల మార్పు అనేది ఎలక్షన్ వరకూ కొనసాగే ప్రక్రియ
10.35 am, జనవరి 3, 2024
నేడు సుప్రీంకోర్టులో ఏపీ రాజధాని కేసు విచారణ
- విచారణ చేయనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్త ధర్మాసనం
- రాజధాని కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
10.25 am, జనవరి 3, 2024
ఏపీ ప్రభుత్వ పిటిషన్‌లో ముఖ్యంశాలు
- రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న ఏపీ హైకోర్టు తీర్పుపై స్టే విధించాలి
- రద్దు చేసిన చట్టాలపై తీర్పు ఇవ్వడం సహేతుకం కాదు
- రాజ్యాంగం ప్రకారం మూడు వ్యవస్థలు తమ తమ అధికార పరిధుల్లో పని చేయాలి
- శాసన, పాలన వ్యవస్థ అధికారాలలోకి న్యాయవ్యవస్థ చొరబడటం రాజ్యాంగ మౌలిక వ్యవస్థకు విరుద్ధం
- తమ రాజధానిని రాష్ట్రాలే నిర్ణయించుకోవడం సమాఖ్య వ్యవస్థకు నిదర్శనం
- రాష్ట్ర ప్రభుత్వానికి తమ రాజధాని నిర్ణయించుకునే సంపూర్ణ అధికారం ఉంది
- ఒకే రాజధాని ఉండాలని ఏపీ విభజన చట్టంలో లేనప్పటికీ, చట్టానికి తప్పుడు అర్ధాలు చెప్తున్నారు
- రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ నివేదిక, జీ ఎన్ రావు కమిటీ నివేదిక, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు నివేదిక, హైపవర్డ్ కమిటీ నివేదికలను హైకోర్టు పట్టించుకోలేదు
- రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాజధానిని కేవలం అమరావతిలోని కేంద్రీకృతం చేయకుండా, వికేంద్రీకరణ చేయాలని ఈ నివేదికలు సూచించాయి
- 2014-19 మధ్య కేవలం అమరావతి ప్రాంతంలో 10 శాతం మౌలిక వసతుల పనులు మాత్రమే తాత్కాలికంగా జరిగాయి
- అమరావతిలో రాజధాని నిర్మాణానికి 1,09,000 కోట్ల రూపాయలు అవసరం
- రాజధాని వికేంద్రీకరణ ఖర్చు కేవలం 2000 కోట్ల రూపాయలతో పూర్తి
- రైతులతో జరిగిన అభివృద్ధి ఒప్పందాల్లో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదు
- వికేంద్రీకరణ వల్ల అమరావతి అభివృద్ధి జరగదని భావించడంలో ఎలాంటి సహేతుకత లేదు
- రైతుల ప్రయోజనాలన్నీ రక్షిస్తాం
- అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుంది. ఆ మేరకు అక్కడ అభివృద్ధి జరుగుతుంది
9.58 am, జనవరి 3, 2024
మళ్లీ ఎన్టీఆర్ పేరును వాడుకుంటే ఎలా ఉంటుంది? : చంద్రబాబు
- ఎన్టీఆర్ ఇచ్చిన ‘‘రా కదలి రా’’ పిలుపుతో మరోసారి ప్రచారం
- 18న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో సభ
- ‘‘రా కదలి రా’’ పేరిట తెలుగుదేశం కార్యక్రమాలు
- ఎన్నికల కోసం సోషల్ మీడియాలో తంటాలు
- తెలుగుదేశం-జనసేన ఎన్నికల గుర్తులు.. సైకిల్-గాజు గ్లాసుతో ఓ కొత్త బొమ్మ
- బీసీల ఓట్ల కోసం 4న జయహో బీసీ పేరిట రాష్ట్ర స్థాయి సదస్సు
- ఇంకా పవన్ కళ్యాణ్ తేదీలపై రాని స్పష్టత
- బాబు-పవన్ ఎప్పుడు కలిసి పాల్గొంటారన్న దానిపై తర్వాత ప్రకటనలు చేస్తామంటున్న టీడీపీ
- YSRCP నుంచి ఎవరెవరు వస్తారన్నదానిపై ఎదురుచూపులు
- కొత్త, పాత వారి సమన్వయం కోసం కమిటీ పనిచేస్తోందన్న అచ్చెన్నాయుడు
9.55 am, జనవరి 3, 2024
పేద పిల్లల తిండిపైనా విషమేనా?
- రామోజీపై మండిపడ్డ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి
- టీడీపీ హయాం కంటే 11 లక్షల మందికి అదనంగా మధ్యాహ్న భోజనం
- రుచికరమైన, పౌష్టికాహారంతో కూడిన మెనూతో జగనన్న గోరుముద్ద
- రామోజీ మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నాడు
- మీడియాను అడ్డం పెట్టుకుని పెత్తందారుడు పేద పిల్లల కడుపు కొడుతున్నారు
- దేశానికే ఆదర్శంగా నిలిచిన ‘జగనన్న గోరుముద్ద‘ పథకంపై దారుణమైన కథనాలు
దేశంలో ఎక్కడా లేనివిధంగా జగనన్న గోరుముద్ద ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నాం. పేదపిల్లలకు రోజుకో మెనూతో నాణ్యమైన ఆహారం అందిస్తున్నా.. పిల్లల విషయంలోనూ విషపు రాతలు రాయడం రామోజీకే చెల్లింది.
— YSR Congress Party (@YSRCParty) January 2, 2024
-ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి#BanYellowMediaSaveAP pic.twitter.com/XRZRZ9UeY6
9.03 am, జనవరి 3, 2024
తూర్పుగోదావరిలో తప్పుతున్న పవన్ అంచనాలు
- రేపు కాకినాడ రానున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్
- మూడు రోజులు పాటు కాకినాడలోనే ఉండనున్న పవన్
- రాజమండ్రి అమలాపురం పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ కోఆర్డినేటర్లతో విడివిడిగా సమావేశం
- కాకినాడ సిటీపై ఫోకస్ పెట్టిన పవన్.. డివిజన్ల వారీగా రివ్యూ చేయనున్న పవన్
- కాకినాడలో కొలిక్కిరాని పవన్ కళ్యాణ్ కసరత్తులు
- ఉమ్మడి గోదావరి జిల్లాల్లో అద్భుత ఫలితాలు వస్తాయని తొలుత పవన్‌కు చెప్పిన నేతలు
- తీరా క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా పరిస్థితులు
- నియోజకవర్గాల వారీగా పవన్ చేస్తోన్న సమీక్షల్లో తేడా కొడుతోన్న పరిస్థితులు
- కాకినాడలోనే మకాం వేసి జనసేన నేతలను కలుస్తోన్న పవన్ కళ్యాణ్
- చాలా వరకు మీడియాకు అనుమతి లేకుండా అంతర్గత సమావేశాలు
- తమ అంచనాకు భిన్నంగా పరిస్థితి ఉందని తేల్చుతున్న నివేదికలు
- గత వారం కాకినాడలో 15 డివిజన్ల కార్యకర్తలతో పవన్ భేటీ
- అంబేద్కర్ కోనసీమ జిల్లా పార్టీ ఇన్‌ఛార్జులతో సమావేశం
- పవన్‌ను కలిసిన జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు
- అసలు తెలుగుదేశం-జనసేన కలిసి పని చేసే పరిస్థితి లేదని చెప్పిన చంటిబాబు
8.44 am, జనవరి 3, 2024
సొంత సామాజికవర్గంలోనే పవన్‌పై వ్యతిరేకత
- భీమవరంలో వైఎస్సార్‌సీపీలో చేరిన జనసేన నేతలు, కార్యకర్తలు
- టీడీపీకి జనసేన వాళ్లెవరూ ఓటేయరు: ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్
- జనసేన శ్రేణుల ఆత్మాభిమానాన్ని పవన్ దెబ్బతీశారు
- పవన్‌కళ్యాణ్‌కు సీఎం పదవి కాదు కదా, డిప్యూటీ సీఎం పదవి కూడా వచ్చే అవకాశంలేదు
- పవన్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడంపై పొలిట్‌బ్యూరో, చంద్రబాబు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఇటీవల లోకేశ్ వ్యాఖ్యలు
- సొంత సామాజికవర్గంలోనే పవన్‌పై వ్యతిరేకత వ్యక్తమవుతోంది
- చంద్రబాబు రాజకీయంగా మోసగాడు, 14 ఏళ్ల పాటు సీఎంగా చేసిన ఆయన ఎన్నో వెన్నుపోటు రాజకీయాలు చేశాడు
- ప్రజలకు హామీలిచ్చి వాటిని తుంగలోకి తొక్కాడు
- పవన్‌కు కార్యకర్తల కంటే బాబే ముఖ్యమా?
- చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడానికే పవన్ పార్టీ పెట్టారా?
8.22 am, జనవరి 3, 2024
3 నెలల తర్వాత నీ అంతు చూస్తా.. టీడీపీ నేత బెదిరింపులు
- ప్రభుత్వ వైద్యుడిని బెదిరించిన టీడీపీ నేత
- పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ప్రభుత్వ వైద్యాధికారిపై టీడీపీ నేత దుర్భాషలాడి, బెదిరింపులకు దిగిన ఘటన
- తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని సేఫ్ కేర్ సెంటర్‌లో వైద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సుంకవల్లి రామకృష్ణ
- ఒక ప్రైవేట్ ఫంక్షన్‌లో భోజనం చేస్తుండగా పాత విభేదాల నేపథ్యంలో టీడీపీ నేత మల్లిన రాధాకృష్ణ ఆయనతో వాగ్వాదం
8.03 am, జనవరి 3, 2024
‘ఎర్రబుక్కు’తో భయపెడుతున్న మాజీ ఎమ్మెల్యే..
- నారా లోకేశ్ ఎర్రబుక్కు పేరుతో బెదిరింపులకు పాల్పడుతోన్న లోకేష్
- ఇదే తీరులో టీడీపీ తణుకు నేతలు కూడా స్థానిక అధికారులకు బెదిరింపులు
- ఇటీవల ‘బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ’లో టీడీపీ నేతలు ఓటీపీలు అడుగుతున్న వ్యవహారంలో కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకుని బైండోవర్
- ఈ వ్యవహారంలో ఉన్న మల్లిన రాధాకృష్ణను పోలీస్‌స్టేషన్‌కు తీసుకురాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ స్టేషన్‌కు వచ్చి పోలీసులతో వాగ్వాదం
7.30am, జనవరి 3, 2024
వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరిన టీడీపీ, జనసేన కార్యకర్తలు
- ‘పశ్చిమ’లో మంత్రి కారుమూరి సమక్షంలో చేరిక
- వైస్సార్‌సీపీ ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులవుతున్న ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు
- పశ్చిమగోదావరి జిల్లా అత్తిలిలో జనసేన, టీడీపీలకు చెందిన 150 మంది వైఎస్సార్‌సీపీలో చేరిక
- వీరికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన మంత్రి కారుమూరి
- రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘనవిజయానికి కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చిన కారుమూరి
7.00am, జనవరి 3, 2024
ఎన్నికలొస్తున్నాయి.. కిం కర్తవ్యం..: చంద్రబాబు మంత్రాంగం
- ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ టిడిపిలో పెరుగుతున్న హీట్
- ఏం చేయాలి, ఏం చెబితే జనం నమ్ముతారు?
- వచ్చిన ప్రతీ ముఖ్యనేతకు ఇదే పరీక్ష పెడుతోన్న చంద్రబాబు
- ఈనెల 5 నుంచి 29 వరకూ పార్లమెంట్ స్థానాల్లో చంద్రబాబు సభలు
- 5న ఒంగోలు, 6న విజయవాడ, నరసాపురం పార్లమెంట్ పరిధిలో సభలు
6.30am, జనవరి 3, 2024
పవన్ + చంద్రబాబు = సున్నా
- పవన్ కళ్యాణ్, జనసేనలపై కాపు సంఘం దాసరి రాము ఫైర్
- గతి లేక టీడీపీ కాళ్లు పట్టుకున్నట్లుంది పవన్ పరిస్థితి
- జనసేనకు 20 సీట్లు ఇస్తామన్నారు టీడీపీ వాళ్లు
- అధికారపక్షంతో పవన్ కళ్యాణ్‌కు ఆస్తి తగాదాలు ఉన్నాయా? లేక వ్యక్తిగత గొడవలు ఉన్నాయా?
- YSRCPకి పవన్ వ్యతిరేకంగా వెళ్లాల్సిన పనేంటి? కాపులంతా ఎందుకు వ్యతిరేకించాలి?
- టీడీపీ క్యాండిడేట్లే జనసేన తరఫున పోటీ చేస్తారు
- చచ్చిపోయిన టీడీపీని బతికించాల్సిన అవసరం కాపులకు లేదు
- టీడీపీతో కలవకుండా విడిగా పోటీచేయమని ప్రధాని మోదీ చెప్పారు అయినా పవన్ కళ్యాణ్ వినలేదు
- పవన్‌కు ప్యాకేజీ ఇచ్చామని మొదట ప్రచారం చేసింది చంద్రబాబే
- నాదెండ్ల మనోహర్ చౌదరి లాంటి వ్యక్తిని తెచ్చి జనసేన పార్టీలో పెట్టుకున్నారు
- సీఎం పవర్ షేరింగ్ లేకపోతే కాపులెవరు ఓట్లు వేయరు
- లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలి
- యూట్యూబ్ చానల్‌లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కాపు సంఘం నేత దాసరి రాము
6.30am, జనవరి 3, 2024
జన బలమే గీటురాయి..
- 24 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలను నియమించిన సీఎం జగన్
- 11 శాసనసభ స్థానాలకు సమన్వయకర్తలతో ఇప్పటికే తొలి జాబితా
- మొత్తం 35 శాసనసభ, మూడు లోక్‌సభ స్థానాలకు నూతన సమన్వయకర్తలు
- సామాజిక న్యాయం, మహిళలు, యువతకు పెద్దపీట
- గతంలో అగ్రవర్ణాలకు కేటాయించిన ఏడు శాసనసభ స్థానాల్లో తాజాగా ఐదు చోట్ల బీసీలు, రెండు చోట్ల మైనార్టీలకు అవకాశం
- 175కు 175 స్థానాల్లోనూ విజయమే లక్ష్యంగా అవసరమైన చోట్ల మార్పులు