AP Political Updates Feb 21st: ఏపీ పొలిటికల్ అప్‌డేట్స్

Andhra Pradesh Political News Updates Telugu Feb 21st Updates - Sakshi

AP Elections Political Latest Updates Telugu..

09:33 PM, Feb 21st, 2024
రేపు విజయవాడలో టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం

 • సమావేశంలో పాల్గొననున్న టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సభ్యులు
 • క్షేత్రస్థాయిలో సమన్వయం, ఉమ్మడి కార్యాచరణ పై చర్చ
 • సమావేశంలో మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై చర్చ
 • వివిధ జిల్లాల్లో ప్రచార వ్యూహాల రూట్ మ్యాప్ పై చర్చ
 • టీడీపీ కమిటీ సభ్యులుగా అచ్చెన్నాయుడు, యనమల, పితాని, పయ్యావుల, నిమ్మల, తంగిరాల సౌమ్య జనసేన కమిటీ సభ్యులుగా నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, గోవిందరావు, నాయకర్, యశస్విని

08:16 PM, Feb 21st, 2024
ఏసీబీ కోర్టులో స్కిల్ స్కాం కేసు విచారణ

 • స్కిల్ స్కాం నిందితుడు, మాజీ ఎండీ లక్ష్మీనారాయణ పిటిషన్‌పై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు
 • స్కిల్ స్కాంలో అప్రూవర్‌గా మారడానికి అనుమతించాల‌ని ఏసీఐ ఎండి చంద్రకాంత్ షా పిటిషన్
 • చంద్రకాంత్ షా పిటిషన్‌లో జత చేసిన డాక్యుమెంట్లు తనకి అందజేయాలని లక్ష్మీనారాయణ పిటిషన్
 • స్కిల్ కేసులో తాను కూడా ముద్దాయిగా ఉన్నందున చంద్రకాంత్ షా వేసిన పిటీషన్‌లోని డాక్యుమెంట్స్ ఇవ్వాలని వాదించిన లక్ష్మీనారాయణ తరపు న్యాయవాదులు
 • విచారణ రేపటికి వాయిదా
 • రేపు ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించనున్న సీఐడీ తరపు న్యాయవాదులు

07:06 PM, Feb 21st, 2024
భువనేశ్వరి మాటలతో క్లారిటీ వచ్చేసింది: మంత్రి అంబటి రాంబాబు

 • భువనేశ్వరి, లోకేష్ ఇద్దరు కలిసి కుర్చీలు మడత పెడుతున్నారు
 • రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ కుర్చీ మడత పెట్టేశారు
 • భువనేశ్వరి చంద్రబాబు నాయుడుని రెస్ట్ తీసుకోమని చెప్తోంది
 • కుప్పంలో చంద్రబాబుకి రెస్ట్ ఇవ్వండి అని కార్యకర్తలకు చెప్తుంది
 • కుప్పంలో చంద్రబాబు నాయుడు కుర్చీ కూడా మడత పెట్టేశారని అర్ధమౌతుంది.
 • భువనేశ్వరి చంద్రబాబు పెద్దవాడైపోయాడు ఆయన రెస్ట్ తీసుకుంటాడు నేను పోటీ చేస్తానని చెప్తోంది
 • చంద్రబాబు, లోకేష్‌కు రెస్ట్ ఇచ్చి ఎన్టీఆర్ కుమార్తె కుప్పంలో పోటీ చేసినా... కుప్పంలో ఓడిపోవడం ఖాయం
 • చంద్రబాబు కుప్పంలో సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసిన కుప్పంలో నీళ్లు ఇవ్వలేకపోయాడు
 • వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో త్వరలో కుప్పంలో నీళ్లు ఇవ్వబోతున్నాం
 • రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు
 • అనిల్‌ కుమార్ యాదవ్ వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి
 • చంద్రబాబు తెలుగుదేశాన్ని మూసేసే పరిస్థితి దగ్గర్లో ఉందని ప్రజలకు అర్థమైంది
 • ఇవాళ భువనేశ్వరి మాట్లాడిన మాటలతో క్లారిటీ వచ్చింది
 • చంద్రబాబుకు ఏజ్ అయిపోయింది టైం అయిపోయింది ఆయన కొడుకుని చూస్తే ఎందుకు పనికిరాడు
 • అందుకే కనీసం కుప్పంలో నన్ను అన్న గెలిపించండి అని  టీడీపీ కార్యకర్తలను భువనేశ్వరి బతిమిలాడుకుంటుంది

06:55 PM, Feb 21st, 2024
ఓటుకు నోటు: పవన్‌ కళ్యాణ్‌ పరమార్థమిదే

 • భీమవరం కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్
 • డబ్బులు పంచితే గానీ నెగ్గలేమట.!
 • డబ్బులు ఖర్చు పెడితేనే రాజకీయాలట.!
 • ఎన్నికలప్పుడు మాత్రమే ఏపీకి వస్తే తప్పు కాదా?
 • ప్యాకేజీ పాలిటిక్స్‌ చేస్తే ప్రజలెలా పట్టించుకుంటారు?భీమవరంలో పవన్‌ కళ్యాణ్‌ నోటి వెంట కొత్త మాటలు వచ్చాయి
 • ఎన్నికల వేళ జనసేన, టిడిపి నేతలను ఆశ్చర్యచకితులను చేసే వ్యాఖ్యలు
 • తమను చూసి ఎవరూ ఓటు వేయరన్న ఉద్దేశ్యంలో మాట్లాడిన పవన్‌ కళ్యాణ్‌
 • రాజకీయాలంటే డబ్బు ఖర్చు పెట్టడమేనంటూ ఓటరు విలువను దిగజార్చారు
 • ఎన్నికల సంఘం ఆదర్శాలను అపహస్యం చేసేలా తన బాసు చంద్రబాబు అనుసరిస్తోన్న ఓటుకు నోటు సిద్ధాంతాన్ని గుర్తు చేశారు

05:53 PM, Feb 21st, 2024
భువనేశ్వరి ఆమె మనసులో మాట బయటపెట్టారు: మంత్రి జోగి రమేష్‌

 • రాష్ట్రప్రజలంతా చంద్రబాబును అసహ్యించుకుంటున్నారు
 • చంద్రబాబుకు రెస్ట్ ఇవ్వాలని ప్రజలంతా నిర్ణయించుకున్నారు 
 • భువనేశ్వరి ఈ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు
 • ప్రజల మనసులో ఉన్న ఆకాంక్షను ఆమె గమనించారు 
 • భువనేశ్వరి సరదాగా చెప్పిన మాట కాదు
 • ఆమె మనసులో ఉన్న భావనే బయటపెట్టారు 
 • 35 ఏళ్ల నుంచి కుప్పానికి చంద్రబాబు ఏం చేయలేదు
 • చంద్రబాబు కుప్పానికీ పనికిరాడు..రాష్ట్రానికీ పనికిరాడని సొంత భార్యే చెప్పేసింది
 • సిద్ధాంతం, విలువలు, విశ్వసనీయత లేని వ్యక్తి చంద్రబాబు 
 • టీడీపీని తీసుకెళ్లి తాకట్టుపెట్టేస్తాడు
 • 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు 175 స్థానాల్లో టీడీపీని నిలబెట్టలేని అసమర్ధుడయ్యాడు
 • టీడీపీని కొన్ని ప్రాంతాలకే పరిమితం చేశాడు 
 • పవన్‌కు 50, 60 పంచాలి.. మరో పార్టీకి ఇంకొన్ని పంచాలనే ఆలోచనలో ఉన్నాడు 
 • చంద్రబాబు దిక్కులేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు
 • ఇవన్నీ గమనించారు కాబట్టే చంద్రబాబును పక్కకు తోసేయాలని భువనేశ్వరి ఆలోచన 
 • చంద్రబాబు, లోకేష్ పనికిరాడు...ఎన్టీఆర్ కూతురుగా తానే బెటర్ అని భువనేశ్వరి భావిస్తున్నట్లున్నారు 
 • చంద్రబాబు ఓడిపోతున్నాడని భువనేశ్వరి ముందే కనిపెట్టారు 
 • ఎన్టీఆర్ కూతురుగా తనకైనా ఓట్లేస్తారని భువనేశ్వరి అనుకుంటున్నారు 
 • ఈసారి కుప్పంలో చంద్రబాబు అడ్రస్ గల్లంతవ్వడం ఖాయం

05:13 PM, Feb 21st, 2024
అందుకే కుప్పం నుంచి చంద్రబాబు పారిపోయారు: నారమల్లి పద్మజ

 • చంద్రబాబు రాజకీయాలకు పనికి రారని భువనేశ్వరి తేల్చి చెప్పారు
 • ఏఏజీ ఆస్పత్రి వారు కూడా చంద్రబాబు రెస్టు తీసుకోవాలని అప్పుడే చెప్పారు 
 • కానీ చంద్రబాబు తిరుగుతూనే ఉన్నారు
 • జనం నుండి స్పందన లేకపోవడంతో కుర్చీ మడత పెట్టేశారు
 • ఎమ్మెల్యేగానే కాదు, రాజకీయాలకు కూడా చంద్రబాబు పనికిరారు 
 • భువనేశ్వరి అబద్దాలను చూస్తుంటే చంద్రబాబుకు మించిపోతున్నారు
 • విజయవాడలో కాల్ మనీ  రాకెట్ బయట పడినప్పుడు భువనేశ్వరి ఎందుకు మాట్లాడలేదు?
 • రుషితేశ్వరి ర్యాగింగ్‌తో ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఏమయ్యారు?
 • తహశీల్దార్‌ వనజాక్షిపై దారుణంగా మీ ఎమ్మెల్యే దాడి చేస్తే భువనేశ్వరి ఏం చేశారు?
 • అసలు మహిళల గురించి మాట్లాడే అర్హత ఉందా? 
 • బాలకృష్ణ మహిళలను కించపరిచేలా మాట్లాడినప్పుడు ఎందుకు క్షమాపణలు చెప్పలేదు? 
 • తెలుగుదేశం పార్టీని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేస్తారు 
 • మూడు సిద్ధం సభలు చూశాక చంద్రబాబుకు వెన్నులో వణుకు పుట్టింది
 • అందుకే కుప్పం నుంచి చంద్రబాబు పారిపోయారు
 • ఎక్కడో పక్క రాష్ట్రాల్లో జరిగే ఘటనలను కూడా ఏపీలో జరిగినట్టు పచ్చి అబద్దాలు చెప్తున్న మహిళ భువనేశ్వరి
 • అబద్దాల టీడీపీకి కరెక్టయిన అధ్యక్షులు భువనేశ్వరి
 • ఆమెకే అధ్యక్ష‌పదవి ఇస్తే బెటర్

05:06 PM, Feb 21st, 2024
మళ్లీ వాయిదా

 • లోకేష్ రెడ్ బుక్ బెదిరింపుల కేసు 28కి వాయిదా
 • కౌంటర్ దాఖలు చేయడానికి మరోసారి సమయమడిగిన లోకేష్ లాయర్లు
 • వారం రోజుల సమయమిస్తూ 28కి కేసు విచారణ వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
 • గత నాలుగు వాయిదాల సమయంలోనూ ఏసీబీ కోర్టులో సమయం కోరిన లోకేష్ న్యాయవాదులు
 • కేసు విచారణ జరగకుండా మొదటి నుంచి లోకేష్ యత్నాలు 
 • యువగళం‌ ముగింపు రోజు మీడియా ఛానెళ్ల ఇంటర్వ్యూలలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన లోకేష్
 • చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించారని.. రిమాండ్ విధించడం తప్పంటూ ఏసీబీ న్యాయమూర్తిపై దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు
 • అధికారులకి రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు
 • లోకేష్ రెడ్ బుక్ బెదిరింపులపై ఏసీబీ కోర్టులో సీఐడీ పిటీషన్
 • సీఐడీ పిటీషన్‌పై ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయకుండా లోకేష్ నాన్చుడు
 • రెడ్ బుక్ అంశంపై సీఐడీ నోటీసులు పట్టించుకోని లోకేష్
 • స్వయంగా ఏసీబీ కోర్టు నుంచి లోకేష్‌కి నోటీసులు జారీ
 • ఏసీబీ కోర్టు ఆదేశాలని సైతం లెక్కచేయని లోకేష్
 • ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయకుండా వాయిదాలు కోరుతూ వచ్చిన టీడీపీ లాయర్లు

04:10 PM, Feb 21st, 2024
చంద్రబాబు కుప్పంలో కుర్చీ మడత పెట్టేశారు: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి

 • ఎన్నికలకు ముందే చేతులు ఎత్తేశారు
 • ఇప్పటికే రాజ్యసభలో జీరో అయ్యింది.
 • వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలోనూ టీడీపీ జీరో అవుతుంది.
 • చంద్రబాబు కుప్పంలో పోటీ చేయలేడని మేము ముందే చెప్పాం
 • కుప్పం ప్రజలకు జగన్ మాత్రమే అన్ని సౌకర్యాలు కల్పించారు

03:52 PM, Feb 21st, 2024
కుప్పం నుంచి చంద్రబాబు పారిపోయారు: జూపూడి ప్రభాకరరావు

 • ‘సిద్దం’ సభలతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు‌
 • స్కూల్స్ బాగుపడాలన్నా, అందరికీ వైద్యం అందాలన్నా జగనే కావాలని జనం అంటున్నారు
 • చంద్రబాబు సామాజిక న్యాయాన్ని ఎప్పుడో మర్చిపోయారు 
 • ఇప్పటికీ సీట్ల కేటాయింపు కూడా చేసుకోలేని దుస్థితిలో‌ చంద్రబాబు ఉన్నారు
 • అసలు చంద్రబాబుకు ఎందుకు ఓటేయాలో ఒక్క కారణం కూడా చూపించలేరు
 • అంబేద్కర్ పేరు ఉచ్చరించే అర్హత చంద్రబాబుకు లేదు 
 • కుప్పం నుంచి చంద్రబాబు పారిపోయారు
 • భువనేశ్వరి చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచారా?
 • టీడీపీలో ఏం జరుగుతుంది?
 • లోకేష్, భువనేశ్వరి కలిసి చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచారు

02:56 PM, Feb 21st, 2024
ఎన్నికల టార్గెట్‌ క్లియర్‌గా ఉంది: సజ్జల రామకృష్ణారెడ్డి

 • వైఎస్సార్‌సీపీ డీఎన్ఏలోనే మైనార్టీలు ఉన్నారు
 • అందుకు తగినట్టే పార్టీ విధానాలు ఉంటాయి
 • సునామిలాగా వస్తున్న ఆదరణని పోలింగ్ బూత్ వద్దకు తీసుకువెళ్లి రెండు బటన్‌లను నొక్కించాలి
 • రాబోయే 50 రోజుల్లో ఇదే మన పని.. టార్గెట్ క్లియర్‌గా ఉంది..
 • పరీక్షలు వచ్చినపుడు ఎలా పనిచేస్తామో.. అలానే ఇప్పుడు పని చేయాలి
 • చిన్నపాటి విచక్షణ కూడా లేకుండా ప్రభుత్వం పని చేస్తోంది
 • 2019 వరకు చంద్రబాబు ముఠా చేసిన అరాచకాన్ని చూశాం
 • అందుకే ప్రజలు మనకు పట్టం కట్టారు
 • ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చాము
 • ఇక పై మైనార్టీలను ఇతర వర్గాలకు నాయకులను చేస్తాం
 • మైనార్టీ లకు 50శాతం పదవులు ఇచ్చాము
 • అన్ని వర్గాలకు జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారు
 • కొన్ని కులాల్లో నాయకులు  దొరకని పరిస్థితి ఉంది
 • ఓట్ల కోసం పథకాలను రూపొందించలేదు
 • సంక్షేమం, అభివృద్ధి కలగలిపిన రాష్ట్రం గా ఏపీ ని జగన్ తీర్చిదిద్దుతున్నారు
 • సంక్షేమ పథకాలు ద్వారా సామాన్యులకు కొనుగోలు శక్తి పెరిగింది.
 • టీడీపీ ఎంత విషప్రచారం చేసినా వాస్తవాలేంటో  ప్రజలకు తెలిసి వచ్చింది
 • రోగాలు ఉన్నాయని జైలు నుండి బెయిల్ పై వచ్చిన చంద్రబాబు.. ఈ రోజు తాను యువకుడిని అంటూ ఊర్లలో తిరుగుతున్నాడు

01:37 PM, Feb 21st, 2024
బెజవాడ సైకిల్‌కు ఎదురుగాలి

 • విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మారుతున్న సమీకరణాలు
 • పొత్తులో భాగంగా తూర్పులో రాధకి టికెట్ ఇవ్వాలన్న యోచనలో చంద్రబాబు
 • గుర్రుమన్న గద్దె రామ్మోహన్
 • పార్టీ మారే యోచనలో గద్దె 
 • నిన్న రాత్రి ఇతర పార్టీ నేతలను కలిసిన గద్దె రామ్మోహన్

01:29 PM, Feb 21st, 2024
భీమవరంలో గెలిపించండి ప్లీజ్‌: జనసేనాని

 • తెలుగుదేశం పార్టీ నాయకులతో  పవన్ కల్యాణ్ సమావేశం
 • ఈ సారి ఎలాగైనా అసెంబ్లీకి పంపాలని కోరిన పవన్‌ 
 • రెండు పార్టీల మధ్య పొరపొచ్చాలున్నా పట్టించుకోవద్దని విజ్ఞప్తి
 • నేతల మధ్య విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేయాలని వేడ్కోలు
 • ఏమైనా సమస్యలుంటే మీ పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకురావాలని పవన్ కల్యాణ్ సూచన
 • కేవలం కొందరు నాయకులనే కలిస్తే సరిపోతుందా? : పవన్‌తీరుపై తెలుగుతమ్ముళ్ల ఆగ్రహం
 • ఇక్కడికి రమ్మన్నారు, గంటల కొద్దీ కూర్చోబెట్టారు, కనీసం పలకరించాలని పవన్‌కు తెలియదా?
 • మమ్మల్ని పట్టించుకోకుండా లీడర్లతో మాట్లాడి వెళ్లిపోతాడా?
 • రేపు ఓట్లు వేసేది, వేయించేది ఎవరు? : పవన్‌ తీరుపై టీడీపీ కార్యకర్తల మండిపాటు

01:22 PM, Feb 21st, 2024
పవనూ.. 40 చెప్పి 20లోనే పోటీనా?: వెల్లంపల్లి సెటైర్లు

 • పేద ప్రజలకు అమరావతిలో ఇల్లు కేటాయిస్తే దుర్మార్గుడు చంద్రబాబు కోర్టుకెళ్లి అడ్డుకున్నాడు.
 • పేదవారి ఇల్లు పట్ల చంద్రబాబు కోర్టులో స్టే ఎందుకు వేశాడు.
 • పేదవారు సంతోషంగా ఉండటం చూడలేని వ్యక్తి చంద్రబాబు
 • 2019 లో చంద్రముఖి చంద్రబాబు ను సీఎం జగన్ పెట్లో పెట్టి తాళం వేశాడు.
 • లక లక..  అంటూ రాక్షసుడు చంద్రబాబు ప్రభుత్వం రాలేదు
 • చంద్రముఖి లాంటి చంద్రబాబును అరికట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజల మీద ఉంది.
 • చంద్రబాబు పరిపాలనతో రాష్ట్రం నాశనం అవుతుంది.
 • చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం కరువు, అప్పుల పాలవుతుంది.
 • రాష్ట్ర ప్రజలు కుప్పంలో కూడా చంద్రబాబును ఓడించి సీఎం జగన్ కు 175 సీట్లు కానుక ఇస్తారు.
 • పవన్ కళ్యాణ్ సింగల్ గా పోటీ చేసే దమ్ము ధైర్యం లేదు
 • పవన్ కళ్యాణ్ మరి ఎందుకు 20 సీట్లకు అమ్ముడుపోయాడు.
 • ప్యాకేజీల కోసం బతికేది పవన్ కళ్యాణ్.
 • జనసేనా సింగల్ గా పోటీ చేస్తే 40 సీట్లు వస్తాయి అన్న పవన్ 20 సీట్లు అడుక్కోవడం దేనికి?

మాజీ మంత్రి,ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కామెంట్స్

01:01 PM, Feb 21st, 2024
భీమవరం టీడీపీ శ్రేణుల్లో తీవ్ర నిరుత్సాహం

 • పవన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తెలుగు తమ్ముళ్లు
 • జిల్లా టీడీపీ కార్యాలయంలో పవన్ తో సమావేశం కోసం ఉదయం నుండి వేచి ఉన్న నాయకులు
 • కేవలం భీమవరం నియోజకవర్గ నాయకులతో సమావేశం అని ఏర్పాటు చేసిన జిల్లా టీడీపీ అధ్యక్షురాలు
 • తన నివాసంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లతో మాత్రమే జరిగిన భేటీ
 • పవన్ అర్థతరంగా వెళ్లిపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న టీడీపీ నాయకులు
 •  భీమవరం టీడీపీ నాయకులతో పవన్ మీటింగ్ క్యాన్సిల్ అవడం పై సర్ది చెప్పే ప్రయత్నం చేసిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ
 •  మమ్మల్నే కలవకపోతే ప్రజలని ఎలా కలుస్తారంటూ టీడీపీ నేతల  ఆగ్రహం వ్యక్తం చేసిన భీమవరం టీడీపీ నాయకులు
 •  పవన్ కల్యాణ్  వచ్చింది తెలుగుదేశం పార్టీని పాడు చేయడానికా....అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన టిడిపి కార్యకర్తలు
 • ఇంకెప్పుడూ పవన్ మీటింగ్ అని భీమవరం పిలవద్దంటూ వీరవాసరం నాయకులు ఆగ్రహం
 • మండలాల వారీ మీటింగ్ పెట్టండి అని సీరియస్
 • పార్టీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ
 •  మీరెవరు ఎక్కడ మీటింగ్ పెట్టాలో చెప్పడానికి అంటూ మండిపడ్డ పితాని

12:39 PM, Feb 21st, 2024
కళ్యాణదుర్గంలో మా పార్టీ గందరగోళంగా ఉంది: టీడీపీ నేతలు

 • కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్ర బాబు కు టిక్కెట్ ఖరారు
 • మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి, టీడీపీ ఇంఛార్జి ఉమామహేశ్వర నాయుడు 
 • కళ్యాణదుర్గం టీడీపీ ఇంఛార్జి ఉమామహేశ్వర నాయుడు, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి మీడియా సమావేశం
 • కళ్యాణదుర్గం టీడీపీ లో రాజకీయ గందరగోళం నెలకొంది 
 • చంద్రబాబు నాయుడు కు అల్టిమేటం జారీ చేసిన ఇరువురు నేతలు
 • కళ్యాణదుర్గం టీడీపీ టిక్కెట్ తనకే ఖరారు అయిందని కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్ర బాబు ప్రచారం చేసుకుంటున్నారు
 • అధికారికంగా చంద్రబాబు ఎక్కడా ప్రకటించలేదు
 • మాతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు
 • మా ఇద్దరిలో ఎవరో ఒకరికి టిక్కెట్ కేటాయించాలి
 • కళ్యాణదుర్గం లో పార్టీ కోసం పనిచేసిన ఏ నేతకు ఇచ్చినా పని చేస్తాం 
 • స్థానికేతరులకు టిక్కెట్ ఇస్తే అంగీకరించేదిలేదన్న ఇద్దరు నేతలు 

12:25 PM, Feb 21st, 2024
జనసైనికుల దూషణ.. ఎక్స్‌లో బుచ్చయ్య రియాక్షన్‌

 • రాజమండ్రిలో జనసేన వర్సెస్ టీడీపీ మధ్య ముదురుతున్న రగడ
 • రాజమండ్రి రూరల్ స్ధానం నుంచే పోటీచేస్తానని స్పష్టం చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి
 • బుచ్చయ్య చౌదరిని సోషల్ మీడియాలో టార్గెట్ చేసిన జనసేన కార్యకర్తలు
 • కుర్చీ మడత పెడతామంటూ బుచ్చయ్యపై దూషణలు
 • సోషల్ మీడియాలో వచ్చిన అంశాలను పట్టించుకోవద్దన్న బుచ్చయ్య చౌదరి

12:15 PM, Feb 21st, 2024
టీడీపీ లో చింతలపూడి సీటు చిచ్చు

 • సీటు దక్కకపోవడం తో మాజీ మంత్రి పీతల సుజాత తీవ్ర అసహనం
 • చింతలపూడి ఇంచార్జ్ గా రోషన్ కుమార్ ని ప్రకటించిన టీడీపీ
 • సీనియర్ ని అవమానించారంటూ పీతల సుజాత అసంతృప్తి
 • పవన్ కల్యాణ్, టీడీపీ నేతల సమావేశానికి పీతల సుజాత డుమ్మా
 • భవిష్యత్ కార్యాచరణ పై పీతల సుజాత అనుచరుల తో మంతనాలు
 • పీతల సుజాత తో సంప్రదింపులు చేస్తున్న టీడీపీ నేతలు
 • చింతమనేని ,మాగంటి బాబు లను నమ్ముకుని సీటు పై ఆశలు పెట్టుకున్న మరో నేత బొమ్మాజి  అనిల్ కు చుక్కెదురు

12:11 PM, Feb 21st, 2024
గ్లాస్‌ గుర్తు.. విచారణ వాయిదా

 • జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై హైకోర్టులో విచారణ
 • జనసేన గాజుగ్లాసు గుర్తు రద్దు చేయాలని RPC పార్టీ పిటిషన్
 • ఏపీ హైకోర్టులో నేడు జరిగిన విచారణ
 • వాదనలు వినిపించేందుకు సమయం కోరిన జనసేన
 • విచారణ 28వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు

12:08 PM, Feb 21st, 2024
టీడీపీ అబద్ధపు ప్రచారాలు నమ్మొద్దు: ఎంపీ మిథున్‌

 • టీడీపీ ఎన్ని ప్రచారాలు చేసుకున్న సీఎంగా మళ్ళీ జగనే
 • టీడీపీ అబద్ధపు ప్రచారాలను నమ్మవద్దు
 • కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలి
 • బూతు స్థాయిలో పని విభజన చేసుకొని ముందుకు సాగాలి
 • అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తాం
 • పీలేరు కార్యకర్తల సమావేశంలో దిశా నిర్దేశం చేసిన ఎంపీ మిధున్ రెడ్డి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి
 • వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తిరిగి రావడం ఖాయం

ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు

12:03 PM, Feb 21st, 2024
భీమవరం నుంచే పోటీ చేస్తా: పవన్‌ కల్యాణ్‌

 • నేడు భీమవరంలో పర్యటిస్తున్న పవన్‌
 • టీడీపీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి ఇంట్లో టీడీపీ నేతలతో భేటీ అయిన పవన్‌
 • భీమవరం నుంచే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోటీ
 • టీడీపీ నేతలతో స్పష్టం చేసిన జనసేనాని
 • మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు నివాసానికి వెళ్లి మరీ అదే విషయం స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్

11:50 AM, Feb 21st, 2024
టీడీపీపై అంబటి సెటైర్‌

 • రాజ్యసభలో కుర్చీ మడతేసిన టీడీపీ
 • అతిత్వరలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా అంటూ అంబటి ట్వీట్‌

11:32 AM, Feb 21st, 2024
కొనకళ్లకు పచ్చసెగ తగులుతోందా?

 • టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్లకు వ్యతిరేకంగా ప్రచారం 
 • తెలుగుదేశంలోనే కొందరు వ్యతిరేక ప్రచారం
 • టీడీపీ కొనకళ్ల విడిచిపెట్టి వెళతాడంటూ సోషల్ మీడియాలో టిడిపి నేతల పోస్టింగ్‌లు
 • పొమ్మనలేక పొగ పెడుతున్నారంటూ సన్నిహితుల దగ్గర కొనకళ్ల ఆవేదన

11:25 AM, Feb 21st, 2024
ఎందరు ఎదురొచ్చినా గెలిచిచూపిస్తా: అనిల్ కుమార్ యాదవ్ 

 • జగన్ కోసం తల తెంచుకుంటా
 • ఎవరికీ తలవంచను! 
 • ఒక్కడిని ఓడించడానికి ఐదుగురు కలిసి వస్తున్నారు
 • ఎంపీగా గెలిచాక.. పల్నాడులోనే ఇల్లు కట్టుకొని ఉంటా
 • జగన్ కోసం రామబంటులా పనిచేస్తా

11:03 AM, Feb 21st, 2024
లోకేష్‌ పిల్లి అని ఏపీ మొత్తానికి తెలుసు!

 • నర్సీపట్నంలో లోకేష్ శంఖారావం అట్టర్ ప్లాప్
 • రాష్ట్రస్థాయి నేత లోకేష్ వస్తే 2000 మంది కూడా రాలేదు
 • నర్సీపట్నంలో వైయస్సార్సీ బస్సు యాత్ర సభకు 40000 మంది హాజరయ్యారు
 • రాష్ట్రంలో పిల్లి అంటే లోకేష్ అని ప్రతి ఒక్కరికి తెలుసు
 • పులి అంటే వైయస్ జగన్ అని దేశం మొత్తం తెలుసు
 • లోకేష్ లాంటి పిల్లులు ఎంత మంది వచ్చినా సీఎం జగన్ వెంట్రుక కూడా పీకలేరు
 • చంద్రబాబు నిరుద్యోగ భృతి, ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేశారు
 • మళ్లీ ఇప్పుడు 3000 నిరుద్యోగ భృతి అంటూ 420 మాటలు చెబుతున్నారు
 • నేను రూపాయి అవినీతి చేసినట్లు దమ్ముంటే నిరూపించాలి
 • నీ పక్కనే అయ్యన్న వంటి దోపిడీ దొంగలను పట్టుకుని మాపై విమర్శలా?
 • వందల కోట్లు దోపిడీ చేసింది అయ్యన్న కాదా?

నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ వ్యాఖ్యలు

10:23 AM, Feb 21st, 2024
తణుకులో కోల్డ్‌ వార్‌

 • తణుకు సీటు కోసం టీడీపీ-జనసేన ఫైట్‌
 • టీడీపీ, జనసేన లోకల్‌ లీడర్ల వార్‌
 • విడివాడ రామచంద్రరావు పోటీ చేస్తారని గతంలో పవన్‌ ప్రకటన
 • పోటీకి పట్టుబడుతున్న టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ
 • టికెట్‌ నాకంటే నాకంటూ ఇద్దరి పోటాపోటీ ప్రచారం
 • పవన్‌ పర్యటనతో ఆసక్తిగా మారిన పొత్తు రాజకీయం

09:49 AM, Feb 21st, 2024
జనం సీఎం జగన్‌తోనే ఉన్నారు: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

 • రాజ్యసభ సభ్యుడు గా ధ్రువీకరణ పత్రం తీసుకున్న వైవీ సుబ్బారెడ్డి
 • ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం సంతోషంగా ఉంది
 • సంఖ్యా బలం లేకపోయినా టీడీపీ పోటీ చేయాలని భావించింది
 • కానీ మా ఎమ్మెల్యేలు అందరూ సీఎం జగన్ పట్ల విశ్వాసం తో ఉన్నారు
 • అందుకే మేము ఏకగ్రీవంగా గెలవగలిగాము
 • టీడీపీ ని పెద్దల సభ లో ఖాళీ చేశాం
 • మొత్తం స్థానాలు వై ఎస్సార్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది
 • ఒక్కొక్క సభ లో టీడీపీ ని ఖాళీ చేస్తున్నాం
 • తర్వాత లోక్ సభ, శాసనసభ లో కూడా క్లీన్ స్వీప్ అవుతుంది
 • మా పార్టీ నుండి వెళ్లిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే లు మళ్ళీ తిరిగివస్తున్నారు
 • టీడీపీ, కాంగ్రెస్ పార్టీలలో ఉన్న వారికి రాజకీయ మనుగడ ఉండదు
 • సీఎం జగన్ తో ఉంటేనే ఎవరికైనా రాజకీయంగా మంచి జరుగుతుంది
 • సీఎం జగన్ తో జనం ఉన్నారు

08:55 AM, Feb 21st, 2024
లోకేష్‌ రెడ్‌బుక్‌ కేసుపై నేడు విచారణ

 • విజయవాడ ఏసీబీ కోర్టులో నారా లోకేష్ రెడ్ బుక్ కేసుపై విచారణ
 • నారా లోకేష్ ను అరెస్ట్ చేయాలని సీఐడీ వేసిన పిటిషన్ పై ఏసీబీ కోర్టు విచారణ
 • రెడ్ బుక్ లో ప్రభుత్వ అధికారుల పేర్లు ఉన్నాయని బెదిరిస్తూ 41ఏ నిబంధలకు విరుద్ధంగా లోకేష్  వ్యవహరిస్తున్నారని సీఐడీ పిటిషన్
 •  ఈ కేసు పై  ఏసిబి కోర్టులో ఈ రోజు విచారణ.

08:23 AM, Feb 21st, 2024
తెనాలిలో టికెట్‌ చిచ్చు?

 • తెనాలిలో టీడీపీపై జనసేన పైచేయి!
 • పంతం నెగ్గించుకున్న నాదెండ్ల
 • తెనాలి టికెట్‌ నాదెండ్ల మనోహర్‌కే
 • మాజీ మంత్రి ఆలపాటికి లేదని తేల్చేసిన నారా లోకేష్‌
 • సర్వేలు తనకే ఉన్నాయని ప్రకటించుకుంటూ వస్తున్న ఆలపాటి
 • గల్లా జయదేవ్‌ క్రియాశీలక రాజకీయాలకు దూరం
 • గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఆలపాటికి సూచన
 • లేదంటే మీ దారి మీరు చూస్కోవాలని ఆలపాటికి స్పష్టీకరణ
 • తన వర్గంతో చర్చలు, సంప్రదింపుల తర్వాత నిర్ణయం తీసుకోనున్న ఆలపాటి

07:58 AM, Feb 21st, 2024
అనంతలో టీడీపీ నేతల దౌర్జన్యం

 • టీడీపీ నేత, అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి కి చేదు అనుభవం
 • టీడీపీ నేత ప్రభాకర్ చౌదరిని నిలదీసిన మహిళ 
 • నువ్వు ఎప్పుడూ రాలేదని ప్రభాకర్ చౌదరిని నిలదీసిన మహిళ
 • అనంతపురం నగరంలోని 21, 13, 2 డివిజన్లలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి
 • చేయని అభివృద్ధి చేసినట్లుగా చెప్పేందుకు ప్రభాకర్ చౌదరి యత్నం
 • నువ్వు ఎప్పుడూ రాలేదు కదా అని మొహం మీద చెప్పేసిన మహిళ
 • ప్రతి రోజూ మీ ఏరియాకు రాలేనంటూ అసహనం వ్యక్తం చేసిన వైకుంఠం ప్రభాకర్ చౌదరి
 • చిత్రీకరిస్తున్న వారిపై దౌర్జన్యం చేసిన టీడీపీ నేతలు

07:41 AM, Feb 21st, 2024
భీమవరంలో పవన్‌ పర్యటన

 • నేడు భీమవరంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటన
 • ఇక్కడి నుంచే పవన్‌ పోటీ చేస్తాడంటూ పొలిటికల్‌ సర్కిల్‌లో టాక్‌
 • గత ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసి ఓడిన పవన్‌
 • టీడీపీతో ఈ ఎన్నికలకు పొత్తుతో వెళ్లాలని జనసేన నిర్ణయం
 • చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడే ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌
 • నేటి సమావేశానికి టీడీపీ నేతల డుమ్మా?
 • టీడీపీతో కలవడం బీజేపీకి ఇష్టం లేదని.. బలవంతంగా తానే ఒప్పించానని విశాఖ కార్యకర్తలతో పవన్‌ వ్యాఖ్య
 • పవన్‌ వ్యాఖ్యలపై టీడీపీ నేతల అసంతృప్తి
 • రాజమండ్రి ఎయిర్‌పోర్టులో పవన్‌ ఆహ్వానానికి వెళ్లాల్సి ఉన్నా.. దూరంగా ఉన్న వైనం
 • టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా సీట్ల పంపకంపై ఇంకా రాని క్లారిటీ

07:27 AM, Feb 21st, 2024
మూడు రోజులైనా ఆగట్లేదు!

 • ఇంట్లో ఫ్యాన్..
 • ఇంటి బయట సైకిల్..
 • సింక్ లో టీ గ్లాస్..
 • ఆదివారం రాప్తాడు వైఎస్సార్‌సీపీ సిద్ధం సభలో సీఎం జగన్‌ పంచ్‌ డైలాగులు
 •  ఇది విశ్వసనీయతకు, మోసకారితనానికి మధ్య జరుగుతున్న యుద్ధమన్న సీఎం జగన్‌ 
 • కౌరవసేన వంటి టీడీపీ కూటమికి ఎదురుగా వెళుతున్నది అభిమన్యుడు కాదు.. గాండీవి అర్జునుడన్న సీఎం జగన్
 • తన వెనుక శ్రీకృష్ణుడిలా ప్రజలు ఉన్నారని తెలిపారు.
 • సోషల్‌ మీడియాలో రాప్తాడు పంచ్‌ డైలాగులు విపరీతంగా వైరల్‌

07:23 AM, Feb 21st, 2024
వైఎస్సార్‌సీపీకి లేదు పోటీ!

 • రాజ్యసభ మూడు స్థానాలు వైఎస్సార్ సీపీ కైవసం
 • ఏకగ్రీవంగా మూడు స్థానాలు వైసీపీ గెలుచుకున్నట్టు ప్రకటించిన ఎన్నికల కమిషన్
 • రాజ్యసభ సభ్యులుగా వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి ఏకగ్రీవం
 • అధికారికంగా ప్రకటించిన ఎన్నికల కమిషన్

06:58 AM, Feb 21st, 2024
యూజ్‌ అండ్‌ త్రోలో బాబుని మించినవాళ్లు లేరేమో!

 • చంద్రబాబు పాలసీ అయిన యూజ్ అండ్ త్రో దెబ్బకు మరో నాయకుడు బలి 
 • టీడీపీకి నూజివీడు మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వర రావు గుడ్‌బై
 • కష్టకాలంలో ఉన్నప్పుడు తనను వాడుకుని ఇప్పుడు తనను పక్కన పెట్టేస్తున్నారంటూ ముద్రబోయిన అవేదన
 • చంద్రబాబు తనను నమ్మించి మోసం చేశారని ముద్రబోయిన మండిపాడు
 • నూజివీడు ఇంచార్జిగా తప్పించడానికి నిరసిస్తూ టీడీపీకి రాజీనామా

06:42 AM, Feb 21st, 2024
అరరె.. బాబు మర్చిపోయారే!

 • ఓటమి భయం బాబు మొహంలోనే కాదు.. మాటల్లో కూడా
 • ప్రజలకి రోజూ డబ్బా కొడుతున్న హామీనే మర్చిపోయావా?
 • ఇక దాన్ని చిత్తశుద్ధితో అమలు చేయగలవా చంద్రబాబూ?
 • 2014లో ఇలానే 650 హామీలు ఇచ్చి మర్చిపోయావ్! 
 • జనాలకీ గుర్తుండకూడదని మేనిఫెస్టోని మాయం చేశావ్.
 • కానీ ప్రజలు తెలివైనోళ్లు బాబూ..!!

06:30 AM, Feb 21st, 2024
అసెంబ్లీకి దారేదీ? పవన్‌ రూటేదీ?

 • ఏం తేల్చకుండానే ముగిసిన పవన్ కల్యాణ్ రాజమండ్రి పర్యటన
 • రేపు మంగళగిరి నుంచి భీమవరం పర్యటనకు వెళ్లనున్న పవన్ కల్యాణ్
 • రాజమండ్రి రూరల్ టికెట్ నాకేనంటూ ప్రకటించిన జనసేన నేత కందుల దుర్గేష్
 • అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారని తెలిపిన కందుల దుర్గేష్
 • రాజమండ్రి రూరల్, రాజానగరం నుంచి పోటీ చేయడం ఖాయమని చెప్పిన పవన్
 • జనసేన నుంచి రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా కందుల దుర్గేష్ పేరు ఖరారు
 • టీడీపీ అధిష్ఠానంతో కలిసి త్వరలో అధికారికంగా ప్రకటిస్తామన్న పవన్ కల్యాణ్
 • రాజానగరం నుంచి జనసేన పోటీ చేయడం ఖాయం...అభ్యర్థి పై క్లారిటీ ఇస్తామంటున్న పవన్

whatsapp channel

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top