సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. 28 జిల్లాల పరిధిలోని 582 జెడ్పీటీసీ స్థానాలతో పాటు 7,844 ఎంపీటీసీ స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. ఎంపీటీసీ స్థానాలకు 18,952 మంది, జెడ్పీటీసీ స్థానాలకు 2,169 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 21,121 మంది అభ్యర్థులు పరిషత్ ఎన్నికల బరిలో ఉన్నారు. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ మొదలవుతుంది.


