చంద్రగిరి నియోజకవర్గంలో పోలింగ్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు | High Court issues key orders on polling in Chandragiri constituency | Sakshi
Sakshi News home page

చంద్రగిరి నియోజకవర్గంలో పోలింగ్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు

Nov 4 2026 5:51 AM | Updated on Nov 4 2026 5:51 AM

High Court issues key orders on polling in Chandragiri constituency

పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టుగా హైకోర్టుకు జిల్లా పరిషత్‌ సీఈఓ ఇచ్చిన నివేదిక

ప్రతి పోలింగ్‌ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశం

పోలింగ్‌ మొత్తాన్ని రికార్డు చేసి, కోర్టుకు సమర్పించాలని స్పష్టీకరణ 

వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి వెల్లడి  

తిరుపతి రూరల్‌: చంద్రగిరి నియోజకవర్గంలో ఈనెల 5న జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్‌లో అక్రమాలకు చెక్‌ పెట్టేలా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు వైఎస్సార్‌సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి తెలిపారు. స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో చోటు చేసుకున్న అక్రమాలు, దాడులు, దౌర్జన్యాలపై దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు మోహిత్‌ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

చంద్రగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రతి పోలింగ్‌ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, పోలింగ్‌ మొత్తాన్ని రికార్డు చేయాలని హైకోర్టు ఆదేశించినట్టు వివరించారు. సీసీ కెమెరాల ఫుటేజిని భద్రపరిచి న్యాయ స్థానానికి సమర్పించాలని సూచించినట్టు మోహిత్‌రెడ్డి వెల్లడించారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement