రంగంలోకి ట్రబుల్‌ షూటర్‌.. నేతలతో అమిత్‌ షా రహస్య మంతనాలు | Amit Shah To Meet Shinde, Fadnavis And Ajit Pawar Over Seat-Sharing | Sakshi
Sakshi News home page

రంగంలోకి ట్రబుల్‌ షూటర్‌.. నేతలతో అమిత్‌ షా రహస్య మంతనాలు

Mar 6 2024 8:03 AM | Updated on Mar 6 2024 9:38 AM

Amit Shah To Meet Shinde, Fadnavis And Ajit Pawar - Sakshi

లోక్‌ సభ ఎన్నికల నేపథ్యంలో మహరాష్ట్ర రాజకీయం వేడెక్కింది. లోక్‌సభలో ప్రాతినిధ్యం వహించే రెండవ అత్యధిక పార్లమెంట్‌ (48) స్థానాలున్న మహరాష్ట్రలోని మహాయుతి (బీజేపీ, శివసేన-షిండే వర్గం, ఎన్సీపీ-అజిత్‌పవార్‌ వర్గం) కూటమి ప్రభుత్వంలో సీట్ల పంపకం సంక్షిష్టంగా మారింది. 

బలాబలాలు తమకే ఎక్కువ ఉన్నాయని, కాబట్టే మాకే ఎక్కువ సీట్లు కేటాయించాలని శివసేన (షిండే వర్గం), అజిత్‌ పవార్‌ నాయకత్వంలోని ఎన్సీపీ పట్టుబడుతుంది. అయితే, ఈ సీట్ల పంపకాన్ని ఓ కొలిక్కి తెచ్చేందుకు బీజేపీ ట్రబుల్ షూటర్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. 

కీలక నేతలతో అమిత్‌ షా వరుస భేటీలతో సీట్ల పంపంకం సానుకూలంగా జరిగే అవకాశం ఉందని పలు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇక అమిత్ షా మంగళవారం రాత్రి 10.15 గంటల ప్రాంతంలో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్‌తో భేటీ అయ్యారు. 

ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో మొదటి 30 నిమిషాల పాటు చర్చలు జరిపారు. అనంతరం ఆ ఇద్దరు నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తర్వాత మరో 50 నిమిషాల పాటు హోంమంత్రి, ముఖ్యమంత్రి షిండే మధ్య చర్చలు జరిగాయి. ఈ అంశంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement