పవనిజం కాదు.. బ్రోకరిజం | Adapa Seshu comments over Pawan Kalyan | Sakshi
Sakshi News home page

పవనిజం కాదు.. బ్రోకరిజం

Jun 24 2023 4:27 AM | Updated on Jun 24 2023 8:48 AM

Adapa Seshu comments over Pawan Kalyan - Sakshi

సాక్షి, అమరావతి: పొలిటికల్‌ బ్రోకర్‌ పవన్‌ కళ్యాణ్‌ ఓ జోకర్‌లా తయారయ్యాడని, ఆయనది పవనిజం కాదు.. బ్రోకరిజం, జోకరిజం అని కాపు సంక్షేమ, అభి­వృద్ధి సంస్థ చైర్మన్‌ అడపా శేషగిరి ఎద్దేవా చేశా­రు. ఆయన శుక్రవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టును ఎల్లో పేపర్‌పై రాసి నాదెండ్ల మనోహర్‌ అందిస్తుంటే పవన్‌ చదువుతుండటం సిగ్గుచేటన్నారు. వంగవీటి రాధా, రంగాలను చంపించిన వారికి రాజకీయ మేలు చేసేందుకు పవన్‌ పడుతున్న తాపత్రయాన్ని చూసి కాపులు రగిలిపోతున్నారన్నారు.

ఎక్కడి నుంచి పోటీ చేయాలో పవన్‌కు స్పష్టత లేదని, అది కూడా చంద్రబాబే చెప్పా­లని అన్నారు. కాకినాడలో పోటీ చేయాలని ద్వారంపూడి సవాల్‌ చేస్తే పారిపోయాడన్నారు. కాపుల కోసం త్యాగాలు చేసిన కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను బూతులు తిడుతూ జన సైనికులు రాస్తున్న లేఖలకు పవనే బాధ్యత వహించాలని అన్నారు. పిఠాపురంలో పోటీ చెయ్యాలని ముద్రగడ చేసిన సవాల్‌ను స్వీకరించాలని, కాపులు ముద్రగడ వైపో, పవన్‌ వైపో తేలిపోతుందని చెప్పారు.

రెండు చోట్ల ఓడించారనే కక్షతో కాపులను నాశనం చేయాలని పవన్‌ కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు, పవన్‌కు ఎప్పుడో బైబై చెప్పే­శారని, మరోసారి వారికి భంగపాటు తప్పదని అన్నారు. ముద్రగడకు లేఖ రాసే స్థాయి కొబ్బరి చిప్పలు ఏరుకునే బుద్ధా వెంకన్నకు లేదన్నారు. కాపుల కోసం ఉద్యమించిన ముద్రగడతోపాటు పలువురిపై చంద్రబాబు అక్రమ కేసులు బనాయించి వేధిస్తే, సీఎం వైఎస్‌ జగన్‌ ఆ కేసులు ఎత్తివేసి అండగా నిలిచారని చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement